BGAUSS: 100 శాతం మేడ్‌ ఇన్‌ ఇండియా విద్యుత్‌ స్కూటర్‌ సీ-12 విడుదల చేసిన బిగాస్

వినియోగదారులు తాజా BG C-12 విద్యుత్‌ స్కూటర్‌లను కంపెనీ వెబ్‌సైట్‌ లేదా దగ్గరలోని డీలర్‌షిప్‌ వద్ద బుక్‌ చేసుకోవచ్చు. BG C-12 ప్రారంభ ధర 97,999 రూపాయలు (పరిమిత స్టాక్‌ వరకూ). BG C-12 రెగ్యులర్‌ ధర ఫేమ్‌ 2 (రాయితీ 48వేల రూపాయలు మినహాయించి) 1,04,999 రూపాయలు ఉంటుందని కంపెనీ తెలిపింది.

BGAUSS: 100 శాతం మేడ్‌ ఇన్‌ ఇండియా విద్యుత్‌ స్కూటర్‌ సీ-12 విడుదల చేసిన బిగాస్

BG C12 Electric scooter

BGAUSS: బిగాస్ (BGAUSS) ఆటో ప్రైవేట్‌ లిమిటెడ్‌ తమ ప్రతిష్టాత్మక ఈవీ స్కూటర్‌ బీఐ సీ-12ను శుక్రవారం విడుదల చేసింది. డీ15, బీ8, ఏ2ల విజయాన్ని సీ-12 సైతం కొనసాగిస్తుందని విడుదల సందర్భంగా యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక కొత్త ప్రోడక్ట్ విషయానికి వస్తే.. ఇది అత్యంత శక్తివంతంగా ఉండటంతో పాటుగా ఆకర్షణీయంగా, ప్రీమియం స్కూటర్‌ అయినప్పటికీ అత్యంత అందుబాటు ధరలో లభ్యం కానుంది. పూర్తిగా 100 శాతం మేడ్‌ ఇన్‌ ఇండియా అయిన ఈ విద్యుత్‌ స్కూటర్‌ సీ-12 భద్రత, సౌకర్యం వంటి కీలక ప్రాధాన్యతలు కలిగిన 20కు పైగా ఫీచర్లతో వస్తున్నాయట.

Twitter Bird Logo : బుల్లిపిట్ట తిరిగొచ్చింది.. ట్విట్టర్‌‌ ‘డాగీ కాయిన్’ లోగో మార్చేశాడు.. మస్క్ మామూలోడు కాదుగా..!

సీ-12 విడుదల సందర్భంగా బిగాస్ ఆటో ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఫౌండర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హేమంత్‌ కాబ్రా మాట్లాడుతూ ‘‘ఫేమ్‌ సర్టిఫైడ్‌ వాహనం సీ-12ఐ మ్యాక్స్‌. పరిశ్రమలో మొట్టమొదటి తరహా ఫీచర్లు అయినటువంటి బూట్‌ స్పేస్‌ను ఇది కలిగి ఉంది. దీనిలో ఫుల్‌ ఫేస్‌ హెల్మెట్‌ భద్రపరచవచ్చు. కుటుంబానికి అనువుగా పొడవాటి, అత్యంత సౌకర్యవంతమైన సీట్‌ కలిగి ఉండటంతో పాటుగా ఏఆర్‌ఏఐ సర్టిఫికేషన్‌తో సంబంధం లేకుండా 143 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వాటర్‌ ఫ్రూఫ్‌ ఐపీ67 రేటెడ్‌ విద్యుత్‌ మోటర్‌, బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్‌లో 3.2 కిలోవాట్‌ హవర్‌–క్యాన్‌ ఎనేబల్డ్‌ లిథియం–అయాన్‌ బ్యాటరీ ఉంటుంది’’ అని అన్నారు.

OnePlus Nord CE 3 Lite Price : అదిరే ఫీచర్లతో వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్ 5G ఫోన్ వచ్చేసిందోచ్.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు!