Amazon: అమెజాన్‌లో ఉద్యోగాల కోత.. 18,000 మందిని తొలగించనున్న సంస్థ

అమెజాన్ సంస్థ దాదాపు 18,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతుంది. దీనిలో భాగంగా మరో విడత ఉద్యోగులకు సమాచారం అందించింది. అమెజాన్ ప్రధాన కార్యాలయాలుగా ఉన్న వాషింగ్టన్, సియాటిల్, బ్లూవ్యూ ప్రాంతాల్లో ఉద్యోగుల్ని కంపెనీ తొలగించాలని నిర్ణయించింది.

Amazon: అమెజాన్‌లో ఉద్యోగాల కోత.. 18,000 మందిని తొలగించనున్న సంస్థ

Amazon: ఐటీ సహా వివిధ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఇప్పటికే వేలాది మందిని ఉద్యోగాల్లోంచి తొలగించిన అమెజాన్ సంస్థ మరింత మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో ఉద్యోగాల కోత విధించబోతున్నట్లు తెలుస్తోంది.

Nora Fatehi: గల్‌ఫ్రెండుగా ఉంటే ఖరీదైన ఇల్లు ఇస్తానన్నాడు.. సుకేష్ చంద్రశేఖర్‌పై నోరా ఫతేహి ఆరోపణ

తాజా అంచనా ప్రకారం.. అమెజాన్ సంస్థ దాదాపు 18,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతుంది. దీనిలో భాగంగా మరో విడత ఉద్యోగులకు సమాచారం అందించింది. అమెజాన్ ప్రధాన కార్యాలయాలుగా ఉన్న వాషింగ్టన్, సియాటిల్, బ్లూవ్యూ ప్రాంతాల్లో ఉద్యోగుల్ని కంపెనీ తొలగించాలని నిర్ణయించింది. బుధవారం దీనికి సంబంధించి ఉద్యోగులకు నోటీసులు అందాయి. సియాటిల్‌లో 1,852 మందికి, వాషింగ్టన్, బ్లూవ్యూలలోని కార్యాలయాల్లో 448 మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ నోటీసులు జారీ అయ్యాయి. మరో విడతలో భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించబోతుంది. మార్చి 19 నుంచి అమెజాన్‌లో భారీ స్థాయిలో ఉద్యోగాల కోత ప్రారంభమవుతుంది. ఉద్యోగులకు రెండు నెలలపాటు ట్రాన్సిసన్ పీరియడ్ ఇస్తారు. ఆలోపు వేరే కంపెనీల్లో ఉద్యోగం వెతుక్కోవచ్చు.

Rakhi Sawant: హాట్ బ్యూటీ రాఖీ సావంత్ అరెస్ట్.. ఎందుకో తెలుసా?

లేదంటే గడువు పూర్తయ్యాక కంపెనీ వదిలి వెళ్లాలి. అమెజాన్ సంస్థకు మొత్తంగా 3,50,000కుపైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో వేర్ హౌజ్ సిబ్బంది, డెలివరీ పర్సన్స్ కూడా ఉన్నారు. అయితే, అమెజాన్‌లో ఉద్యోగాల కోత ప్రస్తుతం 1 శాతానికే పరిమితమైంది. మైక్రోసాఫ్ట్ సంస్థ కూడా 10,000 మంది ఉద్యోగుల్ని తొలగించబోతున్నట్లు బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ నుంచి ఇప్పటికే భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తీసేసిన ఎలన్ మస్క్ మరో విడత కోతకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

ట్విట్టర్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్ విభాగానికి చెందిన 50 మంది ఉద్యోగుల్ని తొలగించాలని ఎలన్ మస్క్ నిర్ణయించాడు. ట్విట్టర్‌లో భారీ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించాలని మస్క్ భావిస్తున్నాడు. అనేక కార్యాలయాల్ని ఇప్పటికే మూసేస్తున్నాడు. అమెరికాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.