2023 Tata Harrier Launch : 2023 టాటా హారియర్ SUV వచ్చేసిందోచ్.. 10 కొత్త ADAS ఫీచర్లు.. భారత్‌లో ధర ఎంతంటే?

2023 Tata Harrier Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) నుంచి 2023 టాటా హారియర్‌ను అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థ (ADAS)తో లాంచ్ చేసింది.

2023 Tata Harrier Launch : 2023 టాటా హారియర్ SUV వచ్చేసిందోచ్.. 10 కొత్త ADAS ఫీచర్లు.. భారత్‌లో ధర ఎంతంటే?

2023 Tata Harrier ADAS launched in India _ See prices And Specifications here

2023 Tata Harrier Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) నుంచి 2023 టాటా హారియర్‌ను అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థ (ADAS)తో లాంచ్ చేసింది. అప్‌‌‌గ్రేడెడ్ SUV ఫీచర్లతో ధర రూ. 15 లక్షల నుంచి మొదలై రూ. 24.07 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) వరకు ఉంటుంది. అవుట్‌గోయింగ్ హ్యారియర్ ధర రూ. 15 లక్షల నుంచి రూ. 22.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ కొత్త టాటా హారియర్ 2023 MG హెక్టర్, జీప్ కంపాస్‌లకు పోటీగా కొనసాగుతుంది. 2023 హారియర్‌లో 10 కొత్త ADAS ఫీచర్లు ఉన్నాయి.

2023 Tata Harrier ADAS launched in India _ See prices And Specifications here

2023 Tata Harrier ADAS launched in India

ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హైబీమ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ చేంజ్ అలర్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, డోర్ ఓపెన్ అలర్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, రియర్ క్రాస్-ట్రాఫిక్ అలర్ట్, రియర్ టచ్ వార్నింగ్ ఉన్నాయి. కొత్త హారియర్‌కు 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ Apple CarPlay, Android Autoతో కూడిన కొత్త 10.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త 7-అంగుళాల డిజిటల్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

Read Also : iPhone 15 Series : అద్భుతమైన కలర్ ఆప్షన్లలో ఐఫోన్ 15 సిరీస్ వస్తోంది.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

కొత్త టాటా హారియర్ 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇప్పుడు రియల్ డ్రైవింగ్ ఎమిషన్ (RDE) నిబంధనలకు అనుగుణంగా ఉంది. E20 ఇంధనానికి అనుకూలంగా ఉంది. ఇంజిన్ 170PS, 350Nmతో వచ్చింది. 6-స్పీడ్ MT లేదా 6-స్పీడ్ ATతో వస్తుంది. వేరియంట్ వారీగా చూస్తే.. 2023 టాటా హారియర్ MT ధరలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ఈ కింద ఉన్నాయి.. అవేంటో ఓసారి చూద్దాం..

XE – రూ. 15 లక్షలు
XM – రూ. 16.45 లక్షలు
XMS – రూ. 17.70 లక్షలు
XT+ – రూ. 18.69 లక్షలు
XT+ డార్క్ – రూ. 19.04 లక్షలు
XZ – రూ. 19.24 లక్షలు
XZ డ్యూయల్ టోన్ – రూ. 19.44 లక్షలు
XZ+ – రూ. 21.32 లక్షలు
XZ+ డ్యూయల్ టోన్ – రూ. 21.52 లక్షలు
XZ+ డార్క్ – రూ. 21.67 లక్షలు
XZ+ రెడ్ డార్క్ – రూ. 21.77 లక్షలు

2023 Tata Harrier ADAS launched in India _ See prices And Specifications here

2023 Tata Harrier ADAS launched in India

వేరియంట్ వారీగా 2023 టాటా హారియర్ AT ధరలు (ఎక్స్-షోరూమ్, న్యూఢిల్లీ) ఈ కింది విధంగా ఉన్నాయి.

XMAS – రూ. 19 లక్షలు
XTA+ – రూ. 19.99 లక్షలు
XTA+ డార్క్ – రూ. 20.34 లక్షలు
XZA – రూ. 20.54 లక్షలు
XZA డ్యూయల్ టోన్ – రూ. 20.74 లక్షలు
XZA+ – రూ. 22.62 లక్షలు
XZA+ డ్యూయల్ టోన్ – రూ. 22.82 లక్షలు
XZA+ డార్క్ – రూ. 22.97 లక్షలు
XZA+ రెడ్ డార్క్ – రూ. 23.07 లక్షలు
XZA+ (O) – రూ. 23.62 లక్షలు
XZA+ (O) డ్యూయల్ టోన్ – రూ. 23.82 లక్షలు
XZA+ (O) డార్క్ – రూ. 23.97 లక్షలు
XZA+ (O) రెడ్ డార్క్ – రూ. 24.07 లక్షలు

Read Also : Nokia G22 Launch : నోకియా నుంచి మూడు సరికొత్త ఫోన్లు.. G22 ఫోన్ మీకు మీరే రిపేర్ చేసుకోవచ్చు, 3 రోజులు బ్యాటరీ లైఫ్ కూడా..!