AI Jobs for Freshers India : భారత్‌లో AI ఫ్రెషర్లకు భారీ ఉద్యోగవకాశాలు.. నెలకు రూ.10 లక్షల జీతం.. ఇక లైఫ్ సెటిల్ అయినట్టే..!
AI Jobs for Freshers India : రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అత్యాధునిక టెక్నాలజీతో అనేక కొత్త ఉద్యోగవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా స్కిల్స్ పెంచుకుంటే లక్షల్లో వేతనాలను సంపాదించుకోవచ్చు.

AI Jobs for Freshers _ India has 45,000 job openings in AI with starting salary of Rs 10 lakh for freshers, suggests report
AI Jobs for Freshers India : రోజురోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. అత్యాధునిక టెక్నాలజీతో అనేక కొత్త ఉద్యోగవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా స్కిల్స్ పెంచుకుంటే లక్షల్లో వేతనాలను సంపాదించుకోవచ్చు. ఇప్పుడు టెక్నాలజీ రంగంలో (Artificial Intelligence) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి ఫుల్ డిమాండ్ పెరిగింది. రాబోయే భవిష్యుత్ కూడా (AI Job Openings) ఉద్యోగాలపైనే ఉండబోతోంది. ఇప్పటికే AI టెక్నాలజీ టెక్ ఉద్యోగుల భవిష్యత్తును చాలా విధాలుగా మార్చేసింది.
మార్కెట్లోకి చాట్‌జిపిటి (ChatGPT), Bing AI వంటి టూల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. ఎక్కువ సమయం చేయాల్సిన పనులను కూడా కొద్ది సమయంలోనే AI టూల్స్ (AI Tools) పూర్తి చేస్తున్నాయి. దాంతో సమయం చాలా ఆదా అవుతోంది. అందుకే టెక్ కంపెనీలు AI టెక్నాలజీపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో (AI Tools) ఉద్యోగుల సంఖ్యను తగ్గించే అవకాశం ఉందనే ఆందోళన కనిపిస్తోంది. ఎందుకంటే.. AI టూల్స్ ద్వారా పది మంది చేసే చాలా పనిని ఏ సమయంలోనైనా పూర్తి చేయగలవు. కానీ, వాస్తవానికి ఇతర ఉత్పాదక విషయాలపై దృష్టి పెట్టేందుకు ఏఐ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు AI చాలామంది దృష్టిని ఆకర్షిస్తున్నందున AI నిపుణులకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది.

AI Jobs for Freshers : India has 45K job openings in AI with starting salary of Rs 10 lakh for freshers
ఏఐ ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్.. ప్రెషర్లకు లక్షల్లో వేతనాలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో ప్రస్తుతం కనీసం 45,000 ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని TeamLeaseDigital నివేదిక వెల్లడించింది. ఆరోగ్య సంరక్షణ, విద్య, బ్యాంకింగ్, తయారీ, రిటైల్‌తో సహా వివిధ రంగాలలో అనేక ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. AI ఉద్యోగాలకు డిమాండ్ ఉన్నందున ఈ ప్రాంతంలో ఆసక్తి ఉన్న ఫ్రెషర్‌లకు లక్షల్లో జీతం వచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఏఐ టెక్నాలజీని తమ కెరీర్‌గా ఎంచుకునే డేటా సైంటిస్ట్‌లు (Data Scientists), మెషిన్ లెర్నింగ్ (ML)ని ఎంచుకోవాలని నివేదిక సూచిస్తుంది.
ఎందుకంటే.. భవిష్యత్తులో ఉద్యోగాలు కోల్పోతామనే ఆందోళన ఉండదు. అంతేకాదు.. తక్కువ సమయంలో లక్షల్లో వేతనాలను పొందడానికి సాయపడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో కెరీర్ ఎంచుకోవడానికి అవసరమైన నైపుణ్యాల గురించి కూడా అధ్యయనం చేయాల్సి ఉంది. స్కేలబుల్ ML అప్లికేషన్‌లలో ఫోకస్ ఇప్పుడు విస్తరించింది. స్క్రిప్టింగ్ లాంగ్వేజీల్లో AI నిపుణులు గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువగా అవసరం పడుతోంది. AIలో కెరీర్‌ను కలిగి ఉండేందుకు వినియోగదారులు సంప్రదాయ ML మోడల్‌లను రూపొందించే నైపుణ్యాన్ని కలిగి ఉండాలి.

AI Jobs for Freshers : India has 45K job openings in AI with starting salary of Rs 10 lakh for freshers
డేటా ఇంజనీర్ ఉద్యోగాల్లో ఫ్రెషర్లు సంవత్సరానికి రూ. 14 లక్షల వరకు సంపాదించవచ్చు. ML ఇంజనీర్లు రూ. 10 లక్షల వరకు సంపాదించవచ్చని అధ్యయనం తెలిపింది. DevOps ఇంజనీర్లు, డేటా ఆర్కిటెక్ట్‌లు, డేటాబేస్ అడ్మిన్‌లు రూ. 12 లక్షల వరకు వేతనాన్ని పొందవచ్చు. BI అనలిస్ట్ లేదా డేటా సైంటిస్ట్ రోల్ (Data Scientists Role) ఎంచుకుంటే.. నెలకు రూ. 14 లక్షల వరకు వేతనం పొందవచ్చు. సారూప్య రంగాలలో సుమారు 8 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న అభ్యర్థులు సంవత్సరానికి రూ. 25 నుంచి 45 లక్షల మధ్య వేతనాలను పొందవచ్చు. టెక్ మార్కెట్‌లోని ఇతరులకు ఆరోగ్యకరమైన పోటీని అందించడానికి ఫ్రెషర్లు కనీసం (AI) సంబంధిత అప్లికేషన్‌ల గురించి బేసిక్స్ లేదా అవగాహన కలిగి ఉండాలని అధ్యయనం సూచిస్తుంది.
అదనంగా, AI నైపుణ్యాలను పెంపొందించుకునే వారు చాలా ఎక్కువ జీతాలతో పాటు అనేక ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. భారత మార్కెట్లో పోటీ ఇప్పటికే చాలా పెరిగిందని, దాదాపు 4లక్షల మంది భారతీయులు ఇప్పటికే AI సంబంధిత ఉద్యోగాల్లో పనిచేస్తున్నారని నివేదిక వెల్లడించింది. భారత్‌లోని 16 శాతం మంది ఉద్యోగులు గ్లోబల్ AI టాలెంట్ పూల్‌కు సహకరిస్తున్నారని తేలింది.
AI టాలెంట్ కనుగొనే ప్రపంచంలో రెండవ అతిపెద్ద ప్రాంతంగా బెంగళూరు నిలిచింది. ఈ నగరం నుంచే అనేక మంది AI ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. AI ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారికి అద్భుతమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఏఐని తమ కెరీర్ గా ఎంచుకుంటే లక్షల్లో జీతంతో పాటు లైఫ్‌లో కూడా సెటిల్ అయిపోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ కూడా మీ కెరీర్ AI తో ప్రారంభించాలనుకుంటే వెంటనే తగిన విధంగా స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చేయండి.