Airtel Xstream బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్లు.. ఈ రెండు కొత్త ప్లాన్లపై Amazon Prime సబ్ స్ర్కిప్షన్

  • Published By: sreehari ,Published On : October 7, 2020 / 03:27 PM IST
Airtel Xstream బ్రాడ్‌బ్యాండ్ ఆఫర్లు.. ఈ రెండు కొత్త ప్లాన్లపై Amazon Prime సబ్ స్ర్కిప్షన్

Airtel Xstream : భారతీ ఎయిర్‌టెల్ తమ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్ల కోసం కొత్త ఆఫర్లు ప్రవేశపెట్టింది. ప్రత్యేకించి రెండు ప్లాన్లపై అమెజాన్ ప్రైమ్ సబ్ స్ర్కిప్షన్ కూడా అందిస్తోంది. అంతేకాదు.. Wynk music యాప్, Shaw Academy, Voot Basic, Eros Now, Hungama Play వంటి సర్వీసులపై సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. భారతదేశ మార్కెట్లో ఎయిర్ టెల్ కస్టమర్లు Xstream బ్రాడ్ బ్యాండ్ ఆఫర్లను ఎంచుకున్నవారే ఈ బెనిఫెట్స్ పొందవచ్చు. Airtel Xstream బ్రాడ్ బ్యాండ్ ఆఫర్లలో రూ.499, రూ.799 రెండు ప్లాన్లను అందిస్తోంది.



ఈ ప్లాన్లను తీసుకున్న యూజర్లు అమెజాన్ ప్రైమ్ సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు. ప్రస్తుతానికి ఈ రెండు Airtel Xstream broadband plans ఎయిర్ టెల్ అధికారిక వెబ్ సైట్ లేదా Airtel Thanks appలో అందుబాటులో లేవు.. కానీ, అతి త్వరలో అప్ డేట్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది ఎయిర్ టెల్ యూజర్లు మాత్రమే Airtel Thanks యాప్ ద్వారా ఈ రెండు ఆఫర్లను చూసే అవకాశం ఉంది.



ఎయిర్ టెల్ అందించే రూ.499 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా అమెజాన్ ప్రైమ్ సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు. కానీ, ప్లాన్ ధర మాత్రం మారింది. రూ.400 ప్లాన్ ధర కాస్తా రివైజ్ చేశాక రూ.589కి మారింది. ఈ ప్లాన్ తీసుకుంటే అన్ లిమిటెడ్ డేటా, 40Mbps స్పీడ్ వరకు డేటా పొందవచ్చు.



అన్ లిమిటెడ్ లోకల్, STD కాల్స్, ఎయిర్ టెల్ Xstream యాప్ సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు. రెండో ప్లాన్ రూ.799 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ కూడా అప్ డేట్ చేసింది ఎయిర్ టెల్.. ఇప్పుడు ఈ ప్లాన్ ధర రూ.943గా మారింది. ఈ ప్రీమియం ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే అన్ లిమిటెడ్ డేటా 100Mbps స్పీడ్ వరకు పొందవచ్చు. అన్ లిమిటెడ్ లోకల్, STD కాల్స్, ఎయిర్ టెల్ Xstream యాప్ సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు.