మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్ : తగ్గనున్న మద్యం ధరలు

మందుబాబులకు ఇది కిక్కిచ్చే న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే... మద్యం ధరలు తగ్గనున్నాయి. అవును.. బీర్, విస్కీ(beer, whisky) మరింత చౌక కానున్నాయి. బీర్, విస్కీ,

  • Published By: veegamteam ,Published On : February 24, 2020 / 06:37 PM IST
మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్ : తగ్గనున్న మద్యం ధరలు

మందుబాబులకు ఇది కిక్కిచ్చే న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే… మద్యం ధరలు తగ్గనున్నాయి. అవును.. బీర్, విస్కీ(beer, whisky) మరింత చౌక కానున్నాయి. బీర్, విస్కీ,

మందుబాబులకు ఇది కిక్కిచ్చే న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే… మద్యం ధరలు తగ్గనున్నాయి. అవును.. బీర్, విస్కీ(beer, whisky) మరింత చౌక కానున్నాయి. బీర్, విస్కీ, ఫ్లేవర్డ్ ఆల్కహాలిక్ బెవరేజస్ ధరలు(alocohol) ఈ సమ్మర్ లో తగ్గే చాన్స్ ఉంది. దీనికి కారణం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఆస్ట్రేలియా నుంచి మాల్ట్ బార్లీ(malt barley) దిగుమతి నిబంధనలను ప్రభుత్వం సవరించింది. దిగుమతి నిబంధనలు సవరించడంతో ఇకపై ఆస్ట్రేలియా మాల్ట్ బార్లీ మరింత ఎక్కువగా మన దేశంలోకి ప్రవేశించింది. మాల్ట్ బార్లీ(malt barley).. బీర్ తయారీలో వినియోగించే ప్రధాన పదార్దం(ingredient). ఒక లీటర్ బీర్ తయారీకి 200 గ్రాముల మాల్ట్ బార్లీ అవసరం అవుతుంది.

ఆస్ట్రేలియన్ మాల్ట్ బార్లీ దిగుమతి నిబంధనలు మరింత సరళతరం చేస్తున్నట్టు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కి భారత ప్రభుత్వం 2019 డిసెంబర్ లో తెలిపింది. ఫాస్పైన్ ఫుమిగేషన్ తో(phosphine fumigation) కూడిన బార్లీ దిగుమతికి భారత ప్రభుతం అంగీకారం తెలిపింది. గతంలో మెథైల్ బ్రొమైడ్(methyl bromide) ఆధారిత ఫుమిగేషన్ తో కూడిన బార్లీకి మాత్రమే భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చేది. దీన్ని సడలించింది. 

భారత్ లో మాల్ట్ బార్లీకి డిమాండ్ అధికంగా ఉంది. సప్లయ్ మాత్రం తక్కువగా ఉంది. మన దేశంలో ఉత్పత్తి అవుతున్న బార్లీలో.. 80శాతం పశువుల గ్రాసంగా వెళ్తోంది. దీంతో బీర్ తయారీకి సరిపడ బార్లీ దొరకడం లేదు. ఈ కారణంతో భారత ప్రభుత్వం ఆస్ట్రేలియా నుంచి బార్లీ దిగుమతి చేసుకుంటోంది. ప్రభుత్వం.. బార్లీ దిగుమతి నిబంధనలు సడలించడంతో.. బెవరేజ్ పరిశ్రమలకు కొంత ఊరట లభిస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. బెవరేజ్ కంపెనీలు.. బార్లీ కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. డిమాండ్ కు తగినట్టుగా ఆల్కహాల్ సప్లయ్ లేదు. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా నుంచి అదనంగా బార్లీ దిగుమతికి లైన్ క్లియర్ కావడంతో కొంతవరకు ఇబ్బందులు తప్పుతాయని చెబుతున్నారు. అంతేకాదు.. బీర్, విస్కీ ధరలు తగ్గే చాన్స్ ఉందన్నారు.

ఆస్ట్రేలియా నుంచి ఏడాదికి 10లక్షల టన్నుల బార్లీ దిగుమతిని టార్గెట్ గా పెట్టుకున్నట్టు వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన అధికారి ఒకరు తెలిపారు. మన దేశంలో పండించే బార్లీ ధరలతో పోలిస్తే.. ఆస్ట్రేలియాలో పండించే మాల్ట్ బార్లీ ధర చాలా తక్కువ. మన దేశంలో పండే బార్లీ 100 కిలోల ధర రూ.1900. అదే ఆస్ట్రేలియా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే మాల్ట్ బార్లీ రకం 100 కిలోల ధర రూ.2వేలు. ఈ రెండింటితో పోలిస్తే ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకునే మాల్ట్ బార్లీ ధర మరీ తక్కువ. 2020 ఏప్రిల్ నుంచి ఆస్ట్రేలియా నుంచి మాల్ట్ బార్లీ భారత్ కు దిగుమతి కానుంది. 

2020 సంవత్సరంలో ఆస్ట్రేలియా నుంచి 5లక్షల టన్నుల మాల్ట్ బార్లీ.. దిగుమతి కావొచ్చని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 70 మిలియన్ హెక్టార్ల భూమిలో 160 మిలియన్ టన్నుల బార్లీ పండిస్తున్నారు. బార్లీ పండించే దేశాల్లో రష్యా, చైనా, కెనడా, స్పెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, యూకే, భారత్ ఉన్నాయి. మన దేశంలో ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లో ఎక్కువగా బార్లీ పండిస్తారు