Whale Vomit : రూ.28 కోట్లకుపైగా విలువ చేసే తిమింగలం వాంతి..సముద్రంలో మత్స్యకారులు చేపలు పడుతుండగా లభ్యం

కేరళలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అనుకోని అదృష్టం వరించింది. చేపల కోసం వేట సాగిస్తుండగా.. మత్స్యకారులకు కోట్ల రూపాయల విలువైన తిమింగలం వాంతి దొరికింది. ఆ మత్స్యకారులకు లభించిన తిమింగలం వాంతి బరువు 28 కిలోల 400 గ్రాములు కాగా.. మార్కెట్‌లో దాని విలువ 28 కోట్లకు పైగానే ఉంటుందట.

Whale Vomit : రూ.28 కోట్లకుపైగా విలువ చేసే తిమింగలం వాంతి..సముద్రంలో మత్స్యకారులు చేపలు పడుతుండగా లభ్యం

whale vomit : కేరళలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అనుకోని అదృష్టం వరించింది. చేపల కోసం వేట సాగిస్తుండగా.. మత్స్యకారులకు కోట్ల రూపాయల విలువైన తిమింగలం వాంతి దొరికింది. ఆ మత్స్యకారులకు లభించిన తిమింగలం వాంతి బరువు 28 కిలోల 400 గ్రాములు కాగా.. మార్కెట్‌లో దాని విలువ 28 కోట్లకు పైగానే ఉంటుందట.

స్థానిక మత్స్యకారులు చేపలు పడుతుండగా.. తిమింగలం వాంతి నీటిపై తేలియాడింది. దాంతో వాంతిని మొదట చూసిన మత్స్యకారులు అనుమానపడ్డారు. ఆ తర్వాత దగ్గరకు వెళ్లి తిమింగలం వాంతిగా గుర్తించారు. బోటులో దానిని ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత తిమింగలం వాంతిని కోస్టల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Whale Vomit: తిమింగలం 30కిలోల వాంతి.. రూ.10కోట్లు వచ్చిపడ్డాయ్!!

అనంతరం అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని తిమింగలం వాంతిని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. సుగంధ ద్రవ్యాల తయారీకి తిమింగలం వాంతిని ఉపయోగిస్తారని అధికారులు తెలిపారు. ఒక కిలో అంబర్‌గ్రిస్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు కోటి రూపాయలు వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.