బ్యాంకు కస్టమర్లకు అలర్ట్ : క్యాష్ విత్ డ్రా చేస్తే.. 100 రివార్డ్ పాయింట్లు!

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ట్రాన్స్ జాక్షన్ ఛార్జీలు భారీగా పెరిగిపోనున్నాయి. క్యాష్ విత్ డ్రా చేస్తే భారీగా ఛార్జీలు పడతాయని వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Published By: sreehari ,Published On : September 20, 2019 / 10:56 AM IST
బ్యాంకు కస్టమర్లకు అలర్ట్ : క్యాష్ విత్ డ్రా చేస్తే.. 100 రివార్డ్ పాయింట్లు!

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ట్రాన్స్ జాక్షన్ ఛార్జీలు భారీగా పెరిగిపోనున్నాయి. క్యాష్ విత్ డ్రా చేస్తే భారీగా ఛార్జీలు పడతాయని వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ట్రాన్స్ జాక్షన్ ఛార్జీలు భారీగా పెరిగిపోనున్నాయి. క్యాష్ విత్ డ్రా చేస్తే భారీగా ఛార్జీలు పడతాయని వార్తలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకు బ్రాంచ్ దగ్గరకు వెళ్లి క్యాష్ విత్ డ్రా చేసినా కూడా ఛార్జీల మోత నుంచి తప్పించుకోలేరు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకు ఖాతాదారులందరికి ట్రాన్స్ జాక్షన్ ఛార్జీల ఫొబియో పట్టుకుంది.

ఎస్బీఐ కస్టమర్లకు లక్కీ ఛాన్స్ :
ప్రత్యేకించి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI) తమ కస్టమర్లకు క్యాష్ విత్ డ్రా విషయంలో లక్కీ ఛాన్స్ ఇచ్చింది. క్యాష్ విత్ డ్రా ద్వారా రివార్డ్స్ పాయింట్స్ పొందే అవకాశం కల్పించింది. క్యాష్ విత్ డ్రా చేసిన ఖాతాదారులకు 100 రివార్డు పాయింట్లను ఆఫర్ చేస్తోంది. ఏటీఎంల్లో ఎక్కువగా కార్డు క్లోనింగ్, సర్ఫింగ్, కార్డు స్కిమ్మింగ్ వంటి మోసాలు జరుగుతున్నాయి. కస్టమర్ల కళ్లుగప్పి మోసగాళ్లు వారి అకౌంట్ల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి మోసాలకు చెక్ పెట్టేందుకు ఎస్బీఐ చక్కని అవకాశం కల్పిస్తోంది. అదే.. YONO Cash. అంటే.. కార్డులెస్ టెక్నాలజీ. 

నెలకు రెండు విత్ డ్రా.. మాత్రమే : 
ఈ టెక్నాలజీ ద్వారా YONO క్యాష్ పాయింట్ సౌకర్యం ఉన్న ఏటీఎంల్లో ఈజీగా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. అలాగే రివార్డు పాయింట్లు కూడా పొందవచ్చు. YONO యాప్ ద్వారా డెబిట్ కార్డు లేకుండానే ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. కార్డ్ లెస్ సౌకర్యం ద్వారా కార్డు స్కిమ్మింగ్, క్లోనింగ్ మోసాలను నిర్మూలించడమే కాదు.. ఎస్బీఐ కస్టమర్లు ప్రతి లావాదేవీపై 100 వరకు రివార్డు పాయింట్లు పొందవచ్చు.

సెప్టెంబర్ 1, 2019 నుంచి డిసెంబర్ 31, 2019 చేసిన క్యాష్ విత్ డ్రాలపై రివార్డు పొందవచ్చు. YONO Cash ద్వారా నెలకు ఒక్కో కస్టమర్ గరిష్టంగా రెండు విత్ డ్రాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. YONO క్యాష్ ఫెసిలిటీలోని సెక్యూరిటీ ఫీచర్ ఉండటం కారణంగా కార్డ్ లెస్ విత్ డ్రా ఈజీగా చేసుకోవచ్చు. ఇందులో 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెక్యూరిటీ కూడా ఉంది. 

YONO యాప్.. Cardless ట్రాన్స్ జాక్షన్ :
బ్యాంకు కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్‌లో YONO యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రాన్స్ జాక్షన్ చేయాలంటే YONO cash PIN (6 అంకెల నెంబర్) ఎంటర్ చేయాల్సి చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఏటీఎంలో క్యాష్ విత్ డ్రా ప్రక్రియ ప్రారంభించగానే.. మీ రిజస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు SMS రూపంలో 6 సంఖ్యలు గల రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఈ Ref Noను YONO క్యాష్ PINతో పాటు 30 నిమిషాలు మాత్రమే వ్యాలీడ్‌గా ఉంటుంది.

కస్టమర్లు తమ Android, iOS స్మార్ట్ ఫోన్ డివైజ్ ల్లోని YONO యాప్ ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు. వెబ్ లో బ్రౌజర్ ద్వారా కూడా YONO క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చు. నెలకు రెండు లావాదేవీలు మాత్రమే చేసుకునేందుకు అనుమతి ఉంది. ఏటీఎం దగ్గరకు వెళ్లేటప్పుడు డెబిట్ కార్డు, పిన్ నెంబర్ అవసరం లేకుండానే ఈ యాప్ ద్వారా మనీ విత్ డ్రా చేసుకోవచ్చు. కార్డు క్లోనింగ్, కార్డు స్కిమ్మింగ్ వంటి మోసాలపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. క్యాష్ విత్ డ్రా చేసి రివార్డు పాయింట్లు ఎలా పొందాలో ప్లాన్ చేసుకోండి.