Chemical Stock: లక్ష రూపాయల పెట్టుబడి పదేళ్లలో రూ.కోటిగా మారింది

స్టాక్ మార్కెట్లో అమ్ముతూ.. కొంటూ ఉండేవారికి ఎప్పుడూ కూడా డబ్బులు మిగలవు

Chemical Stock: లక్ష రూపాయల పెట్టుబడి పదేళ్లలో రూ.కోటిగా మారింది

Money Stock

Chemical Stock: స్టాక్ మార్కెట్లో అమ్ముతూ.. కొంటూ ఉండేవారికి ఎప్పుడూ కూడా డబ్బులు మిగలవు అని నిపుణులు చెబుతుంటారు. దీపక్ నైట్రైట్ షేర్లు దీనికి అద్భుతమైన ఉదాహరణ. పదేళ్ల క్రితం 23 ఆగస్ట్ 2021న రూ.18.50గా ఉన్న ఈ స్టాక్ విలువ ఇప్పుడు రూ.2055కి చేరుకుంది. పదేళ్ల కాలంలో దాదాపుగా 11వేల శాతం షేర్ హోల్డర్‌లకు రాబడిని అందించింది.

దీపక్ నైట్రెట్ ఇన్వెస్టర్ల పంట పండించి, భారీ లాభాన్ని అందించగా.. గత పదేళ్ల కాలంలో ఈ షేర్ ఏకంగా 11వేల శాతం పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లకు కళ్లుచెదిరే లాభాన్ని అర్జించి పెట్టింది. ఏకంగా కోటీశ్వరులను చేసేసింది. పదేళ్ల కింద ఈ షేరులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు మీకు రూ.1.11 కోట్లు వచ్చేవి. మార్కెట్ నిపుణుల ప్రకారం చూస్తే, ఈ షేరు ధర రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చని తెలుస్తోంది.

ఈ షేరు రానున్న కాలంలో రూ.2100 స్థాయికి చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే మార్కెట్‌లో డబ్బులు పెట్టే వారు జాగ్రత్తగా ఉండాలి. భారీ రిస్క్ ఉంటుంది. ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహా తీసుకోండి. గత ఆరు నెలల్లో దీపక్ నైట్రైట్ షేర్ ధర గత నెలలో దాదాపు 7 శాతం వాటాను పెంచుకుంది. కెమికల్ స్టాక్ దాదాపు 55 శాతం రాబడిని ఇచ్చింది.

భారతదేశంలో 2021 లో మల్టీబ్యాగర్ స్టాక్‌లలో ఇది ఒకటి కాగా.. వాటాదారులకు దాదాపు 172 శాతం రాబడిని ఇచ్చింది. గత 5 సంవత్సరాలలో, దీపక్ నైట్రైట్ షేర్లు పెట్టుబడిదారులకు దాదాపు 1940 శాతం రాబడిని అందించాయి. ఏదేమైనా, 10 సంవత్సరాల క్రితం ఈ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు మాత్రం అదృష్టవంతులే.