సరిదిద్దుకోండి : క్రెడిట్ కార్డుపై చేసే 6 తప్పులు ఇవే

క్రెడిట్ కార్డు. ఆపదలో ఆదుకుంటుంది. చేతిలో డబ్బు లేకపోయినా పని పూర్తవుతుంది. ఎవరినీ అప్పు అడక్కుండానే గట్టెక్కిస్తుంది. ఇంత ఉపయోగం ఉన్న క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవటంలో మాత్రం భారతీయులు చాలా తప్పులు చేస్తున్నారు.

  • Published By: sreehari ,Published On : March 6, 2019 / 07:41 AM IST
సరిదిద్దుకోండి : క్రెడిట్ కార్డుపై చేసే 6 తప్పులు ఇవే

క్రెడిట్ కార్డు. ఆపదలో ఆదుకుంటుంది. చేతిలో డబ్బు లేకపోయినా పని పూర్తవుతుంది. ఎవరినీ అప్పు అడక్కుండానే గట్టెక్కిస్తుంది. ఇంత ఉపయోగం ఉన్న క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవటంలో మాత్రం భారతీయులు చాలా తప్పులు చేస్తున్నారు.

క్రెడిట్ కార్డు. ఆపదలో ఆదుకుంటుంది. చేతిలో డబ్బు లేకపోయినా పని పూర్తవుతుంది. ఎవరినీ అప్పు అడక్కుండానే గట్టెక్కిస్తుంది. ఇంత ఉపయోగం ఉన్న క్రెడిట్ కార్డును ఉపయోగించుకోవటంలో మాత్రం భారతీయులు చాలా తప్పులు చేస్తున్నారు. ఒక్కసారి క్రెడిట్ కార్డుకు అర్హత సాధించిన తర్వాత.. వినియోగంలో చేస్తున్న తప్పుల వల్ల రేటింగ్ కోల్పోతున్నారు. అదనపు మూల్యాన్ని చెల్లిస్తున్నారు. భారతీయులు ఎక్కువ చేసే 6 క్రెడిట్ కార్డు తప్పులు ఇవే.
Also Read : ఎట్టా ఇచ్చారు : ఆకాశంలో భూమి.. నకిలీ మనుషులు.. రూ.2 కోట్ల బ్యాంక్ లోన్

1. ఫుల్ పేమెంట్ చేయరు
కార్డు ఉంది కదా అని గీకేస్తారు. వేలకు వేలు ఖర్చు చేసేస్తారు. బిల్లు కట్టాల్సిన టైం వచ్చేసరికి చేతిలో డబ్బులు ఉండవు. దీంతో మినిమమ్ పేమెంట్ చేసుకుంటూ వెళతారు. దీని వల్ల చక్రవడ్డీ పడుతుంది. అసలు అలాగే ఉంటుంది. చాలా మంది చేసే తప్పుల్లో మొదటిది ఇది. క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తేనే మంచిది. లేకపోతే క్రెడిట్ హిస్టరీపై ప్రభావం చూపుతుంది. పాయింట్లు తక్కువగా వస్తాయి.

2. లిమిట్ మొత్తాన్ని వాడేయకూడదు
క్రెడిట్ కార్డు విలువ లక్ష రూపాయలు అనుకుంటే.. ఆ మొత్తాన్ని వాడేయకూడదు. కార్డు లిమిట్ లో కేవలం 30-40శాతం మాత్రమే వాడుకోవాలి. అంతకుమించి లేదా మొత్తం వాడేయటం వల్ల క్రెడిట్ స్కోర్ పాయింట్లు తగ్గుతాయి.

3. నగదు డ్రా చేయకుండా ఉంటేనే బెటర్
క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేయకుండా ఉంటేనే బెటర్. దీనికి కారణం అధికంగా ఉండే ఛార్జీలు. డబ్బులు డ్రా చేసిన వెంటనే 2.5-3.5శాతం ఛార్జీలు వసూలు చేస్తారు. ఆ తర్వాత వడ్డీ పడుతుంది. ఇది 4 రూపాయల వరకు ఉంటుంది. ఒకవేళ అత్యవసర సమయంలో డబ్బులు డ్రా చేసినా.. వెంటనే కట్టేయాలి. బిల్లు టైంకి మొత్తం క్లియర్ చేయాలి. లేకపోతే అసలు-వడ్డీ కలిసి భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

4. ఎక్కువ క్రెడిట్ కార్డులకు అప్లయ్ చేయకూడదు
ఒక్క బ్యాంక్ క్రెడిట్ కార్డు వచ్చిందంటే చాలు.. వరసగా అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డులు తీసుకుంటుంటారు చాలా మంది. ఇది తప్పు అంటున్నారు ఆర్థిక నిపుణులు. తక్కువ సమయంలో ఎక్కువ కార్డులకు దరఖాస్తు చేయకూడదు అంటున్నారు. ఇలాంటి చర్యల వల్ల మీ అవసరం ఏంటో వారికి తెలిసిపోయి.. బ్లాక్ చేసే ప్రమాదం ఉంది అంటున్నారు. మీ ఆదాయం ఎంతో.. దానికి తగ్గట్టుగానే కార్డులను అప్లయ్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

5. రివార్డు పాయింట్లపై అవగాహన
రివార్డు పాయింట్లపై చాలా మందికి అవగాహన ఉండటం లేదు. తీసుకునే కార్డు ఆధారంగా వాటిని ఉపయోగించుకోవాలి. వీటిని ఎప్పటికప్పుడు వాడుకుంటేనే బెటర్. కార్డు కాలపరిమితి ముగిసే సమయానికి ఒకేసారి వాడుకోవటం వల్ల నష్టం అంటున్నారు నిపుణులు. రివార్డు పాయింట్లు వాడుకోకపోవటం వల్ల చాలామంది ఏటా క్రెడిట్ కార్డు చార్జీలను చెల్లిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయా కార్డుకు ఉండే రివార్డు పాయింట్ల ఉపయోగాలు – నష్టాలు ఏంటో స్పష్టమైన అవగాహన ఉంటేనే లాభం ఉంటుంది అంటున్నారు.

6. కార్డులను వాడుకపోతే క్లోజ్ చేయాలి
చాలా మంది రెండు, మూడు కార్డులు తీసుకుంటున్నారు. కాకపోతే వాడేది ఒకటే. దీని వల్ల మిగతా కార్డులకు కూడా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కార్డు ఉండి.. దాన్ని ఉపయోగించుకోకపోతే క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. ఇది భవిష్యత్ లో లోన్ తీసుకునే సమయంలో ప్రభావం చూపిస్తోంది. సో.. వాడని క్రెడిట్ కార్డులను ఎక్సపయిరీ డేట్ వచ్చే వరకు వదిలేయకుండా.. ముందుగానే క్లోజ్ చేస్తే సో బెటర్.

క్రెడిట్ కార్డు వినియోగదారులా.. భారతదేశంలో ఎక్కువ మంది చేస్తున్న తప్పులు ఇవే. ఇప్పటికైనా వెంటనే మేల్కొనండి. కార్డు వినియోగంపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు ఆర్థిక నిపుణులు.
Also Read : విదేశాలకు వెళ్తున్నారా : ఎయిర్‌టెల్‌ Foreign Pass రీఛార్జ్ ఆఫర్