ఆన్‌లైన్ గేమింగ్ బిజినెస్‌లోకి ఆసియా రిచెస్ట్ మ్యాన్

ఆసియాలో నెంబర్ 1 ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ నెక్ట్స్ ఆన్ లైన్ గేమింగ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనున్నారా అంటే అవుననే వార్తలు

  • Published By: veegamteam ,Published On : February 24, 2020 / 05:58 PM IST
ఆన్‌లైన్ గేమింగ్ బిజినెస్‌లోకి ఆసియా రిచెస్ట్ మ్యాన్

ఆసియాలో నెంబర్ 1 ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ నెక్ట్స్ ఆన్ లైన్ గేమింగ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనున్నారా అంటే అవుననే వార్తలు

ఆసియాలో నెంబర్ 1 ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ నెక్ట్స్ ఆన్ లైన్ గేమింగ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనున్నారా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఆన్ లైన్ గేమింగ్ గురించి ముకేష్ అంబానీ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు దారితీశాయి. సోమవారం(ఫిబ్రవరి 24,2020) మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనాదెళ్లతో ముకేష్ అంబానీ మాట్లాడారు. ఆన్ లైన్ గేమింగ్ గురించి ప్రస్తావించారు. మ్యూజిక్, మూవీస్, టెలివిజన్ కన్నా.. భారత్ లో గేమింగ్ రంగం మరింత విస్తరిస్తుందని అంచనా వేశారు. భారత దేశంలో గేమింగ్ రంగానికి చాలా స్కోప్ ఉందని తెలిపారు. పెరుగుతున్న బ్రాండ్ బ్యాండ్ కనెక్టివిటీతో గేమింగ్ రంగం విస్తరణకు అవకాశం ఉందని అంబానీ అన్నారు. ముకేష్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. నెక్ట్స్ ఆయన.. గేమింగ్ వ్యాపారంలోకి దిగనున్నారనే సంకేతాలు వచ్చాయి. అయితే.. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. గేమింగ్ సెగ్మెంట్ లోకి వెళ్తుందని కచ్చితమైన ప్రకటన మాత్రం చెయ్యలేదు. జియోకి 38 కోట్ల మంది వినియోగదారులు ఉన్న సంగతి తెలిసిందే.

అంబానీ వ్యాఖ్యలు చూస్తుంటే.. గేమింగ్ బిజినెస్ పై ఆయన ఆసక్తి చూపిస్తున్నట్టు ఉందనే వార్తలు వస్తున్నాయి. దేశంలో ఆన్ లైన్ గేమింగ్ రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఆన్ లైన్ గేమింగ్ కు ఆదరణ పెరుగుతోంది. ఫ్యాంటసీ స్పోర్ట్స్ లీగ్స్, క్విజ్జింగ్, పోకర్ లాంటి కార్డు గేమ్స్ కు మంచి గ్రోత్ ఉంది. ఇవన్నీ కూడా స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి. రానున్న రెండేళ్లలో డేటా చార్జీలు మరింత చౌక కానున్నాయి. దీంతో 85 కోట్ల మంది యూజర్లు హైస్పీడ్ ఇంటర్నెట్ వాడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి.

ఆన్ లైన్ గేమింగ్ రంగం ద్వారా ఆదాయం కూడా బాగానే వస్తోంది. ఈ రంగం ద్వారా వచ్చే రెవెన్యూ.. రానున్న రోజుల్లో 72వేల కోట్లకు పెరగనుందని మార్కెట్ వర్గాల అంచనా. ఏవైపు నుంచి చూసినా ఆన్ లైన్ గేమింగ్ లాభదాయకంగా ఉంది. దీంతో ఈ బిజినెస్ పైనా ముకేష్ అంబానీ చూపు పడినట్టుంది. ఈ వ్యాపారంలోకి కూడా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన ముకేష్ అంబానీలో మొదలైనట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ముకేష్ అంబానీ బిజినెస్ లన్నీ ఫ్రాఫిట్ లో ఉన్నాయి. ఆయన పట్టిందల్లా బంగారం అవుతోంది. ఏ రంగానికి ఫ్యూచర్ ఉందో తెలుసుకుంటూ ఉంటారు ముకేష్ అంబానీ. ఈ క్రమంలో ఆన్ లైన్ గేమ్ంగ్ పై ఆయన కన్ను పడింది. మరి ఆన్ లైన్ గేమింగ్ బిజెనెస్ లోకి అంబానీ ఎంట్రీ ఇస్తారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ముంబైలో ప్యూచర్ డీకోడెడ్ సీఈవో సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ లో ముకేష్ అంబానీ, సత్య నాదెళ్ల పాల్గొన్నారు. భారత దేశం ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా అవతరిస్తుందని, మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ ఎదుగుతుందని అంబానీ చెప్పారు. ముఖ్యమైన టెక్నాలజీల్లో కంపెనీలు బలపడాలని సత్యనాదెళ్ల అన్నారు. ఈ సమ్మిట్ తర్వాత మైక్రోసాఫ్ట్, రిలయన్స్ భాగస్వామ్యంపై మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.