Golden Ghevar Sweet : ఈ స్వీటు ధర కిలో..రూ 25,000..

ర‌క్షా బంధ‌న్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ఆగ్రాలోని బ్రిజ్ రసాయ‌నం మిస్తాన్ భండార్ అనే స్వీటు షాప్ ప్ర‌త్యేకంగా 24 క్యారెట్ బంగారు పూతతో తయారు చేసిన స్వీటుకు మంచి డిమాండ్ ఉంది. కిలో రూ 25,000 ఖరీదు అయినా ఆర్డర్లమీద ఆర్డర్లతో బిజీ బిజీగా ఉన్నారు షాపు యజమాని..

Golden Ghevar Sweet : ఈ స్వీటు ధర కిలో..రూ 25,000..

Golden Ghevar sweet per Kg Rs.25,000 (1)

Golden Ghevar sweet  : ఉత్త‌రాదిలో పండుగలకు అక్కడ ప్ర‌జ‌లు ఘెవ‌ర్ స్వీట్ అనే మిఠాయిని చాలా ఇష్టంగా తింటారు. ఆర్డర్ ఇచ్చి మరీ కొంటారు. ఆగ్రాలోని ఓ స్వీట్ షాప్‌ ఘెవర్ స్వీట్లు తయారు చేయటంలో మంచి పేరుంది. ఈ షాపులో ఈ ఘెవర్ స్వీటుకు మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఈ స్వీటును బంగారంతో తయారు చేస్తారు. టేస్టు కూడా అద్దిరిపోతుందట..అలాగే రేటు కూడా అద్దిరిపోయేలానే ఉంటుంది. ఎంతగా అంటూ కిలో ఘెవర్ స్వీటు అక్షరాలా రూ.25,000. స్వచ్ఛమైన నెయ్యితో చేసిన స్వీటు అయినా మహా అయితే రూ.1000లు ఉంటుంది. కానీ ఆగ్రాలోని ఓ స్వీట్ షాపులో ఘెవర్ స్వీట్ డిమాండే వేరు. ఎందుకంటే ఈ స్వీటును 24 క్యారెట్ల బంగారం పూతతో తయారు చేస్తారు.

అందుకే కిలో రూ 25,000 ప‌లుకుతోంది. ర‌క్షా బంధ‌న్ ద‌గ్గ‌ర‌ప‌డుతుండ‌టంతో ఆగ్రాలోని బ్రిజ్ రసాయ‌నం మిస్తాన్ భండార్ అనే స్వీటు షాప్ ప్ర‌త్యేకంగా 24 క్యారెట్ బంగారు పూతతో త‌యారు చేసిన ఈ స్వీట్‌కు ప్ర‌జ‌ల నుంచి ఆర్డ‌ర్లు భారీగా వ‌స్తున్నాయని చెబుతున్నారు షాపు యజమాని తుషార్ గుప్తా. ఆర్డ‌ర్ల‌పైనే తాము గోల్డెన్ ఘెవ‌ర్ స్వీట్‌ను ఆఫ‌ర్ చేస్త‌న్నామ‌ని స్వీట్ షాపు య‌జమాని తెలిపారు.

సాధార‌ణంగా ఘెవ‌ర్ స్వీట్ కిలో రూ 600 నుంచి రూ 800 మ‌ధ్యలో ఉంటుంది. కానీ బంగారంతో చేసిన స్వీటు అంటే ఆమాత్రం లేకుండా ఎలా ఉంటుంది.అందుకే సాధారణ ఘెవర స్వీటు కంటే ఈ గోల్డెన్ ఘెవ‌ర్‌కు అంత ధర. ఈ గోల్డెన్ ఘెవర్ స్వీటు సోషల్ మీడియాలో తెగ ఊరిస్తోంది. రెడ్ బాక్స్‌లో ప్యాక్ చేసిన గోల్డెన్ ఘెవ‌ర్ స్వీట్‌ను క‌స్ట‌మ‌ర్లు ఆస‌క్తిగా చూస్తుండ‌టం వీడియోలో క‌నిపించింది. డిస్క్ షేప్‌లో ఉండే ఘెవ‌ర్ స్వీట్ ప్ర‌ధానంగా రాజ‌స్ధాన్‌, హ‌ర్యానా, మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో తీజ్‌, ర‌క్షా బంధ‌న్ వంటి ప‌ర్వ‌దినాల్లో ప్ర‌జ‌లు ఇష్టంగా తింటుంటారు.