అమెజాన్ లో ట్రైన్ టిక్కెట్స్ బుక్కింగ్..ఫస్ట్ టైమ్ బుక్కింగ్ కు 10% డిస్కౌంట్

  • Published By: nagamani ,Published On : October 8, 2020 / 10:11 AM IST
అమెజాన్ లో ట్రైన్ టిక్కెట్స్ బుక్కింగ్..ఫస్ట్ టైమ్ బుక్కింగ్ కు 10% డిస్కౌంట్

online reserved train ticket bookings in Amazon : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ రోజు రోజుకు తన మార్కెట్ ను విస్తరించుకుంటోంది. ఇప్పటికే అమెజాన్ యాప్ ద్వారా విమాన, బస్సు టికెట్ల అమ్మకాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇకనుంచి ట్రైన్ టిక్కెట్స్ ని కూడా అమెజాన్ లో బుక్ చేసుకోవచ్చు. దీనికి ఎక్స్ ట్రా చార్జీలు కూడా ఉండవని కూడా చెబుతోంది అమెజాన్. దీనికి సంబంధించి ఐఆర్సీటీసీ, అమెజాన్ ఇండియా మధ్య ఒప్పందం కుదిరింది.




అమెజాన్ పే మనీని ఉపయోగించి అమెజాన్ యాప్ ద్వారా ఇకపై ట్రైన్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అమెజాన్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు, ప్రయాణం మొదలుకావడానికి కొన్ని గంటల ముందువరకు ఏ సమయంలోనైనా టికెట్లను క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు.


అమెజాన్ యాప్ ద్వారా మొదటిసారి టికెట్లు బుక్ చేసే కస్టమర్లకు 10 శాతం నగదు (క్యాష్ బ్యాక్) డిస్కౌంట్ లభించనుంది. ఈ డిస్కౌంట్ గరిష్టంగా రూ.100 వరకు ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ రాయితీ 12 శాతం వరకు ఉంటుంది. గరిష్టంగా రూ.120 వరకు ఉంటుంది. ఈ యాప్ ద్వారా రైలు టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఎలాంటి అదనపు చార్జీలు వర్తించవని అమెజాన్ తెలిపింది.



దీనిపై అమెజాన్ పే డైరెక్టర్ వికాస్ బన్సాల్ మాట్లాడుతూ..“ఐఆర్‌సిటిసితో భాగస్వామి అయినందుకు తమకు చాలా సంతోషంగా ఉందనీ తెలిపారు. మా కష్టమర్లను సదా సౌకర్యవంతమైన సర్వీసుల్ని అందించటానికి అమెజాన్ ఎప్పుడూ ముందుంటుందనీ..బిజీ బిజీగా ఉండే నేటి లైఫ్ లో తమ కష్టమర్లకు ఇటువంటి సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్ధేశ్యంలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.


అమెజాన్ లో రిజర్వు చేసిన రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయంతో పాటు కస్టమర్లు ఇష్టపడే ఏ మోడ్‌లోనైనా ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.