అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020 సేల్ : రూ.10,000లోపు స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

10TV Telugu News

Amazon Great Indian Festival 2020 Sale : అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020 సేల్ ప్రారంభమైంది. ఇప్పటికే ప్రైమ్ మెంబర్లకు అందుబాటులోకి రాగా.. నాన్ ప్రైమ్ మెంబర్లకు అక్టోబర్ 17 నుంచి అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ రూ.10లోపు బెస్ట్ డీల్స్ అందిస్తోంది.స్మార్ట్ ఫోన్లు, మల్టీపుల్ అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్లపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. అందులోనూ HDFC కార్డు యూజర్లు రూ.12వేల లోపు కొనుగోలుపై 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అక్టోబర్ 23 వరకు ఈ సేల్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. మినిమం ఆర్డర్ ఆఫర్ రూ.5వేలపైనా అందిస్తోంది.

Fire TV Stick (రూ. 1,999) :
అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ద్వారా మీ నాన్ స్మార్ట్ టీవీ కూడా స్మార్ట్ టీవీగా మార్చేసుకోవచ్చు. HDMI డొంగల్ ద్వారా మీ టీవీ వెనుక HDMI పోర్టును కనెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా స్ట్రీమింగ్ ప్లాట్ ఫాంలైన ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లెక్స్, వూట్, సోనీ లైవ్ యాక్సస్ చేసుకోవచ్చు. Fire TV Stick (Link to News Story) ద్వారా కేబుల్ టీవీ ఛానళ్లను వాచ్ చేయొచ్చు.

ఈ ఫైర్ టీవీ స్టిక్ ద్వారా ధర రూ.2,399 ఉండొచ్చు. 2019 మోడల్, 2020 మోడల్ Dolby Atmos సపోర్టుతో టీవీ కంట్రోల్స్ ద్వారా ఆఫర్ చేస్తోంది. దీని ధర మార్కెట్లో రూ.2,499గా అందుబాటులో ఉంది. Fire TV Stick Live ధర రూ.1,999, Fire TV Stick 4K ధర రూ.3,599లకే అందిస్తోంది.Echo smart speaker (రూ. 1,999 నుంచి) :
ఎకో ప్రొడక్టులైన అమెజాన్ అలెక్సా స్మార్ట్ స్పీకర్లు వివిధ మోడళ్లలో లభిస్తున్నాయి. ప్లే మ్యూజిక్, స్మార్ట్ హోం ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఎకో డాట్, చిన్న స్మార్ట్ స్పీకర్లను ధర రూ.1,999లకే థర్డ్ జనరేషన్ మోడల్, నాల్గో జనరేషన్ మోడల్ ధర రూ.3,249 లకు అందిస్తోంది.

అమెజాన్ ఎకో (3వ జనరేషన్) ధర రూ.5,999, ఎకో ప్లస్ (2వ జనరేషన్) ధర రూ.6,499 అందిస్తోంది. న్యూ ఎకో షో8లో 8 అంగుళాల డిస్ ప్లేతో ధర రూ.6,999గా ఉంది. ఎకో ఇన్ పుట్ పోర్టబుల్ స్పీకర్ ధర రూ.2,749లకే అందుబాటులో ఉంది.Kindle E-Reader (ధర రూ. 6,499 నుంచి) :
మల్టీపుల్ ఈ-బుక్ రీడర్స్ డిస్కౌంటెడ్ ధరతో అమెజాన్ అందిస్తోంది. Kindle (10వ జనరేషన్) 6 అంగుళాల డిస్‌ప్లే, Wi-Fi, బుల్ట్ ఇన్ లైట్ ధర రూ.6,499 ఆఫర్ అందిస్తోంది. ఈ-రీడర్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. Kindle Paperwhite (10th Gen)తో వచ్చిన 8GB స్టోరేజీ, IPX8 వాటర్ రిసిస్టెన్స్ ధర రూ.9,999లకే అందిస్తోంది.

Redmi 9, Redmi 9A (రూ. 6,498 నుంచి) :
ప్రముఖ స్మార్ట్ ఫోన్ Redmi సిరీస్‌లో Redmi 9 ఫోన్ (4GB+64GB) ప్రారంభ ధర రూ.8,999లకు అందుబాటులో ఉంది. మరో రూ.వెయ్యి పెడితే టాప్ టైర్ (4GB+128GB) స్టోరేజీ మోడల్ ఫోన్ కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఫోన్ Carbon Black, Sky Blue, Sporty Orange మూడు కలర్లలో లభిస్తోంది.ఈ డీల్ లో డ్యుయల్ రియర్ కెమెరాలు, HD+ డిస్‌ప్లే, ఆక్టా కోర్ ప్రాసెసర్, 5,000mAh బ్యాటరీ ఉంది. Redmi 9A ఫోన్ (2GB RAM+ 32GB స్టోరేజీ) సేల్ ధర రూ.6,498లకే ఆఫర్ అందిస్తోంది. సింగిల్ రియర్ కెమెరా, స్లిమ్ డిజైన్, ఆక్టా కోర్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, HD+డిస్ ప్లేలతో ఆకర్షణీయంగా ఉన్నాయి.Samsung Galaxy M01s (ధర రూ. 9,499) :
శాంసంగ్ గెలాక్సీ Galaxy M01 (3GB+32GB వేరియంట్) ధర రూ.9,499లకే అందిస్తోంది. ఈ మోడల్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. డ్యుయల్ రియర్ కెమెరాలు, 4,000mAh బ్యాటరీ, ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. డ్యుయల్ SIM సపోర్టు, HD+డిస్‌ప్లే, ఫింగర్ ఫ్రింట్ స్కానర్ బ్యాక్ సైడ్ ఉంది. ఇక Live Focus, Smart Selifie ఫీచర్లు కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి.

10TV Telugu News