ఆపిల్ స్టోర్ నుంచి వ్యాపింగ్ యాప్స్ బ్యాన్

  • Published By: sreehari ,Published On : November 16, 2019 / 08:10 AM IST
ఆపిల్ స్టోర్ నుంచి వ్యాపింగ్ యాప్స్ బ్యాన్

ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ వ్యాపింగ్ (మత్తును పీల్చే) యాప్స్ బ్యాన్ చేసింది. ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే 181 వ్యాపింగ్ సంబంధిత యాప్స్‌ను ఆపిల్ స్టోర్ నుంచి నిషేధిస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ-సిగరేట్ యూజర్లు ఎక్కువగా ఈ యాప్స్ వాడుతున్నారు. తద్వారా మత్తు పీల్చి ఊపిరితిత్తులు దెబ్బతినడం లేదా మరణం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ మొబైల్ డివైజ్ లతో పాటు 900 మిలియన్ల ఐఫోన్లలో కూడా ఈ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ-సిగరేట్స్ వాడే యూజర్ల కోసం ప్రత్యేకించి వ్యాపింగ్ యాప్స్ ఔట్ లెట్స్ ద్వారా సర్కీసు అందిస్తున్నాయి. 

యూజర్ల ఆరోగ్యాన్ని దెబ్బతిసే ఇలాంటి వ్యాపింగ్ యాప్స్ ను తమ ఆపిల్ స్టోర్ నుంచి బ్యాన్ చేయాలని టెక్ దిగ్గజం నిర్ణయించింది. వ్యాపింగ్ ప్రొడక్టులు, ఈ-సిగరేట్లు వాడే ఎక్కువ మంది ఐఫోన్ యూజర్లలో ఊపిరితిత్తుల దెబ్బతినడం లేదా మరణాలకు దారితీస్తుందని ఇటీవల అమెరికా హార్డ్ అసోసియేషన్ లోని సీడీసీకి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాపింగ్ యాప్స్ కు అలవాటుపడినవారిలో ఎక్కువ మంది యూత్ ఉన్నట్టు రిపోర్టు తెలిపింది. 

దీనిపై ఆపిల్ స్పందిస్తూ.. మేం అంగీరిస్తున్నాం. మా ఆప్ స్టోర్ లో రివ్యూ గైడ్ లైన్స్ సహా అన్ని అప్ డేట్ చేశాం. ఇలాంటి ప్రొడక్టులను వాడేలా ప్రోత్సహించడాన్ని అనుమతించేది లేదని ఆపిల్ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ స్టోర్ నుంచి 181 వ్యాపింగ్ రిలేటెడ్ యాప్స్ బ్యాన్ చేసింది. వర్చువల్ షాపు దగ్గర పొగాకుతో సాహా వ్యాపింగ్ సాధనాలను అనుమతించేలేదని ఆపిల్ తెలిపింది.