అనిల్ అంబానీ జైలుకేనా! : ఎరిక్సన్ కేసులో ఒక్కరోజే గడువు

అనిల్ అంబానీ జైలుకేనా! : ఎరిక్సన్ కేసులో ఒక్కరోజే గడువు

అనిల్ అంబానీ జైలుకేనా! : ఎరిక్సన్ కేసులో ఒక్కరోజే గడువు

అనీల్ అంబానీ (59)కి జైలుకి వెళ్లకుండా ఉండేందుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఎరిక్సన్ ఇండియాకు చెల్లించాల్సిన రూ.453 కోట్ల బాకీలను మంగళవారం(మార్చి-19,2019)నాటికి క్లియర్ చేయకుంటే మూడు నెలల పాటు ఆయన జైళ్లో చిప్పకూడు తినే అవకాశముంది. దేశవ్యాప్తంగా ఆర్ కామ్ టెలికాం నెట్ వర్క్ సేవల నిర్వహణ కోసం ఆ సంస్థతో ఎరిక్సన్ 2014లో ఏడేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది.
Read Also : వాట్సాప్‌లో కొత్త ఫీచర్ : ఫేక్ న్యూస్‌ను పట్టేస్తుంది

అయితే తమ చెల్లించాల్సిన బకాయిలను ఆర్ కామ్ చెల్లించలేదంటూ ఎరిక్సన్ కోర్టుని ఆశ్రయించింది. దీంతో అక్టోబర్-23,2018న సుప్రీంకోర్టు ఎరిక్సన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. డిసెంబర్-15,2018లోగా ఎరికన్స్ కు బకాయిలు చెల్లించాలని ఆర్ కామ్ ను కోర్టు ఆదేశించింది. ఆలస్యం చేస్తే 12శాతం వార్షిక వడ్డీతో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది.

అయినా కూడా బకాయిలు చెల్లించకపోవడంతో అనిల్ అంబానీని కోర్టు ధిక్కరణ కింద జైలుకి పంపాలని,విదేశాలకు పారిపోకుండా అడ్డుకోవాలని ఎరిక్సన్ మరోసారి సుప్రీంని ఆశ్రయించింది.దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఫిబ్రవరి-20,2018న అనీల్ అంబానీని దోషిగా తేల్చింది. నాలుగువారాల్లోగా ఎరిక్సన్ కు రూ.453 కోట్లు బాకీ చెల్లించకుంటే మూడు నెలల జైలు శిక్ష తప్పదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబానీతో పాటుగా రిలయన్స్ టెలికాం చైర్మన్ సతీష్ సేత్, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ చైర్ పర్శన్ ఛాయావిరాలనీలను కూడా కోర్టు దోషలుగా ప్రకటించింది.వీరు తలా కోటి రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మంగళవారం(మార్చి-19,2019) నాటికి కోర్టు ఇచ్చిన గడువు ముగియనుంది.దీంతో అంబానీ ఆ బాకీ డబ్బులను చెల్లిస్తారా లేకా జైలుకి వెళతారా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
Read Also : అరుదైన వ్యాధి అంట : ముషార్రఫ్ ఆరోగ్యం విషమం

×