క్రెడిట్ కార్డులో ‘Minimum due’ చెల్లిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.. నష్టపోతారు జాగ్రత్త!

  • Published By: sreehari ,Published On : September 15, 2020 / 08:48 PM IST
క్రెడిట్ కార్డులో ‘Minimum due’ చెల్లిస్తున్నారా?  ఈ తప్పు చేయొద్దు.. నష్టపోతారు జాగ్రత్త!

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. క్రెడిట్ ఉంది కదా?చాలామంది ఎలా పడితే అలా కార్డులో డబ్బులు గీకేస్తుంటారు.. బిల్లు డేట్ వచ్చేసరికి గీకిన డబ్బు తిరిగి చెల్లించలేక చేతులేత్తేస్తుంటారు. ఫలితంగా క్రెడిట్ కార్డులో వడ్డీ బాదుడు తప్పదు మరి.. గడువు దాటే కొద్ది చక్రవడ్డీ, బారు వడ్డీ ఇలా తడిసి మోపెడుతువుతుంది.. అందుకే క్రెడిట్ కార్డు వాడటం తెలిసి ఉండాలంటారు.. క్రెడిట్ కార్డు వాడకంపై అవగాహన ఉన్నవాళ్లు దాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయగలరు అంటున్నారు ఆర్థిక నిపుణులు.. క్రెడిట్ కార్డులో గీకిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేక మినిమం డ్యూ మాత్రమే చెల్లిస్తుంటారు క్రెడిట్ కార్డుదారులు.. మినమం డ్యూ చెల్లిస్తే.. లేటు పెనాల్టీ నుంచి తప్పించుకోవచ్చులే అని అనుకుంటారు.. అది పోరపాటే..



మీకు తెలియకుండానే బ్యాంకులు అధిక వడ్డీ రూపంలో మీ నుంచి డబ్బులు దండుకుంటున్నాయనే విషయం మర్చిపోతున్నారు.. ఖర్చుపై కంట్రోల్ లేకపోతే అంతే సంగతులు.. అప్పుల పాలు కావాల్సిందేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మినమం డ్యూ చెల్లించడానికి సిద్ధపడొద్దు.. మొత్తం చెల్లించలేని పక్షంలో ఈ మినమం డ్యూ చెల్లించేందుకు ఆసక్తి చూపుతుంటారు.. కానీ, మినమం డ్యూ చెల్లించడం ద్వారా అదనంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుందని గుర్తించలేకపోతున్నారు.

సాధారణంగా క్రెడిట్ కార్డు కంపెనీలు మీరు వాడిన మొత్తంలో 5 శాతాన్ని మినిమం డ్యూగా నిర్ణయిస్తాయి. ఉదాహరణకు మీరు ఏదైనా వస్తువును కొనేందుకు రూ.30,000 క్రెడిట్ కార్డు నుంచి గీకితే.. మీ బిల్లు తేదీన రూ.1500 కడితే సరిపోతుంది. మిగిలిన రూ. 28,500 వచ్చే బిల్లులో వస్తుంది.. అప్పుడైనా ఆ మొత్తాన్ని చెల్లించకతప్పదు.. మిగిలిన మొత్తంపై నెలకు 3 నుంచి 4 శాతం వడ్డీ వసూలు చేస్తారు. మిగిలిన మొత్తాన్ని అవసరమైతే మరో నెలలో కూడా చెల్లించే అవకాశం ఉంది.



రెండో ఆప్షన్ వద్దు.. మొదటి ఆప్షనే ముద్దు :
క్రెడిట్ కార్డు వాడే చాలామందిలో అసలు వడ్డీ ఎలా లెక్కిస్తారో తెలియకపోవచ్చు.. మీ క్రెడిట్ కార్డుకు ప్రతి నెలా 16 బిల్ జనరేట్ అవుతుందంటే.. వచ్చే నెల 6న మీరు బిల్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 15న రూ.10,000 ఏదైనా కొన్నారనుకుందాం.. మీ బిల్లు ప్రతి నెలా 14న బిల్ జనరేట్ అవుతుంటే.. నవంబర్ 14న మీ బిల్లు జనరేట్ అవుతుంది… డిసెంబర్ 5న బిల్ కట్టాల్సి వస్తుంది. మీకు 3 ఆప్షన్లు ఉంటాయి.. 1. బిల్లు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. 2. మినిమం డ్యూ చెల్లిస్తే సరిపోతుంది.. 3. పూర్తిగా చెల్లించకపోవడం.. ఇందులో మొదటి ఆప్షన్‌ ఎంతో ఉత్తమం.. ఎందుకంటే తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తున్నారు.. అది కూడా బిల్ చెల్లించే తేదీన లేదా అంతకంటే ముందే కావొచ్చు.. ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన పనిలేదు..

