రూ.40తో ముంబై వచ్చాడు : 27ఏళ్ల తర్వాత హర్షద్ మెహతాకి క్లీన్ చిట్

హర్షద్ మెహతా అనగానే గుర్తుచ్చేది భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని (1992 సెక్యూర్టీస్) అతిపెద్ద కుంభకోణం.

  • Published By: sreehari ,Published On : February 18, 2019 / 11:55 AM IST
రూ.40తో ముంబై వచ్చాడు : 27ఏళ్ల తర్వాత హర్షద్ మెహతాకి క్లీన్ చిట్

హర్షద్ మెహతా అనగానే గుర్తుచ్చేది భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని (1992 సెక్యూర్టీస్) అతిపెద్ద కుంభకోణం.

హర్షద్ మెహతా అనగానే గుర్తుచ్చేది భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని (1992 సెక్యూర్టీస్) అతిపెద్ద కుంభకోణం. ఈ కుంభకోణానికి సూత్రధారి అయిన హర్షత్ మెహతా మరణానంతరం, ఆయన కుటుంబానికి 27 ఏళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ వచ్చింది. మెహతా కుటుంబంపై ఉన్న ట్యాక్స్ డిమాండ్ ను ఇన్ కం ట్యాక్స్ ట్రిబ్యునల్ తిరస్కరించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ట్యాక్స్ ఊబిలో కూరుకుపోయిన మెహతా భార్య జ్యోతి, సోదరుడు అశ్విన్ కు భారీ ఊరట కలిగింది. 1992లో ఆదాయ పన్ను శాఖ మెహతా కుటుంబానికి రూ.2వేల కోట్లు పన్ను విధించింది. దీనిపై దశాబ్దాలుగా హర్షద్ మెహతా కుటుంబం కోర్టులు చుట్టూ తిరిగింది. బ్యాంకుల పిటిషన్లకు ఎన్నో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేసింది. సుదీర్ఘ కాలం క్లయిమ్స్ పర్వం కొనసాగింది. ఎట్టకేలకు మెహతా కుటుంబానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. కోట్ల ట్యాక్స్ నుంచి ఉపశమనం దొరికింది. 
 

హర్షద్ మెహతా ఎవరంటే..
ఇండియాలో ఫస్ట్ టైం జరిగిన అతిపెద్ద స్కాం.. హర్షద్ మెహతా కుంభకోణం (1992 సెక్యూర్టీస్ స్కాం). చాలా తక్కువ మందికి మాత్రమే ఈ కుంభకోణం గురించి తెలుసు. ఇండియాలో బిగ్ బుల్ మార్కెట్ అయిన దలాల్ స్ట్రీట్ లో ‘హర్షద్ మెహతా’ అనే వ్యక్తి స్టాక్ షేర్ బ్రోకర్. బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు (15 రోజుల వ్యవధిలో) లోన్లు తీసుకోవడం.. దాన్ని స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతుండేవాడు. అదే 15 రోజుల్లో స్టాక్ మార్కెట్లో లాభాలు గడించి బ్యాంకులకు చెల్లించేవాడు. ఒక్క బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు, అలా ఒక్కో బ్యాంకులో లోన్లు మీద లోన్లు తీసుకుంటూ మనీ రోటేట్ చేస్తుండేవాడు. RF deal, (రెడీ ఫార్వడ్ డీల్, బ్యాంకు రీసిప్ట్)..  పలు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటూ మెహతా బురిడి కొట్టించాడు. స్టాక్ మార్కెట్ ను తెలివిగా ఉపయోగించుకుని తన మార్కెట్ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. ఆ విషయం గుర్తించిన బ్యాంకులు అతని దగ్గర నుంచి డబ్బులు విత్ డ్రా చేయడం మొదలుపెట్టాయి. ఆ తరువాత హర్షద్ పై బ్యాంకులు 72 క్రిమినల్ కేసులను నమోదు చేశాయి. 
 

