Akasa Air: ఆగష్టు నుంచి “ఆకాశ ఎయిర్” విమాన సర్వీసులు ప్రారంభం

న్యూ ఎయిర్‌లైన్ ఆకాశ ఎయిర్ శుక్రవారం ఆగష్టు 7న తన తొలి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ మొదలుపెట్టనుంది. ముంబై-అహ్మదాబాద్ మార్గం మధ్య బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీసును ఆపరేట్ చేయనున్నారు.

Akasa Air: ఆగష్టు నుంచి “ఆకాశ ఎయిర్” విమాన సర్వీసులు ప్రారంభం

Akasha Air

Akasa Air: న్యూ ఎయిర్‌లైన్ ఆకాశ ఎయిర్ శుక్రవారం ఆగష్టు 7న తన తొలి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ మొదలుపెట్టనుంది. ముంబై-అహ్మదాబాద్ మార్గం మధ్య బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీసును ఆపరేట్ చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో 28వారాలకు ముంబై-అహ్మదాబాద్, బెంగళూరు-కొచ్చి మార్గాల మధ్య టికెట్ ప్రారంభించనున్నారు. బెంగళూరు-కొచ్చి సర్వీసులు ఆగష్టు 13నుంచి ఆరంభం కానున్నాయి.

రెండు 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల కమర్షియల్ ఆపరేషన్స్ ను లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే ఒకటి సిద్ధం కాగా, మరొకటి నెలాఖరుకల్లా రెడీ కానుంది.

ఆకాశ్ ఎయిర్ కో-ఫౌండర్, చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అయిన ప్రవీణ్ అయ్యర్.. “ముంబై.. అహ్మదాబాద్‌ల మధ్య బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ నడిపించనున్నాం. నిదానంగా మరిన్ని నగరాలకు సర్వీసులను పెంచుతాం. తొలి ఏడాదిలో నెలకో రెండు ఎయిర్‌క్రాఫ్ట్‌లను యాడ్ చేయాలనుకుంటున్నాం” అని తెలిపారు.

Read Also: ఆకాశ ఎయిర్‌కు డీజీసీఏ అనుమతి.. ఈ నెలలోనే సర్వీసులు ప్రారంభం

ఏవియేషన్ రెగ్యూలేటర్ డీజీసీఏ నుంచి జులై 7న ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ దక్కించుకుంది ఆకాశ ఎయిర్. మ్యాక్స్ విమానాలకు ఆగష్టు 2021లోనే గ్రీన్ లైట్ ఇచ్చేసింది డీజీసీఏ. మొత్తం 72 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసుకునేందుకు గానూ గతేడాది నవంబర్ 26న ఒప్పందం కుదుర్చుకుంది సదరు విమానయాన సంస్థ.