కరోనా టైం : June లో Bank Holidays

  • Published By: madhu ,Published On : June 1, 2020 / 03:42 AM IST
కరోనా టైం : June లో Bank Holidays

భారతదేశాన్ని కరోనా వీడడం లేదు. ప్రతి రోజు పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. లాక్ డౌన్ ఇంకా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ 72వ రోజుకు చేరుకుంది. దీంతో ఆర్థిక రంగం కుదేలైంది. ఎన్నో రంగాలు నష్టాల బాట పడుతున్నాయి. ఉద్యోగులు, సామాన్యులను చిక్కుల్లో పడేస్తోంది. ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవాలంటే బ్యాంకుల అవసరం ఎంతో ఉంటుంది.

చిన్న చిన్న పనులు ప్రతి నెలా అందరికీ ఉంటాయి. అయితే..బ్యాంకులకు సెలవులున్న సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. అదే..బ్యాంకు హాలీడేస్ ఎప్పుడో తెలుసుకొంటే ఏ ఇబ్బంది ఉండదు. 2020, June నెలలో సెలవులు ఈ విధంగా ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్తగా బ్యాంకులకు ఏ సెలవులు లేవు. కేవలం ఆదివారం, రెండో, నాలుగో శనివారాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంది. ఆదివారాలు 7, 14, 21, 28 తేదీల్లో బ్యాంకులు పని చేయవు. అలాగే రెండో శనివారం 13, నాలుగో శనివారం 27 తేదీల్లో బ్యాంకులకు హాలీడే. 

National Holidays
07th June Sunday
13th June Saturday
14th June Sunday
21st June Sunday
27th June Saturday
28th June Sunday

Regionla Holidays

Date State Day Occasion
15 June Aizawl & Bhubaneswar Monday  Y.M.A. Day/Raja Sankranti
18 June Jammu & Kashmir Thursday Guru Hargobind Ji’s Birthday
30 June Mizoram Tuesday Remna Ni
23 June Odisha  Tuesday Ratha Yatra
05 June Sikkim Friday Saga Dawa

భారత్‌ కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. కరోనా టేబుల్‌లో ఇండియా ఎగబాకుతోంది. అన్ని దేశాలను దాటుకుంటూ పైపైకి పోతోంది. ప్రస్తుతం లక్షా 86 వేలకు పైగా కేసులతో ఎనిమిదో స్థానానికి చేరుకుంది ఇండియా. చాపకింద నీరులా విస్తరిస్తోన్న వైరస్‌ మహమ్మారి దేశం మొత్తం విస్తరించి పట్టిపీడిస్తోంది. ప్రధాన నగరాల్లోనే కోవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే మరణాల సంఖ్య తక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగిస్తోంది. రికవరీ రేటులోనూ భారత్‌ మంచి స్థానంలో ఉంది. ఇలాగే కేసుల సంఖ్య కొనసాగితే రానున్న పదిహేను రోజుల్లో టాప్‌ ఫైవ్‌లోకి చేరే ప్రమాదం కనిపిస్తోంది. 

Read: బ్యాంకులకు వచ్చే 3నెలల్లో 30రోజుల సెలవు