Holi : బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు!

మార్చిలో హోలీ పండుగ వస్తోంది. దీంతో దాదాపు బ్యాంకులన్నీ మూత పడనున్నాయి. హోలీ పండుగను కొన్ని రాష్ట్రాల్లో ఒక రోజు, మరికొన్ని రాష్ట్రాల్లో రెండు రోజులు జరుపుకుంటుంటారు. మార్చి 18వ...

Holi : బ్యాంకులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు!

Bank-Holidays

Bank Holidays Holi : ఏదైనా పని చేయడానికంటే ముందు ప్లాన్ చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఎలా చేయాలని ముందుగానే ఆలోచించుకుని వెళుతుంటారు. ఇంటి పనులు, ఇతర పనులేదైనా ఇబ్బందులు కలుగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటాం. ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే.. మరిన్ని జాగ్రత్త పడుతుంటారు. డబ్బులు ఎవరికైనా పంపించడం, డీడీలు తీయడం, డబ్బులను విత్ డ్రా చేయడం…ఏటీఎం, రుణాలు పొందడం..ఇలా ఎన్నో పనుల మీద బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. బ్యాంకులకు సెలవులు కూడా ఉంటాయి కదా. కానీ.. సెలవులు తెలియకపోవడంతో కొంతమంది సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. బ్యాంకులు ఏ రోజు తెరిచి ఉంటాయో, ఏ రోజు మూసి ఉంటాయో చాలాసార్లు తెలియదు. అయితే ఈ సెలవులు అనేవి రాష్ట్రాల్లోని పండుగలను కలుపుకుని ఉంటాయి.

Read More : Bank Holidays : మార్చిలో బ్యాంకులకు సెలవులు దినాలు

మార్చిలో హోలీ పండుగ వస్తోంది. దీంతో దాదాపు బ్యాంకులన్నీ మూత పడనున్నాయి. హోలీ పండుగను కొన్ని రాష్ట్రాల్లో ఒక రోజు, మరికొన్ని రాష్ట్రాల్లో రెండు రోజులు జరుపుకుంటుంటారు. మార్చి 18వ తేదీ శుక్రవారం హోలీ. కొన్ని రాష్ట్రాల్లో 17వ తేదీన జరుపుకోబోతున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో మార్చి 19వ తేదీన కూడా హోలీని జరుపుకోనున్నారు. మార్చి 20వ తేదీన ఆదివారం రానుంది. అంటే మొత్తం మీద మార్చి 17వ తేదీ నుంచి మార్చి 20వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు కొన్ని రాష్ట్రాల్లో సెలవులు రానున్నాయి. బుధవారం మాత్రమే పని చేయనున్న బ్యాంకులు మార్చి 21వ తేదీన సోమవారం ఓపెన్ అవుతాయి.

Read More : Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. ఎందుకంటే?

మార్చి 17న హోలికా దహన్ ఫెస్టివల్ ను ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో జరుకుంటారు. మార్చి 18న ఐజ్వాల్, భేలాపూర్, భోపాల్, అహ్మాదాబాద్, గ్యాంగ్ టక్, గౌహతి, హైదరాబాద్, జైపూర్, కోల్ కతా, లక్నో, కాన్పూర్, నాగ్ పూర్, పాట్నా, న్యూఢిల్లీ, శ్రీనగర్, షిల్లాంగ్ మరికొన్ని రాష్ట్రాల్లో హోలీ వేడుకలను జరుపుకోనున్నారు. ఇక మార్చి 19వ తేదీన మణిపూర్, బీహార్, ఒడిశా ఫెస్టివల్ ను జరుకోనున్నారు. మొత్తంగా మార్చి నెలలో హోలీ పండుగ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో నాలుగు రోజులు వరుసగా సెలవులు వచ్చాయి.