Airtel Wi-Fi Calling సర్వీసు : Broadband ఏదైనా ఓకే!

  • Published By: sreehari ,Published On : January 10, 2020 / 11:59 AM IST
Airtel Wi-Fi Calling సర్వీసు : Broadband ఏదైనా ఓకే!

ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కొత్త వైఫై కాలింగ్ సర్వీసును ఇటీవలే ఢిల్లీ NCRలో లాంచ్ చేసింది. అప్పటినుంచి నెమ్మదిగా తమ వైఫై కాలింగ్ సర్వీసును దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. మరోవైపు టెలికం పోటీదారు రిలయన్స్ జియో కూడా ఎయిర్ టెల్ కు పోటీగా ఇదే వైఫై కాలింగ్ సర్వీసును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రెండు టెలికంలు ఒకే రకమైన సర్వీసును ఆఫర్ చేస్తుండటంతో పోటీ వాతావరణం నెలకొంది.

అయితే, ఎయిర్ టెల్ తమ వినియోగదారులందరికి ఈ సర్వీసు అందేలా క్రమంగా విస్తరిస్తోంది. వైఫై ఆధారంగా మొబైల్ వాయిస్ కాల్స్ చేసుకునేలా సర్వీసును ఎనేబుల్ చేసింది. అంతేకాదు.. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు కూడా ఈ సర్వీసును ఆఫర్ చేస్తోంది. ప్రారంభంలో హోం బ్రాడ్ బ్యాండ్ Airtel Xtream Fiber కస్టమర్లకు పరిమితంగా అందించనుంది. ఏదైనా Wi-Fi నెట్ వర్క్ ద్వారా ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. 

ఇప్పటికే ఈ వైఫై కాలింగ్ సర్వీసు.. ఒక మిలియన్ యూజర్ల మార్క్ ను దాటడమే కాకుండా, 100 స్మార్ట్ ఫోన్ల వరకు సపోర్ట్ చేయనున్నట్టు ఒక ప్రకటనలో వెల్లడించింది. పోటీదారు రిలయన్స్ జియో మాత్రం వైఫై కాలింగ్ సర్వీసు ద్వారా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ రెండింటిని ఆఫర్ చేస్తోంది. pan-india ఆధారంగా ఎయిర్ టెల్ అందించే వై-ఫై కాలింగ్ సర్వీసు అందుబాటులోకి వచ్చేసింది.

ఈ సర్వీసును యాక్సస్ చేసుకునే రాష్ట్రాల్లో గుజరాత్, హర్యాణా, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, యూపీ (తూర్పు), యూపీ (పశ్చిమ) ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. అదనంగా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కోల్ కతా, ముంబై, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈ  సర్వీసును విస్తరించింది. 

ఎయిర్ టెల్ Wi-Fi కాలింగ్ సర్వీసులో ప్రధానమైన మార్పు ఏంటంటే? అన్ని Wi-Fi నెట్ వర్క్‌లకు ఈ సర్వీసు సపోర్ట్ చేస్తుంది. తమ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుకు ఈ వైఫై సర్వీసు ఎలాంటి పరిమితి లేదని ఎయిర్ టెల్ స్పష్టం చేసింది. అంటే.. సెల్యూర్ నెట్ వర్క్ సిగ్నల్ లేని భవనాల్లో లేదా రీమోట్ ఏరియాలో ఏదైనా వైఫ్ నెట్ వర్క్ లేదా బ్రాడ్ బ్యాండ్ సర్వీసు నుంచి నేరుగా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

Wi-Fi కాలింగ్ సర్వీసు అధికారికంగా లాంచ్ చేసిన సమయంలోనే ఎయిర్ టెల్.. అన్ని బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు, హాట్ స్పాట్స్ సపోర్ట్ అందించేలా ఇతర కంపెనీలతో కలిసి పనిచేస్తున్నట్టు వెల్లడించింది. ఇప్పటివరకూ ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఫైబర్ హోం బ్రాండ్ కస్టమర్లకు మాత్రం పరిమితంగానే ఈ సర్వీసును ఆఫర్ చేస్తుంది. 

మీ స్మార్ట్ ఫోన్లలో Airtel Wi-Fi calling serviceను నేరుగా వాడుకోవచ్చు. దీనికి ఎలాంటి App చేయాల్సిన అవసరం లేదు. స్పెషిఫిక్ టారిఫ్ యాక్టివేట్ చేసుకోవాల్సిన పని అంతకన్నా లేదు. ఈ సర్వీసు మీ స్మార్ట్ ఫోన్ మోడల్ ఆధారంగా సపోర్ట్ చేస్తుంది.

అది కూడా కొన్ని ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్ మోడళ్లకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఎయిర్ టెల్ అందించే ఈ సర్వీసు 150 వరకు హ్యాండసెట్ మోడళ్లకు సపోర్ట్ చేస్తుంది. ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ సర్వీసును సపోర్ట్ చేసే 16 స్మార్ట్ ఫోన్ మోడల్స్ అప్ డేట్ చేసింది. ఏయే ఫోన్ మోడల్స్ సపోర్ట్ చేస్తాయో ఈ కింది జాబితాను ఓసారి లుక్కేయండి.. 

ఈ 16 స్మార్ట్ ఫోన్లలో.. మీ ఫోన్ మోడల్ ఉందా? :
1. Apple:
iPhone XR, iPhone 6s, iPhone 6s Plus, iPhone 7, iPhone 7 Plus.

* iPhone SE, iPhone 8, iPhone 8 Plus, iPhone X, iPhone Xs, iPhone Xs Max, iPhone 11, iPhone 11 Pro

2. Asus: Asus ZenFone Max Pro M1 (X00TD), Asus ZenFone Max Pro M2 (ZB630KL)

3. Coolpad: Coolpad Cool 3, Coolpad Cool 5, Coolpad Note 5, Coolpad Mega 5C, Coolpad Note 5 Lite

4. Gionee: Gionee F205 Pro, Gionee F103 Pro

5. Infinix: Infinix Hot 8, Infinix S5 Lite , Infinix S5, Infinix Note 4.

* Infinix Smart 2, Infinix Note 5, Infinix S4, Infinix Smart 3, Infinix Hot 7

6. Itel: Itel A46

7. Micromax: Micromax Infinity N12, Micromax N11, Micromax B5

8. Mobiistar: Mobiistar C1, Mobiistar C1 Lite, Mobiistar C1 Shine.

*  Mobiistar C2, Mobiistar E1 Selfie, Mobiistar X1 Notch

9. OnePlus: OnePlus 6, OnePlus 6T, OnePlus 7, OnePlus 7 Pro, OnePlus 7T, OnePlus 7T Pro

10. Panasonic: Panasonic P100, Panasonic Eluguray 700, Panasonic P95, Panasonic P85 NXT

11. Samsung: Samsung Galaxy S10, Galaxy S10+, Galaxy S10e, Galaxy M20, Samsung Galaxy J6, Samsung Galaxy On 6.

* Samsung Galaxy M30s, Samsung Galaxy A10s, Samsung Galaxy A50s, Samsung Galaxy Note 9.

12. Spice: Spice F311, Spice M5353

13. Tecno: Phantom 9, Spark Go Plus, Spark Go, Spark Air, Spark 4, Spark 4, Camon Ace 2, Camon Ace 2X, Camon12 Air, Spark Power

14. Vivo: Vivo V15 Pro, Vivo Y17

15. Xiaomi: Poco F1, Redmi K20, Redmi K20 Pro, Redmi 7A, Redmi Note 7 Pro, Redmi Y3, Redmi 7

16. Xolo: Xolo ZX