బిల్ గేట్స్ కాదు.. నేనే నెంబర్ వన్ : ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్

  • Published By: sreehari ,Published On : October 26, 2019 / 12:01 PM IST
బిల్ గేట్స్ కాదు.. నేనే నెంబర్ వన్ : ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్

ప్రపంచ కుబేరుడి టైటిల్ ను తిరిగి దక్కించుకున్నాడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్. శుక్రవారం (అక్టోబర్ 25) అమెజాన్ విడుదల చేసిన క్యూ3 ఫలితాల్లో స్టాక్ విలువ పడిపోవడంతో సీఈఓ జెఫ్ సంపద ఒక్కసారిగా పడిపోయింది. దీంతో జెఫ్ స్థానంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. కానీ, అనూహ్య రీతిలో అమెజాన్ ట్రేడింగ్ లో పుంజుకోవడంతో జెఫ్ ఆదాయం ఒక్కసారిగా పెరిగిపోయింది. తద్వారా జెఫ్ ఒక్క రోజులోనే తన అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు. 

గురువారం (అక్టోబర్ 24) ట్రేడింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే అమెజాన్ కంపెనీ షేర్ విలువ 7 శాతానికి పడిపోయింది. విడుదలైన క్యూ3 ఫలితాల్లో కంపెనీ స్టాక్ విలువ దాదాపు 7 బిలియన్ల డాలర్లు కోల్పోయింది. ఫలితంగా జెఫ్ నికర ఆదాయం కూడా 103.9 బిలియన్ల డాలర్లకు పడిపోయింది. శుక్రవారం కూడా అమెజాన్ షేర్లు నష్టాల బాట పట్టాయి.

ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. అమెజాన్ షేర్లు శుక్రవారం 1 శాతానికి పడిపోయి 1,760.78 డాలర్లుగా నమోదైయ్యాయి. దీంతో జెఫ్ నికర ఆదాయం 109.9బిలియన్ల డాలర్లకు చేరింది. ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా జెఫ్ బెజోస్ నెంబర్ వన్ స్థానంలో నిలవగా.. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ 105.8 బిలియన్ల డాలర్లతో  రెండో ప్రపంచ ధనవంతుడిగా నిలిచాడు.