PURE EV : ఒకినావా బాటలో ప్యూర్ ఈవీ.. స్కూటర్స్‌ రీకాల్

తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొన్న వినియోగదారులను నేరుగా సంప్రదించాలని...వాళ్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ప్యూర్ ఈవీ నిర్ణయించింది. కొన్ని రోజుల క్రితం...

PURE EV : ఒకినావా బాటలో ప్యూర్ ఈవీ.. స్కూటర్స్‌ రీకాల్

Pure Ev

PURE EV Recalls E-Scooters : లోపాలు ఉన్న టూ వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను తక్షణం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించడంతో కంపెనీలు వాయువేగంతో స్పందిస్తున్నాయి. ఇప్పటికే ఒకినావా ఆటోటెక్ కంపెనీ 3 వేలకు పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను వెనక్కి తీసుకోగా.. తాజాగా.. హైదరాబాద్‌కు చెందిన ప్యూర్ ఈవీ సంస్థ కూడా అదే బాటలో నడుస్తోంది. ఇటీవల నిజామాబాద్‌తో పాటు చెన్నైలోనూ ప్యూర్ ఈవీ తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో తమ కంపెనీకి చెందిన రెండు వేలకు పైగా ఈవీ స్కూటర్స్‌ను రీకాల్ చేయాలని పూర్ ఈవీ సంస్థ నిర్ణయించింది. బ్యాటరీ లోపాలతో పాటు వెహికల్స్‌ను ఇంకేమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామని పూర్ ఈవీ ప్రకటించింది.

Read More : Telangana : ఎలక్ట్రిక్‌ వాహనాలు కొనేవారికి ప్రభుత్వం బంపర్ ఆఫర్‌!

ఇప్పటి వరకు తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొన్న వినియోగదారులను నేరుగా సంప్రదించాలని…వాళ్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ప్యూర్ ఈవీ నిర్ణయించింది. కొన్ని రోజుల క్రితం నిజామాబాద్‌లో ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ పేలడంతో 80 సంవత్సరాల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. డీలర్‌తో పాటు తయారీదారులపై నిజామాబాద్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దేశవ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో చిక్కుకున్న ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. మరోవైపు ఎలక్ట్రిక్‌ వాహనాల్లో మంటలు చెలరేగడం.. బ్యాటరీలు పేలిపోవడంపై కేంద్రం అప్రమత్తమైంది. ప్రమాదాలపై అధ్యయనం చేయడానికి నిపుణుల కమిటీని నియమించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో ప్రమాదాలను నివారించేందుకు త్వరలోనే గైడ్‌లైన్స్ విడుదల చేస్తామని తెలిపారు.

Read More : Central Govt : ఎలక్ట్రిక్‌ వాహనాల క్వాలిటీకి సంబంధించి త్వరలో కఠిన నిబంధనలు

నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా… కేంద్రం చర్యలు తీసుకోనుంది. విద్యుత్‌ వాహనాల తయారీలో నాణ్యత పాటించకుండా రాజీపడితే కఠిన చర్యలు తీసుకుంటామని గడ్కరీ హెచ్చరించారు. భారీగా ఫైన్లు వేయడంతో పాటు వాహనాలను రీకాల్ చేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో బైక్‌ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్‌ బైక్‌ల వాటా కేవలం 2 శాతం మాత్రమే. 2030 నాటికి దీన్ని 80 శాతానికి చేర్చాలని కేంద్రం భావిస్తోంది. అందుకు తగ్గట్లుగా చర్యలు తీసుకుంటోంది. అయితే ఇటీవల వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు తగలబడడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఈ ఘటనలపై ఇప్పటికే నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సిఫార్సులు చేస్తుందని గడ్కరీ తెలిపారు.