ఇందులో అన్నీ సివిల్ కేసులే ఫైల్ చేశాయి. ఈ కేసులను విచారించిన సుప్రీంకోర్టు హర్షద్ ను దోషిగా తేలుస్తూ 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.25వేలు జరిమానా విధించింది. మెహతాను థానె జైలుకు తరలించారు. డిసెంబర్ 31, 2001 రోజు ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకులు జరుపుకుంటోంది. ఆ రాత్రి ఉన్నట్టుండి మెహతా తన కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో వెంటనే థానె సివిల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి 12.30 గంటలకు హర్షద్ తుదిశ్వాస విడిచారు. తన 47ఏళ్ల వయస్సులోనే మెహతా మరణించాడు. అప్పటికే ఆయనపై 27 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 

 

రూ.4 కోట్లు ట్యాక్స్ ఎగవేత
1992, ఫిబ్రవరి 28 నుంచి మెహతా కుటుంబంపై ఆదాయ శాఖ చర్యలు చేపట్టింది. అప్పటినుంచి వరసగా వారి సంబంధిత ఆస్తులపై తనిఖీలు చేపట్టింది. సోదాల్లో ఎన్నో డాక్యుమెంట్లు, షేర్ మార్కెట్ కు సంబంధించిన సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకుంది. 1992, జూన్ 4న సీబీఐ మెహతా కుటుంబానికి సంబంధించిన ఆస్తులపై సెర్చ్ ఆపరేషన్ జరిపింది. అనంతరం హర్షద్ మెహతా తన 1992-93 ఏడాది ఆదాయంపై ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేశాడు. ట్యాక్స్ డిపార్ట్ మెంట్ దాన్ని తిరస్కరించింది. మెహతా ఫ్యామిలీ రూ.4 కోట్లు ట్యాక్స్ ఎగ్గొట్టినట్టు 1995లో ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. చివరికి ఈ వ్యవహారం కాస్తా ఇన్ కం ట్యాక్స్ ట్రిబ్యునల్ కు చేరింది. 23ఏళ్ళ తరువాత ట్రిబ్యునల్.. మెహతా కుటుంబ పన్ను కట్టాలనే ఐటీ శాఖ డిమాండ్ ను తోసిపుచ్చింది. క్లీన్ చిట్ ఇచ్చింది. పన్ను కట్టాల్సిన అవసరం లేదని తేల్చింది.
 

జేబులో రూ.40తో ముంబై వచ్చి..
1954 జూలై 29న గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లాలో ఓ పేద కుటుంబంలో జన్మించాడు. మెహతా తండ్రి ఓ ప్యూన్. తన జేబులో రూ.40తో ముంబై నగరానికి వచ్చాడు. 1976లో ముంబైలోని లాలా లజ్ పత్ రాయ్ కాలేజీ కామర్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తి చేశాక కొన్ని ఏళ్లపాటు పలు కంపెనీల్లో ఉద్యోగం చేశాడు. న్యూ ఇండియా అస్యు రేన్స్ కంపెనీ లిమిటెడ్ లో సేల్స్ పర్సన్ గా చేరాడు. షేర్ మార్కెట్ పై ఉన్న ఆసక్తితో 1980లో జాబు వదిలేసి స్టాక్ బ్రోకర్ గా అవతరమెత్తాడు. అక్కడి నుంచి సబ్ బ్రోకర్ నుంచి స్టాక్ బ్రోకర్ అంచెలు అంచెలుగా ఎదిగి స్టాక్ మార్కెట్ లో తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కోట్లు కూడబెట్టాడు.

1984లో తన సోదరుడితో కలిసి సొంత కంపెనీ స్థాపించాడు. గ్రో మోర్ రీసెర్చ్ అండ్ అసెట్ మేనేజ్ మెంట్ అనే సంస్థను నెలకొల్పాడు. అనంతరం బాంబ్వే స్టాక్ ఎక్సేంజీ లో బ్రోకర్ గా చేరాడు. 1986లో ట్రేడింగ్ ఫుల్ యాక్టివ్ గా ఉంటూనే.. 1990 ప్రారంభంలో ఫేమస్ స్టాక్ బ్రోకర్ గా ఫేమస్ అయ్యాడు. అప్పటి నుంచి మెహతా కంపెనీలో ఎందరో ప్రముఖులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. 

Read Also : గ్లోబల్ ట్రెండ్ : పాక్ ప్రధాని ఇమ్రాన్ కు బాలయ్య డైలాగ్ వార్నింగ్స్

Read Also : ఇండియా ఎఫెక్ట్ : పాక్‌లో భగ్గుమన్న టీ ధరలు