Adani-Cleartrip : ఫ్లిప్‌కార్ట్ సొంత యాప్ క్లియ‌ర్‌ట్రిప్‌లో అదానీ వాటా కొనుగోలు?!

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సొంత ట్రావెల్ యాప్ క్లియర్‌ట్రిప్ (Cleartrip)లో గౌతం అదానీ గ్రూప్ మైనార్టీ వాటాను కొనుగోలు చేసినట్టు తెలిసింది.

Adani-Cleartrip : ఫ్లిప్‌కార్ట్ సొంత యాప్ క్లియ‌ర్‌ట్రిప్‌లో అదానీ వాటా కొనుగోలు?!

Adani Picks Up Minority Stake In Flipkart's Cleartrip

Adani to Cleartrip minority stake : ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సొంత ట్రావెల్ యాప్ క్లియర్‌ట్రిప్ (Cleartrip)లో గౌతం అదానీ గ్రూప్ మైనార్టీ వాటాను కొనుగోలు చేసినట్టు తెలిసింది. క్లియర్ ట్రిప్.. ఆన్‌లైన్ ట్రావెల్ సర్వీసుల్లో దూసుకెళ్తున్న భారత్‌లోనే అతిపెద్ద ఎయిర్ పోర్ట్స్ ఆపరేటర్.. తాజాగా బిలియనీర్ గౌతం అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ క్లియ‌ర్ ట్రిప్ ప్రైవేట్ లిమిటెడ్‌లో వాటాల‌ను కొనుగోలు చేసింది. రెగ్యులేట‌రీ ఫైలింగ్‌లో భాగంగా ఈ విషయం తెలిసింది. ఈ క్లియ‌ర్ ట్రిప్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఇటీవలే టేకోవ‌ర్ చేయగా.. న‌వంబ‌ర్‌లో అదానీ గ్రూప్ ఒప్పందం పూర్త‌వుతుంద‌ని అంచనా.
Made In India : కార్బన్ నుంచి చౌకైన ధరకే స్మార్ట్ LED TV.. వెంటనే కొనేసుకోండి!

క్లియ‌ర్ ట్రిప్‌లో అదానీ గ్రూప్ కొనుగోలు చేసిన వాటా వివ‌రాలను అధికారికంగా వెల్లడించలేదు. వార్త‌ా నివేదికల ప్రకారం.. 20 శాతం వాటాను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. 2021 ఏప్రిల్‌లో క్లియ‌ర్ ట్రిప్‌ను ఫ్లిప్‌కార్ట్ టేకోవ‌ర్ చేసింది. దాంతో క్లియ‌ర్ ట్రిప్‌లో విమాన ప్ర‌యాణ బుకింగ్స్ 10రెట్లు వరకు పెరిగినట్టు తెలిసింది. అదానీ గ్రూప్ త్వ‌ర‌లో యూజర్లకు సూప‌ర్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే క్లియ‌ర్ ట్రిప్‌లో వాటాల కొనుగోలు ఆ బిజినెస్‌కు కీల‌కంగా భావిస్తున్నారు. ఈ సూప‌ర్ యాప్ ద్వారా సింగిల్ ప్లాట్‌ఫామ్‌పై మల్టీపుల్ యూజర్ల సర్వీసులను అందించనుంది. ఇప్ప‌టికే రిల‌య‌న్స్‌, టాటా స‌న్స్ గ్రూప్‌లు సూప‌ర్ యాప్ లాంచింగ్ ఏర్పాట్లు చేశాయి.

క్లియ‌ర్‌ట్రిప్‌లో వాటాల కొనుగోలుపై అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌతం అదానీ స్పందించారు. ఫ్లిప్‌కార్ట్‌తో కలిసినందుకు సంతోషంగా ఉంద‌ని ట్వీట్ చేశారు. క్లియ‌ర్‌ట్రిప్‌లో వాటా కొనుగోలుతో సూప‌ర్ యాప్ గ్రాఫ్ మరింత పెరుగుతుందని ఆకాంక్షించారు. డేటా సెంట‌ర్లు, లాజిస్టిక్స్ నుంచి ట్రావెల్ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు గౌతం అదానీ పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్‌తో భాగ‌స్వామ్యానికి ఆ సంస్థ సీఈవో క‌ల్యాణ్‌కృష్ణ‌మూర్తికి ధ‌న్య‌వాదాలు తెలియజేశారు. క్లియ‌ర్ ట్రిప్‌లో పెట్టుబ‌డుల‌తో సూప‌ర్ యాప్ మరింత డెవలప్ అవుతుందని, తద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ల‌భిస్తాయని, జై హింద్ అంటూ ట్వీట్ అదానీ చేశారు.
Modi met Pope: పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని మోదీ భేటీ