వినియోగదారులకు షాక్ : పెరిగిన ఎయిర్ టెల్ చార్జీలు

  • Published By: chvmurthy ,Published On : December 29, 2019 / 03:29 PM IST
వినియోగదారులకు షాక్ : పెరిగిన ఎయిర్ టెల్ చార్జీలు

దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు  నూతన సంవత్సరం ప్రవేశించే వేళ  షాకిచ్చింది.  ప్రీపెయిడ్‌ కనీస రీఛార్జి మొత్తాన్ని  రూ.23 నుంచి రూ.45 కి పెంచింది. అంటే దాదాపు 95 శాతం ధరలు పెంచింది. 

వినియోగదారులు ఎలాంటి  అవాంతరాలు లేని ఎయిర్‌టెల్‌ సేవలు పొందాలంటే  నెలకు ఇప్పటి వరకు చెల్లిస్తున్న రూ.23లకు అదనంగా మరో రూ.22 చెల్లించాలి. పెంచిన కనీస రీఛార్జి మొత్తాన్ని  డిసెంబర్ 29 నుంచే అమలు చేస్తున్నామని ఎయిర్ టెల్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇకపై 28 రోజులకు ఎయిర్‌టెల్‌ వినియోగదారులు నెలకు రూ.23కు బదులు రూ.45 రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రీఛార్జి చేసుకుంటే  ఎలాంటి డేటా, ఉచిత కాల్స్‌ లభించవని ఎయిర్ టెల్ తెలిపింది. రూ.45 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం రీఛార్జి చేయకుంటే గత ప్లాన్‌ గ్రేస్‌ పీరియడ్‌ ముగిసిన తర్వాత సేవలను నిలిపివేస్తామని కంపెనీ పేర్కొంది. 

కొత్త కస్టమర్లు అన్ని లోకల్ & STD వాయిస్ కాల్స్ కోసం సెకనుకు 2.5p / sec, నేషనల్ వీడియో కాల్స్ కోసం 5p / sec, 50p / MB డేటా కోసం, లోకల్‌కు రూ 1 / ఎస్‌ఎంఎస్ సుంకం, జాతీయానికి రూ .1.5 / ఎస్‌ఎంఎస్, అంతర్జాతీయానికి రూ .5 / ఎస్ఎంఎస్. సేవలను పొందటానికి ప్రతి 28 రోజులకు రూ .45 లేదా అంతకంటే ఎక్కువ వోచర్‌తో రీఛార్జ్ చేయడం తప్పనిసరి ”అని ఎయిర్‌టెల్  విడుదల చేసిన సర్క్యులర్‌లో తెలిపింది.

ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ లు ఇటీవలే మొబైల్ రీచార్జీలను పెంచాయి. ఎయిర్‌టెల్ తన సవరించిన మొబైల్ సుంకాలు రోజుకు 50 పైసల పరిధిలో రూ .2.85 కు పెరిగింది. ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్ నుండి ఇతర నెట్‌వర్క్‌లకు అపరిమిత కాల్‌పై నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తోంది. ఇటీవలే ధరలను పెంచిన ఎయిర్ టెల్  తాజాగా మరోసారి వినియోగదారులపై భారం మోపడం గమనార్హం. 

ఓడాఫోన్, ఐడియా తన చార్జీలను 40% వరకు పెంచింది. రిలయన్స్ జియో పెంచిన చార్జీలతో కొత్త ఆల్ ఇన్ వన్ స్కీం కూడా ప్రవేశపెట్టింది. సవరించిన ధరలతో తన కొత్త ప్లాన్ లు ఇప్పటికీ పోటీ కంటే ఎక్కువ విలువను అందిస్తాయని జియో తెలిపింది. రిలయన్స్ జియో ఇటీవల రూ .98, రూ .149 ప్రీపెయిడ్ ప్లాన్‌లను తిరిగి ప్రవేశపెట్టింది.