ఏది బెటర్ అంటే : అక్షయ తృతీయకి బంగారం కొనాలా.. బాండ్లు తీసుకోవాలా?

బంగారం కొనాలా? వద్దా? లేదా మరి ఏదైనా రూపంలో బంగారం కొనవచ్చా? గోల్డ్ కాయిన్స్ కొనాలా? లేదా సోవరేన్ గోల్డ్ బాండ్ (SGB)ద్వారా బంగారం కొనుగోలు చేయవచ్చా?

  • Published By: sreehari ,Published On : May 3, 2019 / 10:13 AM IST
ఏది బెటర్ అంటే : అక్షయ తృతీయకి బంగారం కొనాలా.. బాండ్లు తీసుకోవాలా?

బంగారం కొనాలా? వద్దా? లేదా మరి ఏదైనా రూపంలో బంగారం కొనవచ్చా? గోల్డ్ కాయిన్స్ కొనాలా? లేదా సోవరేన్ గోల్డ్ బాండ్ (SGB)ద్వారా బంగారం కొనుగోలు చేయవచ్చా?

ఇండియాలో బంగారానికి ఎంతో సెంటిమెంట్ ఉంది. అక్షయ తృతీయ.. అనగానే.. అందరూ శుభకరమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున బంగారం కొంటే చాలా మంచిదని విశ్వసిస్తుంటారు. ఎన్నోఏళ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. అక్షయ తృతీయ రాగానే.. ముందుగా జ్యుయెలరీ షాపులు కిటకిటలాడుతాయి. బంగారానికి భారీ డిమాండ్ ఉండేది ఆ రోజునే.. ఎలాగైనా సరే.. బంగారం కొనేందుకు మహిళలందరూ క్యూ కట్టేస్తారు. గోల్డ్ ధర ఎంతైనా సరే.. కొనేందుకు రెడీ అవుతారు. జ్యుయెలరీ షాపు యజమానులు కూడా ప్రత్యేక ఆఫర్లతో బంగారం కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రతి ఏడాదిలానే 2019 ఏడాదిలో కూడా అక్షయ తృతీయ రానుంది. మే 7, 2019 రోజున అక్షయ తృతీయ. దీనికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది.  

అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం బాగానే ఉంది. ఎంతో విలువైన బంగారాన్ని కొనేముందు ఒక్కసారి ఆలోచించుకోవాలంటున్నారు విశ్లేషకులు.. బంగారం కొనాలా? వద్దా? లేదా మరి ఏదైనా రూపంలో బంగారం కొనవచ్చా? గోల్డ్ కాయిన్స్ కొనాలా? లేదా సోవరేన్ గోల్డ్ బాండ్ (SGB)ద్వారా బంగారం కొనుగోలు చేయవచ్చా? అలా కొంటే.. కలిగే లాభాలేంటి? బంగారం రూపంలో కొంటే కలిగి నష్టలేంటీ.. ఈ ప్రశ్నలింటికీ సమాధానం దొరకాలంటే.. ఇది చదవాల్సిందే. 

ప్యూర్ గోల్డ్ కొంటే (ఫిజికల్ గోల్డ్) : 
భారతీయుల్లో చాలామంది.. ప్రత్యేకించి మహిళలు ఎక్కువగా ఫిజికల్ గోల్డ్ (బంగారం రూపంలో)కు ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎందుకుంటే.. అవసరమైనప్పుడు బంగారాన్ని ధరించే అవకాశం ఉంటుంది. చేతితో తాకవచ్చు. బంగారాన్ని తాకినప్పుడు వారు ఎంతో అనుభూతికి లోనవుతారు. మిలమిల మెరిచే బంగార నగలను చూసి మురిసిపోతుంటారు. బంధువులకు, పొరుగింటివారికి, శుభకార్యాల్లో ధరించి అందరికి చూపించుకుని ముచ్చటపడుతుంటారు. ఫిజికల్ గోల్డ్ ద్వారా విలువైన సొమ్మును సంపాదించినట్టు సంతృప్తి పొందుతారు. 

SGB గోల్డ్ బాండ్ : 
ఈ ఎస్ జీబీ గోల్డ్ బాండ్ రూపంలో కొన్న బంగారం విషయంలో పెద్దగా సంతృప్తి పొందరు. నేరుగా బంగారాన్ని చూడటం.. తాకడం ద్వారా కలిగే అనుభూతి గోల్డ్ బాండ్ ద్వారా కనిపించదు. బంగారం కొన్నామనే ఫీలింగ్ వారిలో పెద్దగా ఉండదు.. ఫిజికల్ గోల్డ్ లాగే గోల్డ్ బాండ్ విలువ ఒకేలా ఉన్నప్పటికీ.. విజ్యువల్ గా ప్రాముఖ్యత డిఫరెంట్ గా ఉంటుంది. 

