2019 Review : రూ.40వేల లోపు Top 5 స్మార్ట్ ఫోన్లు ఇవే

  • Published By: sreehari ,Published On : December 20, 2019 / 09:28 AM IST
2019 Review : రూ.40వేల లోపు Top 5 స్మార్ట్ ఫోన్లు ఇవే

ప్రపంచవ్యాప్తంగా ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతాకాదు. 2019లో భారత్ మార్కెట్లో రిలీజ్ అయిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లు సేల్స్ సునామీ సృష్టించాయి. అద్భుతమైన పర్ఫామెన్స్‌తో పాటు ఫీచర్లు యూజర్లను మరింత ఎట్రాక్ట్ చేశాయి. ఈ ఏడాది దేశీయ మార్కెట్లో చైనా దిగ్గజాలైన షియోమీ, రెడ్ మి, ఒప్పో, వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ మేకర్లదే హవా నడుస్తోంది. కాస్ట్‌కు తగినట్టుగానే ఫీచర్లు కూడా అదే రేంజ్‌లో ఉండటంతో ఈ తరహా ఫ్లాగ్ షిప్ ఫోన్లను సొంతం చేసుకునేందుకు యూజర్లంతా ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇతర మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఫ్లాగ్ షిప్ ఫోన్లదే ట్రెండ్ నడుస్తోంది. 2019 ఏడాదిలో భారత మార్కెట్లో రిలీజ్ అయిన రూ.40వేల లోపు స్మార్ట్ ఫోన్లలో టాప్ 5 స్మార్ట్ ఫోన్ల ఫీచర్లు, స్పెషిఫికేషన్లు వాటి పర్ఫామెన్స్ ఎలా ఉన్నాయో ఒక్కొక్కటిగా రివ్యూ రూపంలో అందిస్తున్నాం. మీకు నచ్చిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సెలెక్ట్ చేసుకుని కొనుగోలు చేసుకోవచ్చు.

1. OnePlus 7T (Rs 37,999):

చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ Oneplus భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన 7సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్లలో OnePlus 7T మోడల్ ఇదొకటి. 6.55 అంగుళాలతో ఫుల్ HD  ప్లస్ AMOLED డిస్‌ప్లే, 90Hz రీప్రెష్ రేట్, 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వచ్చింది. సూపర్ పవర్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 855+తో పాటు 8GB RAM+ 256GB ఇంటర్నల్ మెమెరీ (UFS 3.0)తో ఉంది.
Oneplus

ఇతర వన్ ప్లస్ 7T స్పెషిఫికేషన్లలో ట్రిపుల్ కెమెరా సెటప్ (48MP+16MP+12MP) సెన్సార్లు ఎట్రాక్షన్‌గా ఉన్నాయి. 16MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే 3,800mAh బ్యాటరీతో సామర్థ్యంతో 30T Warp ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. OnePlus 7T మోడల్ ధర రూ.37వేల 999లతో అందుబాటులో ఉంది. 

2. Realme X2 Pro (Rs 29, 999):
ఒప్పో సబ్ బ్రాండ్ రియల్ మి నుంచి ఈ ఏడాది మార్కెట్లో రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్లలో Realme X2 Pro ఒకటి. 6.5 అంగుళాల సూపర్ AMOLED ఫుల్ HD+డిస్ ప్లేతో పాటు 90Hz రీప్రెష్ రేట్ డిస్‌ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియోతో ఎట్రాక్టీవ్ డిజైన్ ఉంది. ప్రాసెసర్ విషయానికి వస్తే.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 855+ సామర్థ్యంతో 12GB RAM, 256GB UFS 3.0 స్టోరేజీ కెపాసిటీ ఉంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ 64MP (f/1.8 + 13MP f/2.5) టెలిఫొటో లెన్స్‌తో 20X డిజిటల్ జూమ్ చేసుకోవచ్చు.
Realmes

అలాగే 8MP f/2.2 115 డిగ్రీల అల్ట్రావైడ్ లెన్స్, 2MP (f/2.4) పొర్టరైట్ సెన్సార్ సెటప్ ఉంది. వాటర్ డ్రాప్ నాచ్‌లో 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇతర రియల్ మి X2Pro స్పెషిఫికేషన్ల మాదిరిగా 4,000mAh బ్యాటరీ సామర్థ్యంతో 50W సూపర్VOOC ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. అదనంగా, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ఫ్రింట్ స్కానర్, కలర్ OS 6.1 బేసిడ్ ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. దీని ధర మార్కెట్లలో రూ.29 వేల 999తో అందుబాటులో ఉంది.

