Amazon-MGM: టీవీ సంస్థ ఎంజీఎంను 8.45 బిలియన్ డాలర్లకు కొంటున్నఅమెజాన్

జేమ్స్ బాండ్, రాకీ ఫ్రాంచైజీల హాలీవుడ్ స్టూడియోగా పేరొందిన ప్రముఖ ఫిల్మ్, టీవీ సంస్థ MGMను 8.45 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు అమెజాన్‌తో ఒప్పందం కుదిరింది.

Amazon-MGM: టీవీ సంస్థ ఎంజీఎంను 8.45 బిలియన్ డాలర్లకు కొంటున్నఅమెజాన్

Amazon Mgm

Amazon buys MGM TV Company : జేమ్స్ బాండ్, రాకీ ఫ్రాంచైజీల హాలీవుడ్ స్టూడియోగా పేరొందిన ప్రముఖ ఫిల్మ్, టీవీ సంస్థ MGMను 8.45 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌తో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అమెజాన్ చరిత్రలో రెండవ అతిపెద్దదిగా చెప్పవచ్చు. 2017లో అమెజాన్ హోల్ ఫుడ్స్ 13.7 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

అమెజాన్ స్టూడియోస్.. చలనచిత్ర, టీవీ విభాగాలను ప్రోత్సహించడంలో భాగంగా MGM చిత్రనిర్మాణ చరిత్ర, 4వేల చిత్రాలు, 17వేల టీవీ కార్యక్రమాల విస్తృత శ్రేణిని ప్రభావితం చేయాలని భావిస్తున్నట్లు అమెజాన్ తెలిపింది. MGM చరిత్రను అమెజాన్‌తో అనుసంధానించే అవకాశం లభించడం సంతోషకరమైన విషయమని MGM చైర్మన్ కెవిన్ ఉల్రిచ్ అన్నారు.

అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ , డిస్నీ, ఇతర వీడియో స్ట్రీమింగ్ సర్వీసులో సబ్ స్ర్కైబర్లను తమవైపు తిప్పుకునేందుకు ఆకర్షణీయమైన కంటెంట్ లైబ్రరీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో సర్వీసుతో ఇతర పోటీదారులైన నెట్‌ఫ్లిక్స్ డిస్నీ ప్లస్ వంటి వాటితో అమెజాన్ పోటీపడుతోంది. ఎంజీఎంతో ఈ కొనుగోలు అమెజాన్ ప్రైమ్ సబ్ స్ర్కైబర్లను మరింత ఆకర్షించడంలో సాయపడుతుంది. MGM లైబ్రరీలో ది వాయిస్, షార్క్ ట్యాంక్ వంటి స్క్రిప్ట్ లేని టీవీ షోలు కూడా ఉన్నాయి.