ఆపిల్ స్టోర్‌లో BUG : 20 మిలియన్ల యాప్స్ రేటింగ్ మాయం

  • Published By: sreehari ,Published On : November 1, 2019 / 09:30 AM IST
ఆపిల్ స్టోర్‌లో BUG : 20 మిలియన్ల యాప్స్ రేటింగ్ మాయం

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ యాప్ స్టోర్లలో BUG చొరబడింది. రహస్యంగా యాప్ స్టోర్లలో బగ్ తిష్టవేసింది. దీని కారణంగా యాప్ స్టోర్లలోని పాపులర్ యాప్స్ కు సంబంధించి 20 మిలియన్లకు పైగా రేటింగ్స్ ఒక్కసారిగా మాయమైపోయాయి. ప్రత్యేకించి సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్, మైక్రోసాఫ్ట్, నైక్, స్టార్ బక్స్, హులూ సహా ఇతర పాపులర్ యాప్స్ వారానికిపైగా రేటింగ్స్ అదృశ్యమైపోయినట్టు ఓ నివేదిక వెల్లడించింది. మొబైల్ యాప్ ఇన్ సైట్స్ ప్లాట్ ఫాం యాప్ ఫిగర్స్ భారీ స్థాయిలో యాప్ రేటింగ్ పడిపోయినట్టు గుర్తించింది. 

ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి మొత్తం 22 మిలియన్ల యాప్ రివ్యూలు ఉండగా.. వాటిలో 200 డెవలపర్లలో 300వందలకుపైగా యాప్స్ రివ్యూలు కనుమరుగైపోయినట్టు యాప్ ఫిగర్స్ సంస్థ గుర్తించినట్టు టెక్ క్రంచ్ రిపోర్టు తెలిపింది. అక్టోబర్ 23న ఈ సమస్య ఉత్పన్నం కాగా.. అక్టోబర్ 29 వరకు సమస్య అలానే ఉందని, బగ్ కారణంగానే యాప్ రేటింగ్స్ అన్ని రీమూవ్ అయినట్టు అంగీకరిస్తున్నామని ఐఫోన్ మేకర్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. 

ఈ బగ్ కారణంగా ఆపిల్ యాప్ స్టోర్లో డిలీట్ అయిన మొత్తం యాప్ రేటింగ్స్ ఎక్కువగా అమెరికాలోనే ఉండగా, వాటిలో కొన్ని 10 మిలియన్ల యాప్ రేటింగ్స్ మాయమైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ యాప్ రేటింగ్స్ ను బగ్ తొలగించింది. దీని ప్రభావంతో ఆపిల్ సపోర్ట్ అందించే 155 దేశాల్లోని యాప్ స్టోర్లలో చైనా, యూకే, సౌత్ కొరియా, రష్యా, ఆస్ట్రేలియాకు చెందిన ఆపిల్ యాప్ స్టోర్లలోని యాప్స్ రేటింగ్స్ కూడా మాయమైపోయినట్టు కంపెనీ వెల్లడించింది.