గోల్డ్ మెటల్ కొనుగోలు ఖర్చు : 
ఇంపోర్టెడ్ జ్యుయెలరీని మెటల్ రూపంలో కొనుగోలు చేస్తే.. తయారీకి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దిగుమతి ధరపై జీఎస్టీతో కలిపి 10 శాతం చెల్లించాలి. జ్యుయెలరీ రూపంలో గోల్డ్ విలువపై జీఎస్టీ 3 శాతం వరకు భరించాలి. మేకింగ్ ఛార్జీలపై అదనంగా 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అదే.. SGB గోల్డ్ బాండ్ ద్వారా బంగారం కొనుగోలు చేసినట్టయితే.. ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరమే ఉండదు. 

ఫిజికల్ గోల్డ్ రిస్క్ : 
ఫిజకల్ గోల్డ్ మెటల్ రూపంలో కొనుగోలు చేసిన బంగారాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఎన్నో రిస్క్ లు ఉంటాయి. బంగారాన్ని దొంగలు దొంగలించే అవకాశాలు ఎక్కువ. అదే.. SGB గోల్డ్ బాండ్ రూపంలో బంగారం కొనుగోలు చేసినట్టయితే.. దొంగలు దోచుకెళ్తారనే భయం ఉండదు.. సేప్టీగా ఇంట్లో దాచుకోవచ్చు. 

బ్యాంకు లాకర్లలో గోల్డ్ రిస్క్ : 
ఫిజికల్ గోల్డ్ ను కొనుగోలు చేసి.. ఇంట్లో పెట్టుకుంటే దొంగల భయం ఉందనకుంటే.. బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవచ్చు. బ్యాంకు లాకర్లు కూడా చాలావరకు సేఫ్ అనే చెప్పాలి.. ఇంటితో పోల్చుకుంటే.. కానీ, పూర్తిగా బ్యాంకు లాకర్లు కూడా సురక్షితమని కచ్చితంగా చెప్పలేం.. ఎందుకంటే.. బ్యాంకుల్లో కూడా దొంగతనాలు జరుగుతుంటాయి.. 

బ్యాంకు లాకర్ల ఛార్జీల ఖర్చు :   
ఫిజికల్ గోల్డ్ ను బ్యాంకు లాకర్లలో భద్రపరిచేందుకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. నెలవారీగా లాకర్ ఛార్జీలు చెల్లించాలి. ఇందుకోసం.. బంగారం విలువతో కొంత నగదును ఫిక్సడ్ డిఫాజిట్ (FD) చేయాల్సి ఉంటుంది. లేదంటే.. ఏ బ్యాంకు బంగారం దాచేందుకు లాకర్లు ఇవ్వదు. ఒకవేళ బ్యాంకు లాకర్లలో నష్టపోయిన బంగారానికి తగిన నష్టపరిహారాన్ని కూడా పొందే అవకాశం ఉంది. ఇందులో బంగారానికి ఇన్యూరెన్స్ కవరేజీ కూడా ఉంటుంది. ఇంట్లో లేదా ధరించిన బంగారం దొంగలు ఎత్తుకెళ్లినా కూడా ఈ ఇన్యూరెన్స్ కవరేజీ ఉంటుంది. అదే SGB గోల్డ్ బాండ్ ద్వారా కొనుగోలు చేస్తే ఇలాంటి అనవసరపు ఖర్చులు భరించాల్సిన పనిలేదు. SGB గోల్డ్ బాండ్ పై.. ప్రభుత్వం చెల్లించే వార్షిక వడ్డీ కింద 2.5 శాతం వరకు బెనిఫెట్ పొందవచ్చు. 

కొన్న బంగారం అమ్మితే (రీసేల్ వ్యాల్యూ) :
కొనుగోలు చేసిన ఫిజికల్ గోల్డ్ ను తిరిగి అమ్మినప్పుడు.. మేకింగ్ ఛార్జీలను కోల్పోతారు. SGB గోల్డ్ బాండ్ రూపంలో కొనుగోలు చేసిన బంగారం విలువకు ఎలాంటి నష్టం ఉండదు. బంగారం కొన్నప్పుడు ఎంత విలువ ఉందో.. అమ్మే సమయంలో మార్కెట్ విలువ ఎంత ఉంటే అదే ధరకు బంగారాన్ని అమ్మవచ్చు. నమ్మకాలు, ఫీలింగ్ కాసేపు పక్కనపెడితే.. ఫిజికల్ గోల్డ్ కంటే.. కొనడం.. దాచుకోవడానికి SGB గోల్డ్ బాండ్ ఎంతో సౌకర్యంగా.. ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే.. SGB డైరెక్ట్ సేల్ పై.. ఎంత ధర.. ఎంత అవధి ఉంటుందో తెలియాలంటే.. RBI ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. ఎక్సేంజ్ ద్వారా కూడా బంగారం కొనుగోలు చేయవచ్చు.

2018 ఏడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాదిలో అక్షయ తృతీయ రోజున పసుపు వర్ణంతో కూడిన బంగారానికి భారీ డిమాండ్ పెరుగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC)అంచనా వేస్తోంది. అందులోనూ పెళ్లి శుభకార్యాలు జరిగే సమయం కూడా కావడంతో బంగారానికి మరింత గిరాకీ ఉంటుందని డబ్ల్యూజీసీ భావిస్తోంది.