రిపబ్లిక్ డే ఫ్లాష్ సేల్ : ఎయిర్ ఇండియా స్పెషల్ ఆఫర్లు

రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ దేశీయ విమానాయన సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు గుప్పిస్తున్నాయి. విమాన ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లతో ఊరిస్తున్నాయి. ప్రముఖ దేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్లాష్ సేల్ ప్రకటించింది.

  • Published By: sreehari ,Published On : January 26, 2019 / 11:51 AM IST
రిపబ్లిక్ డే ఫ్లాష్ సేల్ : ఎయిర్ ఇండియా స్పెషల్ ఆఫర్లు

రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ దేశీయ విమానాయన సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు గుప్పిస్తున్నాయి. విమాన ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లతో ఊరిస్తున్నాయి. ప్రముఖ దేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్లాష్ సేల్ ప్రకటించింది.

రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ దేశీయ విమానాయన సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు గుప్పిస్తున్నాయి. విమాన ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లతో ఊరిస్తున్నాయి. ప్రముఖ దేశీ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్లాష్ సేల్ ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా తమ కస్టమర్ల కోసం ఎయిర్ ఇండియా స్పెషల్ ఆపర్లతో ఆకట్టుకుంటోంది. రిపబ్లిక్ డే సేల్ పేరిట విమాన ప్రయాణికులకు లిమిటెడ్ ఆఫర్ అందిస్తోంది. ‘‘ఇండియాలో ఏ ప్రాంతాన్ని అయిన సందర్శించాలని అనుకుంటున్నారా? అందుకు ఇదే సరైన సమయం. లిమిటెడ్ ఆఫర్లు మాత్రమే. ఆన్ లైన్ లో బుకింగ్ మొదలైంది. వెంటనే మీ టికెట్ బుకింగ్ చేసుకోండి’’ అంటూ ఊరిస్తోంది. ఎకనామీ క్లాసులో ప్రారంభ టికెట్ ధర రూ.979 మాత్రమే. ఇక బిజినెస్ క్లాసులో టికెట్ ధర మాత్రం రూ. 6వేలు నుంచి ప్రారంభం. ఈ రెండింటిపై జనవరి 26 నుంచి జనవరి 28 వరకు టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. విమానంలో ప్రయాణించడానికి సెప్టెంబర్ 30 వరకు వ్యాలీడ్ ఉంటుంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా అధికారిక వెబ్ సైట్ airindia.in నుంచి టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు. పౌర విమానాయన రంగంలో దేశవ్యాప్తంగా నెలకొన్న హై కాంపిటీషన్ తో ఎయిర్ ఇండియా కొత్త ఫ్లైట్ ఆఫర్లతో ముందుకొచ్చింది.

ఎయిర్ ఇండియా అందించే టికెట్ల ధరలో ఎకనామీ క్లాసు ప్రారంభ ధర రూ. 979 కే కొనుగోలు చేసి దేశాన్ని చుట్టేయండి. ఈ ఆఫర్ పై లిమిటెడ్ సీట్లు మాత్రమే ఉన్నాయి. దేశీయ విమానాలపై అందించే ఈ ఆఫర్ పొందాలంటే 15 రోజులు ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని ఎయిర్ ఇండియా కండిషన్ పెట్టింది. అదేవిధంగా అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఎయిర్ ఇండియా (ఎకనామీ క్లాసు)లో వన్ వే ప్రారంభ టికెట్ ధర రూ.6వేలు. బిజినెస్ క్లాసులో టికెట్ ప్రారంభ ధర రూ.22వేలు. రౌండ్ ట్రిప్ టికెట్ ధర రూ.7,500 ఉండగా, బిజినెస్ క్లాసులో రూ.18వేల వరకు ఉన్నట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు గోఎయిర్ సంస్థ కూడా రిపబ్లిక్ డే సేల్స్ పై ఆఫర్లు ప్రకటించింది. గోఎయిర్ దేశీయ విమాన టికెట్లపై ప్రారంభ ధర రూ.999కే అందిస్తోంది. జెట్ ఎయిర్ వేస్ 50 శాతం డిస్కౌంట్ తో దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై ఆఫర్లు అందిస్తోంది.