akshaya tritiya : గోల్డ్ కొనేదెలా..

బంగారం అంటే మనకో సెంటిమెంట్.. పసిడి అంటే మనకో శుభసూచకం.. మరి అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొనేదెలా.. దేశవ్యాప్తంగా అన్నీ బంద్ కావడంతో చాలామంది శుభదినంగా భావించే అక్షయ తృతీయ రోజున పసిడి కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.. ఐతే దీనికోసమే జ్యువెలరీ షాపుల యాజమాన్యాలు కొత్త బాట ఎంచుకున్నాయ్.. ఆన్‌లైన్లో బంగారం కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నాయి

akshaya tritiya : గోల్డ్ కొనేదెలా..

బంగారం అంటే మనకో సెంటిమెంట్.. పసిడి అంటే మనకో శుభసూచకం.. మరి అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొనేదెలా.. దేశవ్యాప్తంగా అన్నీ బంద్ కావడంతో చాలామంది శుభదినంగా భావించే అక్షయ తృతీయ రోజున పసిడి కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.. ఐతే దీనికోసమే జ్యువెలరీ షాపుల యాజమాన్యాలు కొత్త బాట ఎంచుకున్నాయ్.. ఆన్‌లైన్లో బంగారం కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నాయి.

రయ్ రయ్ మంటూ ఓ వైపు పసిడి రేటు పరుగులు పెడుతోంది.. మరోవైపు అక్షయ తృతీయ ఫెస్టివల్ దూసుకొచ్చింది..కానీ..ఈ అక్షయ తృతీయకి మాత్రం షాపుల ముందు క్యూల సంగతి ఎలా ఉన్నా… అసలు రేటు చూసి కొనేవాళ్లు కూడా బేజారెత్తుతున్నారు… పది గ్రాముల రేటు 47వేలకు అటూ ఇటూ ఉండటమే ఇందుకు కారణం. మరోవైపు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో గోల్డ్ మర్చంట్స్ ఎన్నడూ లేనివిధంగా షాపులు మూసుకోవాల్సిన సిచ్యుయేషన్ ఏర్పడింది.

ఈ అక్షయ తృతీయని మరీ అంతలా తీసిపారేయక్కర్లేకుండా.. ఆన్‌లైన్‌లో షాపింగ్‌కి అవకాశాలు కన్పిస్తున్నాయి కొన్ని కంపెనీలు.. ఈకామర్స్ సంస్థలలో పేటిఎం ఎప్పట్నుంచో గ్రాముల లెక్కలో కాకుండా.. ఇన్వెస్ట్ చేసే సొమ్ముని బట్టి కూడా గోల్డ్ సేల్స్ చేస్తోంది.. ఇప్పుడు ఏకంగా కొనుగోలు చేసిన బంగారంపై మళ్లీ మూడువేల రూపాయల వరకూ గోల్డ్ అందుకునే ఆఫర్ ప్రకటించింది..  స్వీప్ స్టేక్స్ ద్వారా బంగారం కొనేవారికి క్యాష్ బాక్ ఆఫర్లను కూడా ప్రకటించింది.

ఇప్పటికే లాక్‌డౌన్ ‌టైమ్‌లో జనం పేటిఎం గోల్డ్ ప్లాట్‌ఫామ్‌పై 90 కేజీల బంగారం కొనుగోలు చేసినట్లు ప్రకటించింది.. పేటిఎం అక్కౌంట్లలో గోల్డ్ డిపాజిట్ అయిన తర్వాత.. ఎప్పుడు కావాలంటే అప్పడు డెలివరీ తీసుకోవచ్చు.. ప్రస్తుతం ఉన్న లాక్‌డౌన్‌ కారణంగా అది సాధ్యం కాదు కాబట్టి.. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాతనే డెలివరీ సేవలు అందుబాటులో ఉంటాయి.
వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో జనం నిత్యావసరాలపై తప్ప… ఇంకే రకమైన ఖర్చుల గురించి ఆలోచించే మూడ్‌లో లేరు..

కానీ అక్షయ తృతీయకి మాత్రం కాస్త మినహాయింపు ఉంటుందనేది గోల్డ్ మర్చంట్స్ అభిప్రాయం. అందుకే కొన్ని జ్యువెలరీ షాపులు ఆన్‌లైన్ సేల్స్‌కి ఆహ్వానం పలికాయి. బంగారం ఆభరణాలపై 20 నుంచి 30 శాతం వరకూ తగ్గిస్తున్నట్లు జోరుగా ప్రకటనలు కూడా ఇచ్చేసాయ్.. వెబ్‌సైట్లలో ఆభరణాలకు ఆర్డర్ ఇస్తే.. అక్షయ తృతీయ రోజే కొనుగోలు చేసినట్లుగా రసీదు ఇచ్చే ఏర్పాట్లు చేసాయి. అలా అక్షయ తృతీయరోజు బంగారం కొన్నామనే సెంటిమెంట్ జనాలకు..బిజినెస్ నడిపిన ఊరట పసిడి వ్యాపారులకు దక్కేలా ప్లాన్ చేసుకున్నారు..