అదే రెండో ఆప్షన్ ఎంచుకున్నారా? మినిమం డ్యు చెల్లించాలి.. ఒకవేళ మీరు రూ.500 చెల్లించారు.. మిగిలిన మొత్తంలో రూ. 9,500కి 3 శాతం చొప్పున వడ్డీ వేస్తారు.. ఈ మొత్తాన్ని చెల్లించకపోతే మాత్రం రూ.10,000కి వడ్డీతో పాటు డిలే పెనాల్టీ (ఆలస్య రుసం) రూ.400 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మినమం డ్యూలో మీకు తెలియకుండానే వడ్డీ కట్టేస్తున్నారనమాట.. మీకు తెలియని మరో విషయం తెలుసుకోండి.. మీరు చెల్లించాల్సిన మొత్తంలో కొంత మినమం డ్యూ మాత్రమే చెల్లించారంటే.. మిగిలిన మొత్తానికి వడ్డీ పడుతుంది.



వడ్డీ మాయలో పడకండి.. :
వచ్చే నెలలో అదే కార్డు నుంచి మరే ఏదైనా వస్తువు కొనుగోలు చేశారంటే.. ఆ కొన్న మొత్తానికి కూడా వడ్డీ పడుతుంది.. ఇక్కడ మొదట చెల్లించాల్సిన మొత్తంతో పాటు రెండోసారి కొనుగోలు చేసినదానికి కూడా వడ్డీ లెక్క కడతారు.. అంటే.. ఒకవేళ మీరు పాత డ్యూ లేకుంటే మాత్రం కొత్త కొనుగోలుకు ఎలాంటి వడ్డీ పడదు.. పాత డ్యూ అలానే ఉండి.. మరోసారి స్వైప్ చేస్తే మాత్రం రెండింటికి కలిపి వడ్డీ వేస్తారు.. ఆపై వచ్చే నెలలో అంతా కలిపి వడ్డీ వేస్తారు… మళ్లీ అందులోనూ మినమం డ్యూ ఆప్షన్ ఇస్తుంది.. బ్యాంకు.. అది కూడా మినమం డ్యూ చెల్లిస్తూ పోతే.. ఆ మధ్యలో మరోసారి కార్డు స్వైప్ చేస్తే.. మూడింటికి కలిపి వడ్డీ వేస్తారు.. బారు వడ్డీ కడుతూనే ఉండాలి..

మినమం డ్యూ జోలికి పోవద్దు.. :
అందుకే మినమం డ్యూ జోలికి పోవద్దు.. తప్పని పరిస్థితుల్లో అయితేనే ఈ రెండో (మినమం డ్యూ) ఆప్షన్ ఎంచుకోవాలి.. లేదంటే.. మొత్తం అమౌంట్ బల్క్ పేమెంట్ చేసేయండి.. అక్కడితో ఆగిపోతుంది.. ఆ తర్వాత స్వైప్ చేస్తే ఎలాంటి వడ్డీ పడదు.. కొనుగోలు చేసిన తేదీ నుంచి బిల్ జనరేట్ అయ్యే వరకు ఎలాంటి వడ్డీ ఉండదు.. బిల్ డ్యూ డేట్ లోగా చెల్లిస్తే పర్వాలేదు..

ఒకవేళ ఆలస్యం చేస్తే పెనాల్టీ పడుతుంది.. చెల్లించాల్సిన మొత్తంలో ప్రిన్సిపుల్ అమౌంట్ ఎంత ఉందో దానితో కలిపి వడ్డీ లెక్కిస్తారు.. అందుకే ఎప్పుడూ స్వైస్ చేసిన మొత్తాన్ని ఆ డ్యూ డేట్ లోగా చెల్లించడమే బెటర్ అంటున్నారు ఆర్థిక నిపుణులు.. లేదంటే వడ్డీలు కట్టలేక దివాలు తీయాల్సిందే మరి.. ఏముంది.. బిల్లు కట్టడం ఎగ్గేట్టొస్తే ఏమౌతుందిలే అనుకుంటే పొరపాటే.. ఈ మధ్యన కొన్ని బ్యాంకులు ఖాతాదారుడి క్రెడిట్ తో పాటు సంబంధిత అకౌంట్ ఉంటే.. అందులోని నగదును కట్ చేసుకుంటున్నాయి.. క్రెడిట్ కార్డు వాడంది తప్పదు.. బిల్లు చెల్లించక తప్పదు.. లేదంటే.. వడ్డీలతో నడ్డి విరిగిపోవడం ఖాయం..