కాలేజీ చదువులకు గుడ్ బై చెప్పి బిలియనీర్లు అయిన ఈ ఆరుగురి గురించి మీకు తెలుసా..

కాలేజీ చదువులకు గుడ్ బై చెప్పి బిలియనీర్లు అయిన ఈ ఆరుగురి గురించి మీకు తెలుసా..

రోజూ కాలేజీలకు వెళ్లిపోయి.. రెగ్యూలర్ గా ఎగ్జామ్స్ లో పాసైపోతేనే బిలియనీర్లు అవతారా.. అలాఅయితే కాలేజీలకు డాప్ర్ పెట్టేసి బిలియనీర్లు అయిన ఈ ఆరుగురి కథ ఏంటి? ఏం చేసి వీరు అంతటి ఉననత స్థానాలకు ఎదగగలిగారు.

ముఖేశ్ అంబానీ
ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల జాబితాలో ఇండియన్ల పేర్లు చాలా తక్కువగా ఉంటాయి. 1980లలో ప్రచురితమైన ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో MBA చదువుతున్న అంబానీ ఇండియా వచ్చారు. అతని ఫ్యామిలీ బిజినెస్ లో జాయిన్ అయ్యారు. ఇక మిగిలిందతా ఓ చరిత్రగా నిలిచిపోయింది.

అజీమ్ ప్రేమ్‌జీ
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మరో డ్రాప్ అవుట్ అజీమ్ ప్రేమ్‌జీ. 21ఏళ్ల వయస్సులోనే మైక్రోసాఫ్ట్ మెయిన్ పర్సన్ గా నిలిచారు. తన తండ్రి హఠాన్మరణం తర్వాత వంట నూనె వ్యాపారంలో జాయిన్ అయ్యారు. చైర్ పర్సన్ హోదాకు మళ్లీ చేరుకున్నారు. వెస్టరన్ ఇండియా వెజిటేబుల్ ప్రోడక్ట్స్ లిమిటెడ్ ను ఊహించని ఎత్తుకు చేర్చాడు.

సుభాష్ చంద్ర
పలు రకాల పెట్టుబడులు పెట్టి.. సక్సెస్ అయిన అతికొద్ది వ్యాపారవేత్తలలో సుభాష్ చంద్ర ఒకరు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ హోదాను దక్కించుకున్నారు. జీ ఎంటర్‌టైన్మెంట్ వ్యవస్థాపకులు కూడా ఈయనే. చిన్న వ్యాపారంలో జాయిన్ అవడం కోసం ఆయన పదో తరగతిలోనే చదువు మానేశాడు.

గౌతం అదానీ:
పవర్ సప్లై ఇండస్ట్రీలో ఈ పేరొక సంచలనం. ఇంటి అవసరాలకు, కమర్షియల్ అవసరాల్లో కూడా అదానీ కీలకం అయిపోయారు. గుజరాత్ యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే మానేశారు. అతని ఫ్యామిలీ బిజినెస్ అయిన టెక్స్ టైల్ ఇండస్ట్రీలో జాయిన్ అయి అతని కల నెరవేర్చుకున్నారు.

ముకేశ్ జోగటియానీ
గల్ఫ్ కు చెందిన ల్యాండ్‌మార్క్ గ్రూప్ వ్యవస్థాపకులు, చైర్‌పర్సన్ ముకేశ్ జోగటియానీ. లండన్ లోని బిజినెస్ స్కూల్ లో ఎకనామిక్స్ చదువుకోవడానికి జాయిన్ అయి మధ్యలోనే ఎంటర్‌ప్రెన్యూరియల్ జర్నీ మొదలుపెట్టారు. ల్యాండ్‌మార్క్ గ్రూప్ ప్రస్తుతం రిటైల్ స్టోర్ గా దిగ్గజ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2వేల 300 అవుట్‌లెట్లు ఉన్నాయి.

షహీద్ బల్వా:
రియల్ ఎస్టేట్ బెహెమోత్ డీబీ రియల్టీకి సహ వ్యవస్థాపకుల్లో ఒకరు షహీద్ బల్వా. ఫ్యామిలీ హోటల్ బిజినెస్ లో జాయిన్ అయ్యేందుకు కాలేజి మానేశారు. ఆ తర్వాత మెరైన్ లైన్స, ముంబైలో బల్వాస్ హోటల్ బిజినెస్ లను అభివృద్ధి చేశారు. రియల్ ఎస్టేట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అడుగుపెట్టి నిజమైన స్థాయికి ఎదిగారు. వినోద్ గోయెంకాతో కలిసి 2006లో రియల్ ఎస్టేట్ రంగంలోకి దిగారు.