పెళ్ళిచేసుకోండి అప్పులిస్తాం : బజాజ్ ఫిన్ సర్వ్

  • Published By: chvmurthy ,Published On : November 20, 2019 / 01:54 AM IST
పెళ్ళిచేసుకోండి అప్పులిస్తాం : బజాజ్ ఫిన్ సర్వ్

పెళ్లంటే నూరేళ్ల పంట. మారుతున్నకాలంతో పెళ్లి ఖర్చులు పెరుగుతున్నాయి. ఫంక్షన్ హాళ్లకు, కేటరింగ్ కు అయ్యే ఖర్చు భారీగానే పెరిగింది. పెళ్లి అంటే ఆడపిల్ల వారితో సమానంగా మగ పెళ్ళి  వారికి ఖర్చులు పెరిగాయి. ఇప్పుడు సమాజంలో పెరిగిన పెళ్ళి ఖర్చులు భరించటం తలకిమించిన భారంగా మారుతోంది. ఇక మీకు ఆ చింత అక్కర్లేదంటోంది బజాజ్ ఫిన్ సర్వ్.

బజాజ్ గ్రూప్ నకు చెందిన ఈ సంస్ధ ఇప్పుడు పెళ్లి ఖర్చుల కోసం రూ. 25 లక్షల వరకు రుణం ఇవ్వటానికి ముందుకొస్తోంది.  పెళ్లంటే పెళ్లి కార్డులు కొట్టించటం.. ఫంక్షన్ హాలు అద్దెకు తీసుకోవటం.. బట్టలు, నగలు, రిటర్న్ గిఫ్ట్ లు కొనుగోలు, వచ్చిన అతిధులకు, బంధువులకు బోజనాలు వసతి సౌకర్యాలు, కొన్నిచోట్ల రానుపోనూ ఖర్చులు ఇలా  ఎన్నో ఖర్చులు ఉంటున్నాయి.

ఈ పెళ్లి ఖర్చుల కోసం పెళ్లి రుణం ఇస్తోంది బజాజ్ ఫిన్స్ సర్వ్. మంచి ఉద్యోగం ఉండి 23 నుంచి 55 సంవత్సరాల లోపు వయసుకల వారికి  రూ.25 లక్షల వరకు రుణం ఇస్తానంటోంది. ఈ మొత్తాని 60 సులభ నెలసరి వాయిదాల్లోచెల్లించాల్సి ఉంటుందని సంస్ధ వివరించింది.