జియో ఫైబర్‌కు పోటీగా : Airtel Xstream ఫైబర్ ప్లాన్.. 1Gbps స్పీడ్ ఆఫర్

రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుకు పోటీగా ఇండియాలో అతిపెద్ద బ్రాడ్ బ్యాండ్ సర్వీసుదారుల్లో ఒకటైన ఎయిర్ టెల్ కొత్త సర్వీసు ఆఫర్ ప్రకటించింది.

  • Published By: sreehari ,Published On : September 11, 2019 / 11:04 AM IST
జియో ఫైబర్‌కు పోటీగా : Airtel Xstream ఫైబర్ ప్లాన్.. 1Gbps స్పీడ్ ఆఫర్

రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుకు పోటీగా ఇండియాలో అతిపెద్ద బ్రాడ్ బ్యాండ్ సర్వీసుదారుల్లో ఒకటైన ఎయిర్ టెల్ కొత్త సర్వీసు ఆఫర్ ప్రకటించింది.

రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుకు పోటీగా ఇండియాలో అతిపెద్ద బ్రాడ్ బ్యాండ్ సర్వీసుదారుల్లో ఒకటైన ఎయిర్ టెల్ కొత్త సర్వీసు ఆఫర్ ప్రకటించింది. ఎయిర్ టెల్ Xstream Box, Xstream Stick సర్వీసును ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో ఫైబర్ సర్వీసు కమర్షియల్ లాంచ్ చేసిన వెంటనే ఎయిర్ టెల్ కూడా ఎక్స్ స్ట్రీమ్ సర్వీసును ప్రవేశపెట్టింది.

నెలకు రూ.3వేల 999 మాత్రమే :
ఎయిర్ టెల్ Xstream ఫైబర్ ప్లాన్ నెలకు రూ.3వేల 999 ప్లాన్ తో 1Gbps స్పీడ్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ఎయిర్ టెల్ థ్యాంక్స్ బండెల్ బెనిఫెట్స్ పొందవచ్చు. ఇందులో 3 నెలల Netflix సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. 1 ఏడాది Amazon Prime సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు. ఇతర OTT ప్లాట్ ఫాంలైన ZEE5, Xstream యాప్ నుంచి ప్రీమియం కంటెంట్ యాక్సస్ చేసుకునే సదుపాయం ఉంది. 

మొదటి 6 నెలలు.. 1000GB డేటా :
ఎయిర్ టెల్ Xstream ఫైబర్ వినియోగదారులు దేశంలో ఏ నెట్ వర్క్ కు అయినా Unlimited Landline కాల్స్  చేసుకోవచ్చు. Xstream Fiber ప్లాన్ కింద ఎంత డేటా ఆఫర్ చేస్తుందో ఎయిర్ టెల్ రివీల్ చేయలేదు. రిపోర్టు ప్రకారం.. Xstream Fiber యూజర్లు మొదటి 6 నెలల వరకు 1000GB డేటా పొందవచ్చు. అదే జియో ఫైబర్ సర్వీసులో 1Gbps ప్లాన్ రూ.3వేల 999లు చెల్లిస్తే 2500GB డేటా ఆఫర్ చేస్తోంది.

ఎయిర్ టెల్ Xstream Fiber బ్రాడ్ బ్యాండ్ సర్వీసును తొలుత హోం, SOHO, చిన్న వాణిజ్య సంస్థల కోసం మొత్తం 15 నగరాల్లో లాంచ్ చేస్తోంది. అందులో ప్రధాన నగరాలైన ఢిల్లీ, గుర్గాన్, ఫరీదాబాద్, నోయిడా, ఘాజియాబాద్, ముంబై, పుణె, బెంగళూరులో లాంచ్ చేస్తోంది. రానున్న నెలల్లో Airtel Xstream సర్వీసును మరిన్ని నగరాలకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపింది. 

1. ఎయిర్ టెల్ xstream హైబ్రిడ్ STB  : 
* ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ బాక్సు అంటే.. Xstream 4K Hybrid Box. 
* ఈ xstream 4K హైబ్రీడ్ బాక్సు ధర రూ.3వేల 999. 
* ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ కస్టమర్లకు డిస్కౌంట్ ధరతో అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. 
* కొత్త హైబ్రిడ్ సెట్ టాప్ బాక్సు Upgrade కింద ధర రూ.2,249లకే పొందవచ్చు.
* ఎయిర్ టెల్ Xstream Box ఒక ఏడాది కాంప్లిమెంటరీ సబ్ స్ర్కిప్షన్ కూడా వస్తుంది.
* ఒక నెల సబ్ స్ర్కిప్షన్ కింద కంపెనీ HD DTH ప్యాక్ పొందవచ్చు. 
* ఈ బాక్సు ద్వారా యూజర్లు 500 TV ఛానళ్లను ఈజీగా వీక్షించవచ్చు.
* ఎయిర్ టెల్ Xstream Appలో ప్రీ లోడెడ్ యాప్స్ ద్వారా కంటెంట్ యాక్సస్ చేసుకోవచ్చు.
* ఎయిర్ టెల్ 4k హైబ్రిడ్ సెట్ టాప్ బాక్సు Android 9.0 Pie OSపై రన్ అవుతుంది.
* ఈ బాక్సు ద్వారా యూజర్లు ఈజీగా గూగుల్ play store యాక్సస్ చేసుకోవచ్చు. 
* నచ్చిన యాప్స్ డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. మొబైల్ యాక్సస్ చేసుకోవచ్చు.

2. Airtel Xstream Stick :

* ఎయిర్ టెల్ Xstream Stick ఫీచర్లు DTH యాక్సస్ తప్పించి Xstream Box మాదిరిగానే ఉంటాయి.
*  యూజర్లు OTT ప్లాట్ ఫాంలో Netflix, Amazon Prime Video, Youtubeలో వీడియోలు చూడొచ్చు. 
* ఆండ్రాయిడ్ 8.0 ఒరియో, గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ ఉంది.
* ఎక్స్ స్ట్రీమ్ స్టిక్ ధర రూ.3వేల 999 ఉంటుంది.
* మొదటి నెల ఉచితంగా పొందవచ్చు.
* యానివల్ సబ్ స్ర్కిప్షన్ కింద యూజర్లు ఏడాదికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది.