Jioకు షాకిచ్చిన Airtel : Wi-Fi Calling సరికొత్త రికార్డు!

  • Published By: sreehari ,Published On : January 13, 2020 / 08:29 AM IST
Jioకు షాకిచ్చిన Airtel : Wi-Fi Calling సరికొత్త రికార్డు!

టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులతో టెలికో కంపెనీల్లో పోటీ వాతావరణం నెలకొంది. టెలికోలు తమ యూజర్లను ఆకట్టుకునేందుకు కొత్త ఫీచర్లు, రీఛార్జ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడూ ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇటీవలే దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఎయిర్ టెల్ కు పోటీగా రిలయన్స్ జియో కూడా వైఫై కాలింగ్ ఫీచర్ ప్రవేశపెట్టింది.

ఒక మిలియన్ దాటిన యూజర్లు :
దేశంలో మొట్టమొదటిగా ఈ వైఫై కాలింగ్ సర్వీసును ప్రవేశపెట్టిన టెలికం సంస్థగా ఎయిర్ టెల్ నిలవగా తర్వాతి స్థానంలో జియో నిలిచింది. ఈ సర్వీసును ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్ 1 మిలియన్ మంది యూజర్లను దాటేసినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వైఫై కాలింగ్ సర్వీసును వైఫై నెట్ వర్క్‌ల కోసం ఒక సపరేట్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి వినియోగించుకోవచ్చు. దీనిద్వారా కస్టమర్లు వాయిస్ కాల్స్, కాలింగ్ ఎక్స్ పీరియన్స్ మెరుగుపడేందుకు దోహదపడుతుందని ఎయిర్ టెల్ పేర్కొంది.

App + SIM కార్డు లేకుండానే  :
Airtel WiFi Calling ఫీచర్ ద్వారా వాయిస్ కాల్స్ చేస్తే.. యూజర్లపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు. కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్లో ఎలాంటి App లేదా SIM కార్డ్ అవసరం లేకుండానే వైఫై నెట్ వర్క్ ద్వారా ఈజీగా సర్వీసును వినియోగించుకోవచ్చు. ‘ దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఎయిర్ టెల్ ఈ సర్వీసును లాంచ్ చేసింది. ఏ వైఫై నెట్ వర్క్ నుంచైనా తమ కస్టమర్లు ఈజీగా ఈ ఫీచర్ వినియోగించుకోవచ్చు’ అని భారతీ ఎయిర్ టెల్ చీఫ్ టెక్నాలజీ అధికారి రణ్ దీప్ సేకాన్ తెలిపారు.

ఎయిర్‌టెల్ ఆఫర్ చేసే ఈ లేటెస్ట్ ఫీచర్.. మొత్తం 16 బ్రాండ్లలో 100 స్మార్ట్ ఫోన్ మోడళ్లకు సపోర్ట్ చేస్తుంది. పాన్ ఇండియా కింద జనవరి 7, జనవరి 16 మధ్య జియో వైఫై కాలింగ్ సర్వీసును ఎనేబుల్ చేసింది. 150 మొబైల్ హ్యాండ్ సెట్లకు సపోర్ట్ చేసేలా ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీని ద్వారా యూజర్లు వాయిస్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. VoLTE నెట్ వర్క్ నుంచి WiFi నెట్ వర్క్ మధ్య స్విచ్ అయ్యేలా ఈ సర్వీసును ఆఫర్ చేస్తోంది. ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఫీచర్ సర్వీసును ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కోల్ కతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లాంచ్ చేయనున్నట్టు గత డిసెంబర్ నెలలోనే ప్రకటించింది.