లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Technology

బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. అన్ని ప్లాన్లపై 10శాతం డిస్కౌంట్!

Published

on

BSNL offer flat 10percent discount to all government employees : ప్రభుత్వ టెలికం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ కస్టమర్లకు కొత్త ఆఫర్ ప్రవేశపెడుతోంది. ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ ప్లాన్ తీసుకొస్తోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల ఎంపిక చేసుకున్న అన్ని ప్లాన్లపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

ల్యాండ్ లైన్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్, ఫైబర్ టు హోం ఇంటర్నెట్ ప్లాన్లపై కూడా డిస్కౌంట్ అందించనుంది. వచ్చే ఫిబ్రవరి నెలలో టెలికం కంపెనీ 10 డిస్కౌంట్ ఆఫర్ తీసుకురానుంది. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ డిస్కౌంట్ ఆఫర్ కు అర్హులు.

ల్యాండ్ లైన్ నుంచి ఫైబర్ టూ హోం ప్లాన్ల వరకు ఏ రీచార్జ్ ప్లాన్ ఎంచుకున్నా దానిపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు 5 శాతం ప్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఇప్పుడు ఆ డిస్కౌంట్ ను 10 శాతానికి పెంచాలని కంపెనీ నిర్ణయించింది.