Automobile retail sales: పండుగల సీజన్.. ఆటోమొబైల్ రీటైల్ అమ్మకాల జోరు

 పండుగల సీజన్ నేపథ్యంలో దేశంలో ఆటోమొబైల్ రీటైల్ అమ్మకాలు గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే గత నెల 11 శాతం పెరిగాయి. వీటి వివరాలను ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఇవాళ మీడియాకు తెలిపింది. గత నెల మొత్తం రీటైల్ అమ్మకాలు 14,64,001 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది సెప్టెంబరులో 13,19,647 యూనిట్లుగా ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే గత నెల (2022, సెప్టెంబరు)లో ట్రాక్టర్లు మినహా ఇతర మూడు చక్రాల వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరిగాయి.

Automobile retail sales: పండుగల సీజన్.. ఆటోమొబైల్ రీటైల్ అమ్మకాల జోరు

Automobile retail sales

Automobile retail sales: పండుగల సీజన్ నేపథ్యంలో దేశంలో ఆటోమొబైల్ రీటైల్ అమ్మకాలు పెరిగాయి. గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే గత నెల (2022, సెప్టెంబరు) 11 శాతం పెరిగాయి. వీటి వివరాలను ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ ఇవాళ మీడియాకు తెలిపింది. గత నెల మొత్తం రీటైల్ అమ్మకాలు 14,64,001 యూనిట్లుగా ఉండగా, గత ఏడాది సెప్టెంబరులో 13,19,647 యూనిట్లుగా ఉన్నాయి.

గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే గత నెల (2022, సెప్టెంబరు)లో ట్రాక్టర్లు మినహా ఇతర మూడు చక్రాల వాహనాలు, ప్యాసింజర్ వాహనాలు, కమర్షియల్ వాహనాలు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరిగాయి. అంతేకాదు, ఈ నెల ఆటోమొబైల్ రీటైల్ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాల విభాగాల విషయంలో అమ్మకాలు భారీగా జరిగే అవకాశం ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అంచనా వేసింది.

గత ఏడాది సెప్టెంబరుతో పోల్చితే గత నెల ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 10 శాతం పెరిగాయి. గత నెల 2,60,556 యూనిట్ల అమ్మకాలు జరిగితే గత ఏడాది ఇదే సమయానికి 2,37,502 యూనిట్ల అమ్మకాలు జరిగాయి.

ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు 9 శాతం పెరిగాయి. గత నెల 10,15,702 యూనిట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడైతే, గత ఏడాది ఇదే నెల 9,31,654 యూనిట్లు అమ్ముడుపోయాయి.

కమర్షియల్ వాహనాలు 19 శాతం అధికంగా అమ్ముడుపోయాయి. గత నెల 71,233 యూనిట్లు అమ్ముడుపోతే గత ఏడాది ఇదే సమయానికి 59,927 యూనిట్లు అమ్ముడుపోయాయి.

ట్రాక్టర్లు మాత్రం కాస్త తక్కువగా అమ్ముడుపోయాయి. గత నెల 52,595 యూనిట్లుగా ఉంటే, గత ఏడాది ఇదే సమయానికి 53,392 యూనిట్లు అమ్ముడుపోయాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..