స్పాట్ లోన్: దేశవ్యాప్తంగా బ్యాంకుల రుణమేళా స్టార్ట్

  • Published By: venkaiahnaidu ,Published On : October 3, 2019 / 04:49 AM IST
స్పాట్ లోన్: దేశవ్యాప్తంగా బ్యాంకుల రుణమేళా స్టార్ట్

ఇవాళ(అక్టోబర్-3,2019)నుంచి నాలుగురోజుల పాటు దేశంలోని 250జిల్లాల్లో మొదటి ఫేస్ లో భాగంగా బ్యాంకులు రుణ మేళా నిర్వహిస్తున్నాయి. అన్ని బ్యాంకులు,ఎస్ బీఐ,పీఎన్ బీ,బీవోబీ,కార్పొరేషన్ బ్యాంకులు కూడా రుణమేళాలో పాల్గొంటున్నాయి.ఫెస్టివల్ సీజన్ డిమాండ్ ను దృష్ట్యాలో ఉంచుకుని బ్యాంకులు రుణమేళా నిర్వహిస్తున్నాయి. లోన్ మేళా ద్వారా రీటైల్ కస్టమర్లకు,సూక్ష్మ,చిన్న,మధ్యతరగతి వ్యాపారాల విభాగంలో,అగ్రికల్చర్ లోన్, ఆటో,వాహన,గృహ,విద్య,పర్శనల్ కేటగిరీస్ విభాగంలో స్పాట్ లో ఈ మేళా ద్వారా లోన్ ను బ్యాంకులు అందిచనున్నాయి. ఎంపిక చేయబడిన జిల్లాల్లో ఈ కార్యక్రమం గురించి ప్రజలకు తెలియజేయడానికి అవగాహన శిబిరాలు నిర్వహించబడతాయి.

ఈ నెల ప్రారంభంలో జరిగిన వార్షిక పనితీరు సమీక్షలో.. గుర్తించిన 400 జిల్లాల్లో రుణమేళా చేపట్టాలని ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్ణయించాయి. తరువాత, ప్రైవేటు బ్యాంకులు కూడా ఇందులో చేరడానికి సుముఖత వ్యక్తం చేశాయి. బ్యాంకులని వినియోగదారుల ఇంటి దగ్గరకు తీసుకెళ్లాలని నిర్ణయించిన క్రమబద్ధమైన బ్యాంక్ సంస్కరణ ప్రక్రియలోఇది ఒక భాగం. పండుగ సీజన్ లో ఈ రుణమేళా వ్యాపారాలకు సహాయం చేస్తుంది. 

రుణాలు పంపిణీ చేసేటప్పుడు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, అన్ని వివేకవంతమైన ఆర్థిక నిబంధనలు, తగిన శ్రద్ధను అనుసరిస్తాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని ప్రభుత్వ రంగ బ్యాంకు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.