3. Redmi K20 Pro (Rs 25,999):
షియోమీ సబ్ బ్రాండ్ Redmiకి కూడా భారత మార్కెట్లో మంచి క్రేజ్ ఉందనే చెప్పాలి. రెడ్ మి నుంచి వచ్చిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లకు సైతం మంచి ఆదరణ ఉంది. ఫ్లాగ్ షిప్ రేంజ్ ఫోన్లలో Redmiలో K సిరీస్ ఫోన్లలో Redmi K20.. 6.39 అంగుళాల ఫుల్ HD+ Horizon AMOLED డిస్‌ప్లేతో 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో వచ్చింది.ప్రాసెసర్ వచ్చేసి క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 855 SoC సామర్థ్యంతో పాటు 8GB ర్యామ్, 256GB ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
Redmi

కెమెరా ఫీచర్లలో K20ప్రో ట్రిపుల్ కెమెరా సెటప్ స్పెషల్ ఎట్రాక్షన్. 48MP f/1.75 ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రా వైడ్ లెన్స్, 8MP టెలిఫొటో లెన్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. సెల్ఫీల కోసం ప్రత్యేకించి 20MP పాప్ అప్ కెమెరా ఉంది. 4,000mAh బ్యాటరీ సామర్థ్యంతో 27W సోనిక్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ కూడా అదనపు ఫీచర్ గా చెప్పవచ్చు. దీని ధర మార్కెట్లో రూ.25వేల 999 నుంచి అందుబాటులో ఉంది.

4. Asus 6Z (Rs 27,999):
Asus బ్రాండ్ నుంచి z సిరీస్ లో వచ్చిన ఫ్లాగ్ షిప్ రేంజ్ మోడల్ Asus 6z ఇదొకటి. 6.4 అంగుళాల ఫుల్ HD+ ఆల్ స్ర్కీన్ డిస్ ప్లే (1080×2340)ఫిక్సల్స్ రిజుల్యుషన్‌తో వచ్చింది. డ్యుయల్ కెమెరా రోటేటింగ్ యూనిట్ స్పెషల్ ఎట్రాక్షన్ గా చెప్పవచ్చు. రెండువైపులా పనిచేసే ఈ కెమెరా సెటప్‌తో రియర్ కెమెరాగానూ ఫ్రంట్ కెమెరా మాదిరిగా రొటేట్ చేసుకోవచ్చు. అల్ట్రా వైడ్ సెల్ఫీలకు ఫ్రంట్ కెమెరా ఫర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఫొటోలే కాదు.. 4K 60fps వీడియో క్వాలిటీ అందిస్తుంది.
asus6z

కెమెరాల్లో 48MP Sony IMX 586 f/1.79 ప్రైమరీ సెన్సార్, 13MP 145డిగ్రీల కోణంలో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే.. Asus 6Z స్పెషిఫికేషన్లలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్, 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీ అందిస్తోంది. బ్యాటరీ 5,000mAh బ్యాటరీ సామర్థ్యంతో క్విక్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 10W రివర్స్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ కూడా ఉంది.

5. Oppo Reno 10x Zoom (Rs 39,990):
ఒప్పో నుంచి రెనో X సిరీస్లో Reno 10X zoom మోడల్ ఒకటి. 6.65 అంగుళాల ఫుల్ HD+ AMOLED నో నాచ్ స్ర్కీన్‌తో పాటు 93.1% స్ర్కీన్-టీ0-బాడీ రేషియో ఉంది. ప్రాసెసర్ విషయంలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్, 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజీ అందిస్తోంది.
oppo

వెనుక వైపు క్వాడ్ కెమెరా సెటప్ (48MP+8MP+13MP+2MP) సెన్సార్ సెటప్ అందిస్తోంది. సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరాతో షార్క్ ఫిన్ పాప్ అప్ మోటార్ ఎట్రాక్షన్ గా చెప్పవచ్చు. రెనో 10x zoomలో బ్యాటరీ మాత్రం 4,065mAh సామర్థ్యంతో VOOC 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నిక్ సపోర్ట్ చేస్తుంది.