Amazon Pay: అమెజాన్ పేకు భారతీయ రిజర్వు బ్యాంక్ రూ.3.06 కోట్ల జరిమానా

అమెజాన్ పే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు భారతీయ రిజర్వు బ్యాంక్ రూ.3.06 కోట్ల జరిమానా విధించింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (పీపీఐ), కేవైసీ నిబంధనలకు సంబంధించి మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించకపోవడంతో ఈ జరిమానా విధించింది. ఈ విషయాన్ని ఆర్బీఐ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది.

Amazon Pay: అమెజాన్ పేకు భారతీయ రిజర్వు బ్యాంక్ రూ.3.06 కోట్ల జరిమానా

Amazon pay

Amazon Pay: అమెజాన్ పే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు భారతీయ రిజర్వు బ్యాంక్ రూ.3.06 కోట్ల జరిమానా విధించింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (పీపీఐ), కేవైసీ నిబంధనలకు సంబంధించి మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించకపోవడంతో ఈ జరిమానా విధించింది. ఈ విషయాన్ని ఆర్బీఐ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది.

గతంలోనే అమెజాన్ పే ఇండియాకు ఆర్బీఐ నోటీసు పంపించి, జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వాలని పేర్కొంది. అమెజాన్ పే ఇండియా నుంచి వచ్చిన స్పందన పట్ల ఆర్బీఐ సంతృప్తి చెందలేదు. దీంతో జరిమానా విధిస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. డిజిటల్ వాలెట్ నిర్వహించాలంలే ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (పీపీఐ) పాటించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం భారత్ లో డిజిటల్ వాలెట్ల ద్వారా నగదు చలామణీ విపరీతంగా పెరిగింది. టీ దుకాణాల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అన్ని చోట్లా వాటి ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి. అవన్నీ ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (పీపీఐ), కేవైసీ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే.

Weekend with Nageshwar : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మీ పేరే ఎందుకు? సడెన్‌గా మహిళా రిజర్వేషన్ మీద ఎందుకు పడ్డారు? ఎమ్మెల్సీ కవితతో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. 10టీవీ వీకెండ్ విత్ నాగేశ్వర్