రూ.2వేల నోట్ల రద్దుపై కేంద్రమంత్రి కీలక ప్రకటన

2016 నవంబర్ 8న మోడీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేశారు. అవినీటిపై పోరాడేందుకు, బ్లాక్ మనీ నియంత్రణకు ఈ నిర్ణయం

  • Published By: veegamteam ,Published On : February 26, 2020 / 05:33 PM IST
రూ.2వేల నోట్ల రద్దుపై కేంద్రమంత్రి కీలక ప్రకటన

2016 నవంబర్ 8న మోడీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేశారు. అవినీటిపై పోరాడేందుకు, బ్లాక్ మనీ నియంత్రణకు ఈ నిర్ణయం

2016 నవంబర్ 8న మోడీ సర్కార్ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. రూ.500, రూ.వెయ్యి నోట్లను రద్దు చేశారు. అవినీటిపై పోరాడేందుకు, బ్లాక్ మనీ నియంత్రణకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోడీ దేశ ప్రజలకు చెప్పారు. ఆ తర్వాత.. కొత్తగా రూ.2వేల నోటు(Rs 2,000 notes) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద నోట్ల కారణంగా అవినీతి, బ్లాక్ మనీ(black money) పెరిగిపోతోందని ఆరోపిస్తూ.. గతంలో ఉన్న రూ.500, రూ.వెయ్యి నోట్లను మోడీ ప్రభుత్వం రద్దు చేసింది(demonetisation). అయితే అంతకన్నా పెద్దదైన రూ.2వేల నోటు తీసుకొచ్చారు. దీంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీని ద్వారా అవినీతికి, బ్లాక్ మనీకి ఎలా చెక్ పెడతారని ప్రశ్నలు వచ్చాయి. ఆ తర్వాత కొంతకాలంగా రూ.2వేల నోటు రద్దు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్వరలో రూ.2వేట నోటుని రద్దు చేస్తారని ప్రచారం నడుస్తోంది.

రూ.2వేల నోటు కనిపించడం లేదు:
దీనికి కారణం లేకపోలేదు. రూ.2వేల నోట్లు బయట ఎక్కడా కనిపించడం లేదు. ఏటీఎంలలో(atms) కనిపించక చాలా రోజులే అయ్యింది. బ్యాంకుల్లో కూడా కనిపించడం లేదు. దీంతో రూ.2వేల నోటుని మోడీ ప్రభుత్వం రద్దు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆర్బీఐతో పాటు కేంద్ర ప్రభుత్వం పలుమార్లు క్లారిటీ ఇచ్చింది. రూ.2వేల నోటు రద్దు చేస్తారనే వార్తల్లో నిజం లేదని పలు మార్లు చెప్పారు.

ఏటీఎంలలో రూ.2వేల నోటు పెట్టొద్దని బ్యాంకులకు ఆదేశాలు:
తాజాగా ఏటీఎంలలో రూ.2వేట నోట్లు పెట్టొద్దంటూ బ్యాంకులకు ఆర్ధికశాఖ ఆదేశాలు జారీ చేసిందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో మరోసారి రూ.2వేల నోటు రద్దు గురించి ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మళ్లీ స్పందించాల్సి వచ్చింది. దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులతో బుధవారం(ఫిబ్రవరి 26,2020) భేటీ నిర్వహించిన ఆమె.. రూ.2వేల నోట్లు ఏటీఎంలలో పెట్టొద్దంటూ తాము బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆ వార్తలను ఆమె ఖండించారు. అసలు అలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేశారు. కేంద్రమంత్రి క్లారిటీ ఇచ్చిన తర్వాతైనా .. రూ.2వేట నోట్ల రద్దు గురించి ప్రచారానికి తెరపడుతుందో లేదో చూడాలి.

రూ.2వేల నోటుతో బ్యాంకులకు తలనొప్పులు:
కాగా, ఇకపై రూ.2వేట నోట్లు ఏటీఎంలలో పెట్టబోమని ఇటీవలే ఇండియన్ బ్యాంకు(indian bank) అధికారులు ప్రకటించారు. పెద్ద నోటు స్థానంలో రూ.200 నోట్లు ఎక్కువగా ఏటీఎంలలో పెడతామని చెప్పింది. ”ఏటీఎంల నుంచి రూ.2వేటు నోటు డ్రా చేసిన వెంటనే కస్టమర్లు బ్యాంకుకి వస్తున్నారు. చిల్లర ఇవ్వాలని అడుగుతున్నారు. పెద్ద సంఖ్యలో ఇలా కస్టమర్లు బ్యాంకులకు వస్తున్నారు. దీంతో పెద్ద పెద్ద క్యూలు ఏర్పడుతున్నాయి. బ్యాంకులో ఇతర పనుల కోసం వచ్చేవారి కన్నా.. రూ.2వేల నోటుకి చిల్లర కోసం వచ్చే కస్టమర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇది మాకు పెద్ద సమస్యగా మారింది. దీంతో ఏటీఎంలలో రూ.2వేల నోట్లు పెట్టకూడదని మేము నిర్ణయం తీసుకున్నాము” అని ఇండియన్ బ్యాంకు అధికారులు వెల్లడించారు.

See Also>>సైన్స్ రిపోర్టు : Audi, BMW, Mercedes Benz వంటి ఖరీదైన కార్లు నడిపే వారు స్టూపిడ్ పర్సన్ కావచ్చు