Bank Holidays In August : ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులే….!

ఆగస్టు నెలలో దాదాపుగా 15 రోజులు బ్యాంకులకు సెలవులతోనే గడిచిపోతుంది. సో... వచ్చే నెలలో మీకు ఏమైనా బ్యాంకు పనులుంటే ముందే మీ బ్యాంకులో సెలవులు ఎప్పుడెప్పుడున్నాయో ఇప్పుడే తెలుసుకుని దాని ప్రకారం వచ్చె నెలలో మీ పనులకు ఇబ్బంది లేకుండా చూసుకోండి.

Bank Holidays In August : ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులే….!

Bank Holidays

Bank Holidays In August :  ఆగస్టు నెలలో దాదాపుగా 15 రోజులు బ్యాంకులకు సెలవులతోనే గడిచిపోతుంది. సో… వచ్చే నెలలో మీకు ఏమైనా బ్యాంకు పనులుంటే ముందే మీ బ్యాంకులో సెలవులు ఎప్పుడెప్పుడున్నాయో ఇప్పుడే తెలుసుకుని దాని ప్రకారం వచ్చె నెలలో మీ పనులకు ఇబ్బంది లేకుండా చూసుకోండి.

బ్యాంకు ఉద్యోగుల‌కు ఇచ్చే సెల‌వుల‌ను రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు క్యాట‌గిరీలుగా విడ‌దీసింది. హాలీడే అండ‌ర్ నెగోషియ‌బుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్‌, రియ‌ల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ హాలీడే , బ్యాంక్స్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ పేరిట విభ‌జించింది.

ఆగ‌స్టులో వ‌చ్చే పండుగలు.. నెగోషియ‌బుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప‌రిధిలోకి వ‌స్తున్నాయి. దీంతో ఆయా పండుగ‌ల‌కు సెల‌వులు వ‌చ్చేశాయి. అదే స‌మ‌యంలో ప‌లు రాష్ట్రాల్లో అన్ని బ్యాంకింగ్ కంపెనీలు బ్యాంక్ హాలీడేలు పాటించ‌డం లేదు. ఆయా రాష్ట్రాల్లో పండుగ‌లు, లేదా ప్ర‌భుత్వాల నోటిఫికేష‌న్ల‌ను బ‌ట్టి బ్యాంకులకు సెల‌వులు ఇస్తారు.

1వ తేదీ ఆదివారంతోనే ఆగ‌స్టు నెల మొద‌ల‌వుతుంది. క‌నుక ఒక‌టో తేదీన బ్యాంకులు మూసి ఉంటాయి. దీంతోపాటు రెండో శ‌నివారం, నాలుగో శ‌నివారం, ఆదివారాల‌తో క‌లిపి మొత్తం ఎనిమిది సెల‌వులు వ‌స్తాయి. ఆగ‌స్టు 15స్వాతంత్ర్య దినోత్స‌వం కూడా ఆదివారం వచ్చింది.

ఆగ‌స్టు 16న పార్శీ నూత‌న సంవ‌త్స‌రాది జరుపుకుంటారు. ఈసందర్భంగా బెలాపూర్‌, ముంబై, నాగ్‌పూర్ వాసులు సంబరాలు చేసుకుంటారు. 19న మొహ‌రం సంద‌ర్భంగా అగ‌ర్త‌ల‌, అహ్మ‌దాబాద్‌, బెలాపూర్‌, భోపాల్‌, హైద‌రాబాద్‌, జైపూర్‌, కాన్పూర్‌, జ‌మ్ము, కోల్‌క‌తా, ల‌క్నో, ముంబై, నాగ్‌పూర్‌, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్‌, రాంచీ, శ్రీ‌న‌గ‌ర్‌ల‌లో బ్యాంకులు ప‌నిచేయ‌వు.

ఆగ‌స్టులో సెల‌వులు ఇవే..
ఆగస్టు 1- ఆదివారం
ఆగస్టు 8- ఆదివారం
ఆగస్టు 13- దేశ‌భ‌క్తుల దినోత్స‌వం
ఆగ‌స్టు 14- రెండో శ‌నివారం
ఆగ‌స్టు 15- స్వాతంత్ర్య దినోత్స‌వం, ఆదివారం
ఆగ‌స్టు 16- పార్శీ నూత‌న సంవ‌త్స‌రాది
ఆగ‌స్టు 19- మొహ‌ర్రం
ఆగ‌స్టు 20-మొహ‌ర్రం/ఫ‌స్ట్ ఓనం
ఆగ‌స్టు 21- తిరువోనం
ఆగ‌స్టు 22- ఆదివారం
ఆగ‌స్టు 23- శ్రీ నారాయ‌ణ గురు జ‌యంతి
ఆగ‌స్టు 28- నాలుగో శ‌నివారం
ఆగ‌స్టు 29- ఆదివారం
ఆగ‌స్టు 30- జ‌న్మాష్ట‌మి
ఆగ‌స్టు 31: శ్రీ కృష్ణ అష్ట‌మి