మీ సేవింగ్స్‌కు గ్యారంటీ రిటర్న్స్ రావాలంటే ఇలా పెట్టుబడి పెట్టండి..

మీ సేవింగ్స్‌కు గ్యారంటీ రిటర్న్స్ రావాలంటే ఇలా పెట్టుబడి పెట్టండి..

investment-options

అన్నీ పెట్టుబడులు కచ్చితంగా లాభాలు తెచ్చిపెడతాయని నమ్మకాలు పెట్టుకోలేం. ఈక్విటీ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు పొందాలనుకునేవారు, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ పెట్టుబడులు పెట్టాలనుకునేవారు స్టెబలిటీ మీద ఫోకస్ పెట్టాలి. ఇన్వెస్టర్లు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే.. ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ కావాలా.. లేదా.. అధిక లాభాలు కావాలా అనేది ఆలోచించుకోండి.

పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్(పీపీఎఫ్):
మార్కెట్ రిస్క్ తో సంబంధం లేకుండా ఉండే సేఫెస్ట్ ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్ ఈ పీపీఎఫ్. 15ఏళ్ల తర్వాత మెచ్యురిటీ అవుతుంది. ఇంకా చేయాలనుకుంటే మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. ఒక్కో సిటిజన్ ఒక్క అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయగలరు. ఇన్ కమ్ ట్యాక్స్ చట్ట ప్రకారం.. ఈ అమౌంట్ కట్ అవుతుంది. దానికి 7.1శాతమే వడ్డీ వస్తుంది.

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్:
దేశంలో రిస్క్ లేకుండా ఉండే పెట్టుబడుల్లో ఎఫ్డీ(ఫిక్స్‌డ్ డిపాజిట్) ఒకటి. ఒకవేళ బ్యాంక్ ఫెయిల్ అయితే.. గవర్నమెంట్ రూ.5లక్షల వరకూ డిపాజిట్ చేస్తుంది. ఈ స్కీం సేవింగ్స్, ఫిక్స్‌‍డ్, రికరింగ్ అన్ని రకాల బ్యాంక్ డిపాజిట్లకు వర్తిస్తుంది. ప్రైవేట్ సెక్టార్, కో ఆపరేటివ్, ఇండియాలో ఉన్న విదేశీ బ్యాంకులకు కూడా ఇది వర్తిస్తుంది.

7.15% RBI ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్:
ఆర్బీఐ సేవింగ్స్ బాండ్ ఏడేళ్లలో మెచ్యురిటీ అవుతుంది. ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్ జులై 1నుంచి దీనిని అనుమతిస్తుంది. ప్రతి నెలలకోసారి ఫ్లోటింగ్ రేటను ఆర్బీఐ మారుస్తూ ఉంటుంది. ఇక ఇందులో పెట్టుబడి పెట్టాలనుకుంటే వెయ్యి రూపాయల నుంచి మొదలవుతుంది. పైగా ఈ పెట్టుబడికి లిమిట్ అంటూ లేదు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్:
పేరుకు తగ్గట్లుగానే ఈస్కీమ్ వయో వృద్ధుల కోసమే. ప్రస్తుతం దీనికి 7.4శాతం వడ్డీ దక్కుతుంది. కాకపోతే ఇందులో రూ.15లక్షలకు మించి పెట్టుబడి పెట్టడానికి లేదు. డిపాజిటర్లు భాగస్వామితో కలిసి అకౌంట్ లావాదేవీలు కొనసాగించొచ్చు. ఈ మెచ్యూరిటీ పీరియడ్ అనేది 5సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత కావాలంటే మరో మూడేళ్లకు పెంచుకోవచ్చు. దీనికి సంబంధించి మూడు నెలలకోసారి వడ్డీని ఇచ్చేస్తుంటారు. ఏప్రిల్, జులై, అక్టోబర్, జనవరిలో ఈ డబ్బులు అందుతాయి.

పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ నెలసరి ఆధాయ అకౌంట్(పీఓఎమ్ఐఎస్):
పీఓఎమ్ఐఎస్ అనేది ఐదేళ్ల ఇన్వెస్ట్‌మెంట్ ప్రోసెస్. గరిష్ఠంగా ఇందులో రూ.4.5లక్షల పెట్టుబడి మాత్రమే పెట్టగలం. జాయింట్ అకౌంట్ కావాలంటే.. రూ.9లక్షల డిపాజిట్ చేసుకోవచ్చు. దీని వడ్డీ రేటు 6.6%గా ఉంటుంది. పదేళ్లకు దీని మెచ్యురిటీ ఉంటుంది.

సుకన్యా సమృద్ధి అకౌంట్లు:
ఆడ శిశువులను సంరక్షించడానికి ఉపయోగపడే గవర్నమెంట్ స్కీమ్ ఇది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి పదేళ్ల లోపు ఆడపిల్లలకు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ప్రస్తుతం సుకన్యా సమృద్ధి అకౌంట్ 7.6శాతం వడ్డీని ఇస్తుంది. ఏటా వడ్డీని చక్రవడ్డీగా మారుస్తారు. అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి 15సంవత్సరాల వరకూ డిపాజిట్ చేసుకోవచ్చు. బాలిక వయస్సు 18ఏళ్లు నిండిన తర్వాత డబ్బులు కావాలంటే సగం వరకూ విత్ డ్రా చేసుకోవచ్చు. 21ఏళ్లు పూర్తయిన తర్వాత మొత్తం డబ్బు తీసేసుకోవచ్చు. ఈ స్కీం కింద ఐటీ చట్టం ప్రకారం.. రూ.1.50లక్షల ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంది.

5 ఇయర్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్(ఎన్ఎస్సీ):
మరో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఇది. పెట్టుబడి సేఫ్ గా ఉండాలనుకునేవారికి మనీ రొటోషన్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ చాయీస్. ఇందులో 6.8శాతం వడ్డీ సంవత్సరానికి వస్తుంది.