బార్బీ బొమ్మ మారింది

  • Published By: madhu ,Published On : September 29, 2019 / 01:40 AM IST
బార్బీ బొమ్మ  మారింది

బార్బీ బొమ్మను చూస్తే పడుచు పిల్లలా తెగ అందంగా ఉంటుంది కదూ.. ఈ బొమ్మ పుట్టి…60 ఏళ్లు అయిపోయింది. 1959 మార్చి 09న తొలిసారి అమెరికాకు చెందిన బొమ్మల కంపె నీ మాటెల్ బార్బీ బొమ్మను తయారు చేసి న్యూయార్క్ టాయ్ ఫెయిర్‌లో ప్రదర్శనకు పెట్టింది. తక్కువ సమయంలోనే ఖండాంతరాలు దాటిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకర్షించింది ఈ బార్బీ. నీలి కళ్లు..గులాబీ రంగు దస్తులు..చూడముచ్చటగొలిపే ఈ బొమ్మ అంటే అందరూ ఫిదా అవుతుంటారు. ఇదిలా ఉంటే..దీని రూపం మారిపోయింది.

ఆరు దశాబ్దాల తర్వాత బొమ్మకు కొత్త రూపం తీసుకొచ్చారు. బార్బీ అనగానే అమ్మాయి బొమ్మలే ఉండేవి కదా. తాజాగా అమ్మాయిగా..లేదంటే..అబ్బాయిగా ఎలాగైనా మార్చుకొనే విధంగా బొమ్మను తీర్చిదిద్దారు. ఈ బొమ్మలను మేటెల్ సంస్థ తయారు చేసింది. బొమ్మ రంగును తెల్లగా కాకుండా..కాస్త ముదురు గోధుమవర్ణంతో చేసి..దానికి తీసి పెట్టుకోగల రెండు రకాల విగ్గులను అందిస్తున్నారు. అబ్బాయిలా ఉండాలంటే..ఆ విగ్గు పెట్టి..అబ్బాయి దుస్తులు వేయాలి. పొడవు జుట్టు విగ్గుతో అలంకరిస్తే..అమ్మాయి దుస్తులు వేయొచ్చు. ఈ బొమ్మ ఖరీదు 30 డాలర్లు (భారత కరెన్సీలో రూ. 2 వేల 120)

మార్కెట్లోకి వచ్చిన మొదటిసారే మూడు లక్షల బొమ్మలు అమ్ముడుపోయాయంటే చూడండి.. బార్బీకున్న కొత్తదనం. బార్బీ బొమ్మ కొత్తది తయారు కావాలంటే 13 నుంచి 18 నెలలు పడుతుంది. అమెరికా లాస్ ఏంజిల్స్ లోని సీగండో డిజైన్ స్టూడియోలో వంద మందికి పైగా డిజైనర్లు కొత్త డిజైన్ల కోసం కష్టపడుతూనే ఉంటారు. బార్బీ ముఖానికి సొగసైన రూపాన్ని ఇవ్వడానికి త్రీడీ ప్రింటింగ్ సాఫ్ట్‌ వేర్ ను వాడుతారు. ఇవన్నీ రెడీ ఐన తర్వాత డిజైనింగ్ నిపుణుల బృందం దానికి అందమైన రూపాన్ని ఇస్తారు. బార్బీ డాల్ ఫాలోయింగ్. పిల్లల పుట్టినరోజులకు, శుభకార్యాలకు ఈ బొమ్మలనే బహుమతులుగా ఇస్తుంటారు పెద్దవారు. అంతేకాదు చిన్న పిల్లలు ఏడుస్తున్నపుడు వారిని ఊరడించడానికి ఈ బొమ్మలతోనే ఆటలాడిస్తారు తల్లులు.