అనిల్ అంబానీ అప్పుల రికవరీ కోసం.. రంగంలోకి 3 చైనా బ్యాంకులు

  • Published By: sreehari ,Published On : September 28, 2020 / 06:46 PM IST
అనిల్ అంబానీ అప్పుల రికవరీ కోసం.. రంగంలోకి 3 చైనా బ్యాంకులు

Anil Ambani worldwide assets : అనిల్ అంబానీ అప్పుల సంక్షోభంలో చిక్కుకున్నారు. చేసిన అప్పులను తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో అంబానీ చేతులేత్తేశారు. అంబానీ కంపెనీ Rcom తీసుకున్న సుమారు 716 మిలియన్ డాలర్లు (రూ.5,300 కోట్లు) రుణాలను తిరిగి రాబట్టుకునేందుకు చైనాకు చెందిన మూడు బ్యాంకులు రంగంలోకి దిగాయి. ఎలాగైన తమ రుణాలను రాబట్టుకునేందుకు చర్యలు చేపట్టాయి.



ప్రపంచవ్యాప్తంగా అనిల్ అంబానీకి చెందిన ఆస్తులపై మూడు చైనా బ్యాంకులు అంచనా వేసేందుకు రెడీ అయ్యాయి. కొత్త నివేదిక ప్రకారం.. కమర్షియల్ బ్యాంకు ఆఫ్ చైనా, ఎక్స్ పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంకు ఆఫ్ చైనా, చైనా డెవలప్ మెంట్ బ్యాంకులు తమ రుణాలను వసూలు చేసుకునేందుకు అవసరమైన చట్టపరమైన మార్గాలను ఉపయోగించు కోవాలని భావిస్తున్నాయి. యూకే కోర్టులో మాజీ రియలన్స్ కమ్యూనికేషన్స్ (RCom) చైర్మన్ అనిల్ పై క్రాస్ ఎగ్జానిమేనేషన్ విచారణ జరిగింది. లండన్ కోర్టు ఆదేశాలతో అంబానీ నుంచి బకాయిలను రాబట్టుకోవాలని చూస్తున్నాయి.

గతంలో 2012లో చైనాకు చెందిన మూడు బ్యాంకుల నుంచి RCom కంపెనీ.. అంబానీ పర్సనల్ గ్యారంటీతో 925 మిలియన్‌ డాలర్ల రుణం తీసుకుంది. దివాలాతీసిన ఆర్‌కామ్‌ ఈ రుణాన్ని పూర్తిగా చెల్లించలేకపోయింది. ఈ బకాయిల కోసం చైనా బ్యాంకులు కోర్టును ఆశ్రయించాయి. చైనా బ్యాంకులకు రూ .5,226 కోట్లు చెల్లించాలని మే 22న యూకే కోర్టు అనిల్ అంబానీని ఆదేశించింది.



జూన్ 29 నాటికి, అంబానీ చెల్లించాల్సిన అప్పు 717.67 మిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ మొత్తం బాకీలను చెల్లించలేనని అంబానీ వాపోయారు. కోర్టు ఫీజుల కోసం తనభార్య నగలు అమ్మి మామూలు జీవితాన్ని గడుపుతున్నానని చెప్పినా బ్యాంకులు వినే పరిస్థితి లేదు.

అయినా సరే బ్యాంకులు అప్పులు కట్టాల్సిందేనని గట్టిగా చెబుతున్నాయి. మరోవైపు SBI అనిల్ అంబానీపై వ్యక్తిగత దివాలా చర్యలకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో చైనా బ్యాంకులకు అడ్డుకట్ట పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా తమ బకాయిలను ఎలాగైనా వసూలు చేసుకోవాలని చైనా బ్యాంకులు పంతం పట్టి కూర్చొన్నాయి.



అంబానీ అప్పు తీసుకున్న అన్ని లోన్లపై మిగిలిన మొత్తాన్ని రాబట్టుకోవడమే కాకుండా చట్టపరమైన తమ హక్కులను రక్షించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. Rcom దివాలా చర్యలపై ఎస్బీఐ సుప్రీంను ఆశ్రయించడంతో ఇండియాలో అంబానీ ఆస్తులను రికవరీ చేయడంలో చైనా బ్యాంకులకు ఇబ్బంది తప్పేలా లేవు.

త్వరలో ఈ మూడు చైనా బ్యాంకులు భారత్ బయటి దేశాల్లోని అనిల్ అంబానీ ఆస్తుల అంచనా వేసేందుకు సిద్ధమయ్యాయి. ప్రపంచ ఆస్తులపై జూన్ 29న యూకే హైకోర్టు అంబానీని అఫడవిట్ ఫైల్ చేయాలని ఆదేశించింది. క్రాస్ ఎగ్జామినేషన్ లో అంబానీ తన ఆస్తుల వివరాలను థర్డ్ పార్టీలకు బహిర్గతం చేయరాదనే ఆదేశాలతో ఊరట లభించినట్టయింది. కానీ, అంబానీ వ్యక్తిగత క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.