Adani Group : అదానీ.. కొంపకొల్లేరు.. కొనసాగుతున్న షేర్ల పతనం, రూ.9లక్షల కోట్లకుపైగా నష్టం

స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్లు నేల చూపులు చూస్తూనే ఉన్నాయి. అదానీ గ్రూప్ షేర్ల పతనం ఆగలేదు. జనవరి 24 నాటికి అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 19.20లక్షల కోట్లు ఉండగా.. 7 ట్రేడింగ్ సెషన్లలో 9లక్షల కోట్లకు పైగా విలువ ఆవిరైపోయింది.(Adani Group)

Adani Group : స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్లు నేల చూపులు చూస్తూనే ఉన్నాయి. ఇవాళ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసినా.. అదానీ గ్రూప్ షేర్ల పతనం మాత్రం ఆగలేదు. అదానీ గ్రూప్ లో ఏకంగా 6 కంపెనీల షేర్లు లోయర్ సర్క్యూట్ ను తాకాయి. గ్రూప్ ఫ్లాగ్ షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్ ప్రైజెస్ ఓ దశలో 52వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే చివరకు కోలుకుని నిన్నటికన్నా ఒక్క శాతం లాభాలతో ముగిసింది.

అదానీ పోర్ట్స్ మాత్రం 7.87 శాతం లాభాలతో ముగిసింది. అంబుజా సిమెంట్స్ 5.97శాతం, ఏసీసీ 4.6శాతం లాభపడ్డాయి. మిగిలిన కంపెనీల షేర్లు భారీగా పతనం కావడంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 10లక్షల కోట్ల రూపాయలకు పడిపోయింది. జనవరి 24 నాటికి అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 19.20లక్షల కోట్లు ఉండగా.. 7 ట్రేడింగ్ సెషన్లలో 9లక్షల కోట్లకు పైగా విలువ ఆవిరైపోయింది. అటు ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో 3 నుంచి 17వ స్థానానికి పడిపోయారు అదానీ.

Also Read..SBI..Adani : అదానీ గ్రూప్ సంస్థలకు SBI ఇచ్చిన రుణాలు ఎన్నివేల కోట్లో తెలుసా..?!

ఉదయం అన్ని కంపెనీల షేర్లు నేల చూపులు చూడటంతో ఫోర్బ్స్ కుబేరుల జాబితాలో 22వ స్థానానికి పడిపోయారు అదానీ. అయితే, అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ లాభాల్లో ముగియడంతో 17వ స్థానానికి చేరుకున్నారు.

హిండన్ బర్గ్ నివేదిక అదానీ వ్యాపార సామ్రాజ్యంపై పెను ప్రభావమే చూపింది. అదానీ గ్రూప్ లోని సంస్థలపై రుణభారం లక్షల కోట్లలో ఉందని, ఆ భారీ రుణాలు తీర్చే మార్గాలను వెదకడంలో అదానీ గ్రూప్ సంస్థలు విఫలమవుతున్నాయని హిండన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక ఎత్తిచూపింది. అంతే, ఒక్కసారిగా గౌతమ్ అదానీ సంపద భారీగా పతనమైంది. 3 రోజుల వ్యవధిలో రూ.5 లక్షల కోట్లను కోల్పోయారు.

Also Read..Adani Companies RBI : అదానీ సంస్థలకు ఇచ్చిన రుణాల వివరాలివ్వాలని.. వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు

తాజాగా అంతర్జాతీయ కుబేరుల జాబితాలో ఆయన స్థానం పడిపోయింది. ప్రస్తుతం ఆయన నికర సంపద విలువ 61.3 బిలియన్ డాలర్లు. ఇటీవలే అదానీని వెనక్కినెట్టి అంతర్జాతీయ స్థాయిలో నెంబర్ వన్ భారత కుబేరుడిగా ముఖేశ్ అంబానీ తన పాత స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడం తెలిసిందే. ముఖేశ్ అంబానీ నికర ఆస్తుల విలువ 82.2 బిలియన్ డాలర్లు.(Adani Group)

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇక బ్లూంబెర్గ్ ప్రపంచ కుబేరుల జాబితాలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ 217.5 బిలియన్ల డాలర్ల సంపదతో అగ్రస్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (183.2 బిలియన్ డాలర్లు), మూడో స్థానంలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ (136 బిలియన్ డాలర్లు) ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు