పెట్రోల్ బంకులన్నీ మోదీ వసూల్ కేంద్రాలుగా మార్చాలి – కాంగ్రెస్

  • Published By: madhu ,Published On : December 9, 2020 / 01:46 PM IST
పెట్రోల్ బంకులన్నీ మోదీ వసూల్ కేంద్రాలుగా మార్చాలి – కాంగ్రెస్

Narendra Modi Vasooli Kendra : చమురు ధరలు పెరుగుతుండడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. దేశంలోని పెట్రోల్ బంకులన్నీ మోదీ వసూలు కేంద్రాలుగా (Narendra Modi Vasooli Kendra) మార్చాలని కాంగ్రెస్ పార్టీ యువనేత శ్రీవాత్సవ సెటైర్ వేశారు. ఓ పెట్రోల్ బంక్ పేరు మార్చినట్లుగా ఉన్న ఓ ఫొటోను ట్విట్టర్ వేదికగా..ట్వీట్ చేశారు. పెట్రోల్ రూ. 90కి చేరిందని, వాస్తవానికి దీని ధర రూ. 30 అంటు వెల్లడించారు. మోదీ ట్యాక్స్ రూ. 60 అంటూ తెలిపారు. అందుకే పేరు మార్చాలని డిమాండ్ చేశారాయన. గత కొద్ది రోజులు కిందట..రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. పెట్రోల్ గరిష్టంగా రూ. 40కే అమ్మాలని తెలిపారు.



గత కొన్ని రోజులుగా దేశంలో వరుసగా చమురు ధరలు పైకి ఎగబాకుతున్న సంగతి తెలిసిందే. 2018 సెప్టెంబర్ తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి అంటున్నారు విశ్లేషకులు. గత 18 రోజుల్లో పెట్రోల్ లీటర్ ధర రూ. 2.65, డీజిల్ ధర లీటర్ రూ. 3.40కి పెరిగింది. వాణిజ్య రాజధాని ముంబాయిలో కూడా ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర 29 పైసలు పెరుగడంతో రూ.90.34కు చేరగా..డీజిల్ ధర 28 పైసలు పెరుగుదలతో రూ.80.51కు చేరింది. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ కు రూ. 83.71, డీజిల్ లీటర్ కు రూ. 80.51, కోల్ కతాలో పెట్రోల్ ధర రూ. 90.34, డీజిల్ ధర రూ. 80.51, కోల్ కతాలో పెట్రోల్ ధర రూ. 85.19గా ఉంటే..డీజిల్ ధర రూ. 77.44గా ఉంది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 87.06, డీజిల్ ధర రూ. 80.32గా ఉంది.



ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) లు అంతర్జాతీయంగా ఉన్న చమురు ధరలు, విదేశీ మారకపు రేటు ఆధారంగా..పెట్రోల్, డీజిల్ రేట్లను సవరిస్తుంటాయనే సంగతి తెలిసిందే.