వెబ్‌సైట్‌లో సూసైడ్ సెర్చ్ : కస్టమర్లకు అమెజాన్ ఆఫర్!

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఆన్‌లైన్ కస్టమర్లకు ఆఫర్ ప్రకటించింది. తమ వెబ్ సైట్లో సూసైడ్ అంటూ సెర్చ్ చేసేవారికి సాయం చేసేందుకు అమెజాన్.కమ్ ఇంక్ ఆఫర్ అందిస్తోంది.

  • Published By: sreehari ,Published On : August 30, 2019 / 12:40 PM IST
వెబ్‌సైట్‌లో సూసైడ్ సెర్చ్ : కస్టమర్లకు అమెజాన్ ఆఫర్!

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఆన్‌లైన్ కస్టమర్లకు ఆఫర్ ప్రకటించింది. తమ వెబ్ సైట్లో సూసైడ్ అంటూ సెర్చ్ చేసేవారికి సాయం చేసేందుకు అమెజాన్.కమ్ ఇంక్ ఆఫర్ అందిస్తోంది.

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. ఆన్‌లైన్ కస్టమర్లకు ఓ ఆఫర్ ప్రకటించింది. తమ వెబ్ సైట్లో సూసైడ్ అంటూ సెర్చ్ చేసేవారికి సాయం చేసేందుకు అమెజాన్.కమ్ ఇంక్ ఆఫర్ అందిస్తోంది. హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్లను ప్రమోట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇటీవల అమెజాన్ వెబ్ సైట్లో ఎక్కువగా సూసైడ్ ప్రొడక్టుల కోసం సెర్చ్ చేసే యూజర్ల సంఖ్య పెరిగిపోతోంది. సైటు వెబ్ పేజీలో సూసైడ్ అని సెర్చ్ చేసిన యూజర్లకు ఉరితాడులు, ఇతర హానికరమైన ప్రొడక్టులు సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చినట్టు గుర్తించింది. గతవారం అమెజాన్ యూఎస్ మార్కెట్ వెబ్‌సైట్లో suicide అనే పదాన్ని యూజర్లు సెర్చ్ చేయగా వెబ్ పేజీల్లో Suicide kits, ఉచ్చులు డిస్‌ప్లే అయినట్టు కంపెనీ తెలిపింది. 

అమెజాన్ ఇండియా వెబ్ సైట్లో కూడా సూసైడ్ సంబంధిత నిద్రమాత్రలు, పురుగుమందులు, how to commit suicide అనే పేరుగల Book  కూడా సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించినట్టు పేర్కొంది. రెగ్యులేటరీ స్ర్కూనిటీ కలిగిన పెద్ద టెక్ కంపెనీలు పెరిగిపోతుంటే.. నిషేధిత వస్తువులు లేదా అక్రమ ఉత్పత్తులకు సంబంధించి లిస్టింగ్ పేజీల్లో కనిపించడం కారణంగా అమెజాన్ మార్కెట్లో పాలసీ సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి పేజీలను గుర్తించడం పెద్దతలనొప్పిగా మారింది. అందుకే అమెజాన్.. సూసైడ్ సంబంధిత బుక్, ఉరితాడు వంటి లిస్టింగ్ పేజీలను తొలగించింది. 

అంతేకాదు.. ఆత్మహత్యకు పురిగొల్పే ఉత్పత్తులు లేదా నాన్ మీడియా ప్రొడక్టులను తమ వెబ్ సైట్లో వర్తక వ్యాపారులు అమ్మకుండా అమెజాన్ నిషేధం విధించింది. గతవారంలో అమెజాన్ వెబ్ సైట్లో 4వేలకు పైగా సూసైడ్ ప్రొడక్టులను గుర్తించినట్టు వాల్ స్ట్రీట్ జనరల్ రిపోర్టు తెలిపింది. ఇప్పటికే ఇలాంటి హానికర ఉత్పత్తులను యూఎస్ ఏజెన్సీలు నిషేధం విధించాయి కూడా. మరోవైపు అల్ఫాబెట్ ఇంక్ గూగుల్, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఇంక్, ట్విట్టర్ ఇంక్ కంపెనీలు కూడా సూసైడ్ అనే పదానికి సంబంధించి క్వరీలకు సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్లను జారీ చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితమే సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో హనికరమైన కంటెంట్, హింసాత్మక కంటెంట్‌ను నిశితంగా పరిశీలించి తొలగిస్తున్నాయి. 

అమెజాన్ లో కూడా కస్టమర్లను ప్రోత్సహించేందుకు వీలుగా ప్రతి వస్తువు వివరాల కింద ఫీడ్ బ్యాక్ బాక్సును డిస్‌ప్లే చేస్తోంది. సూసైడ్ హెల్ప్ లైన్ సమాచారం.. కొన్ని ప్రొడక్టుల వివరాల పేజీల్లో యాడ్ కానుంది. నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ లైఫ్ లైన్ వంటి సంస్థల ద్వారా రహస్యంగా ఫ్రీ సపోర్ట్ అందించనుంది. రానున్న వారాల్లో సూసైడ్ పదానికి సంబంధించి పదాలను సెర్చ్ చేసే కస్టమర్లకు మెసేజ్ కనిపిస్తుంది. వచ్చేవారం నుంచి యూనైటెడ్ కింగ్ డమ్, యూనైటెడ్ స్టేట్స్ లో కనిపించే సంబంధిత బుక్ ప్రొడక్టు వివరాల పేజీలపై కూడా ఈ తరహా మెసేజ్ కనిపించనుంది.