Best 5G Phones in India : రూ. 15వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Best 5G Phones : భారత మార్కెట్లో 5G నెట్‌వర్క్ వచ్చేసింది. దేశంలో అత్యంత వేగవంతమైన 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. మీరు ఇంకా 5G ఫోన్‌ని కొనుగోలు చేయలేదా?

Best 5G Phones in India : రూ. 15వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!

Best 5G Phones _ 5G services now available in India, check out best 5G phones for less than Rs 15,000

Best 5G Phones in India : భారత మార్కెట్లో 5G నెట్‌వర్క్ వచ్చేసింది. దేశంలో అత్యంత వేగవంతమైన 5G సర్వీసులు అందుబాటులోకి వచ్చేశాయి. మీరు ఇంకా 5G ఫోన్‌ని కొనుగోలు చేయలేదా? అయితే 5G ఫోన్ కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం. అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి అనేక ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు యూజర్లు 5G ఫోన్‌లపై భారీ డీల్స్ అందిస్తున్నాయి.

ఇతర ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్ ధరలకు దీపావళి సేల్ నిర్వహిస్తున్నాయి. Redmi Note 11T 5G, Poco M4 5G, Samsung Galaxy M13, మరిన్నింటితో సహా చాలా స్మార్ట్‌ఫోన్‌లు ఆన్‌లైన్‌లో డిస్కౌంట్ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ 5G డివైజ్‌లు భారత మార్కెట్లో రూ. 15వేల కన్నా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. అందులో కొన్ని బెస్ట్ 5G ఫోన్ డీల్‌లను ఓసారి లుక్కేయండి.

Redmi Note 11T 5G :
రెడ్‌మి నోట్ 11T 5G రూ. 15వేల లోపు అత్యుత్తమ 5G ఫోన్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. Samsung Galaxy M13తో పోలిస్తే.. అధిక రిజల్యూషన్, రిఫ్రెష్ రేట్‌కు సపోర్టుతో పెద్ద 6.6-అంగుళాల స్క్రీన్‌ని పొందవచ్చు. స్క్రీన్ FHD+ రిజల్యూషన్‌తో రన్ అవుతుంది. స్మోటర్ స్క్రోలింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం 90Hz వద్ద రిఫ్రెష్ అవుతుంది. హుడ్ కింద మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్ ఉంది. సాధారణ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. డిజైన్ అందంగా ఆకర్షణీయంగా ఉంది. కెమెరా ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి.

Best 5G Phones _ 5G services now available in India, check out best 5G phones for less than Rs 15,000

Best 5G Phones _ 5G services now available in India

ఎలాంటి లైటింగ్ పరిస్థితుల్లో మంచి డైనమిక్ క్వాలిటీ ఫొటోలు, వీడియోలను పొందవచ్చు. హ్యాండ్‌సెట్‌లో మెరుగైన ఆడియో కోసం స్టీరియో స్పీకర్‌లు కూడా ఉన్నాయి. హుడ్ కింద ఒక సాధారణ 5,000mAh బ్యాటరీని కనుగొనవచ్చు. Xiaomi రిటైల్ బాక్స్‌లో స్పీడ్ 33W ఛార్జర్‌ను అందిస్తోంది. బ్యాటరీని వేగవంతమైన రేటుతో అందిస్తుంది. రూ. 1,000 డిస్కౌంట్ కూపన్‌ను కూడా అందిస్తుంది. Redmi Note 11T 5G ఫోన్ అమెజాన్‌లో 128GB స్టోరేజ్ మోడల్‌కు రూ. 14,999కి సేల్ అవుతుంది. ట్రాన్సాక్షన్ పేజీలో డిస్కౌంట్ మొత్తం పొందవచ్చు.

Poco M45G :
రూ.11,000 కన్నా తక్కువ ధరకే 5G ఫోన్ కావాలనుకునే వారికి Poco M4 బెస్ట్ ఆప్షన్. ఈ డివైజ్ MediaTek డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌ను ఉపయోగిస్తోంది. హుడ్ కింద 5,000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ తేలికపాటి వినియోగంతో రోజుంతా వస్తుంది. కంపెనీ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్టు అందిస్తుంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పవచ్చు. కెమెరా పోటీకి సమానంగా ఉంది. 6.58-అంగుళాల Full HD+ స్క్రీన్ చాలా పవర్ ఫుల్ అందిస్తుంది. Poco M45Gphone ఫ్లిప్‌కార్ట్‌లో 4GB RAM + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999 తగ్గింపుతో అందుబాటులో ఉంది.

Best 5G Phones _ 5G services now available in India, check out best 5G phones for less than Rs 15,000

Best 5G Phones _ 5G services now available in India

Samsung Galaxy M13 5G :
5G Samsung ఫోన్‌లు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. Galaxy M13 5G కూడా అందులో ఒకటి. అమెజాన్‌లో రూ. 12వేల కన్నా తక్కువ ధరకు లభించే బెస్ట్ 5G ఫోన్ అని చెప్పవచ్చు. తగినంత పెద్ద బ్యాటరీ, డిస్‌ప్లే ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూసేవారికి ఇదే బెస్ట్ ఫోన్. 5,000mAh బ్యాటరీతో పాటు 6.5-అంగుళాల LCD స్క్రీన్‌తో వస్తుంది. ఈ ప్యానెల్ HD+ రిజల్యూషన్‌లో పనిచేస్తుంది.

Best 5G Phones _ 5G services now available in India, check out best 5G phones for less than Rs 15,000

Best 5G Phones _ 5G services now available in India

ఈ బడ్జెట్ Samsung ఫోన్ Mediatek Dimensity 700 చిప్‌ని ఉపయోగిస్తోంది. సాధారణ పర్ఫార్మెన్స్ అందించగలదు. కంపెనీ బాక్స్‌లో 15W ఛార్జర్‌ను అందిస్తుంది. కెమెరాల విషయానికొస్తే.. ధర కోసం మంచి ఫోటోలను పొందవచ్చు. పగటిపూట కలర్లతో అద్భుతమైన ఫోటోలను పొందవచ్చు. భారత మార్కెట్లో Samsung Galaxy M13 5G ఫోన్ అసలు ధర రూ. 13,999 నుంచి ప్రస్తుతం రూ. 11,999లకు అందుబాటులో ఉంది.

Realme 9i 5G :
రియల్‌మి 9i రూ. 15వేల కింద మరో బెస్ట్ 5G ఫోన్. 90Hz వద్ద రిఫ్రెష్ చేసే 6.6-అంగుళాల FHD+ స్క్రీన్‌ను కలిగిన ఆల్-రౌండర్ ఫోన్. Mediatek డైమెన్సిటీ 810 చిప్‌సెట్ ఈ డివైజ్ అందిస్తోంది. తగినంత పెద్ద 5,000mAh బ్యాటరీతో వస్తుంది. ఒకరికి 18W ఛార్జర్ మాత్రమే లభిస్తుంది.

Best 5G Phones _ 5G services now available in India, check out best 5G phones for less than Rs 15,000

Best 5G Phones _ 5G services now available in India

Redmi Note 11T 5G స్మార్ట్‌ఫోన్‌తో చాలా తక్కువ. ఈ రియల్‌మి ఫోన్‌కు దాని ధర పరిధిలో అత్యుత్తమ కెమెరా సెటప్ లేదు. Samsung Galaxy M13 లేదా Redmi Note 11Tతో మెరుగైన పర్ఫార్మెన్స్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో Realme 9i 5G ఫోన్ ధర రూ. 13,499 నుంచి అందుబాటలో ఉంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Best 5G Smartphones 2022 : రూ. 15వేల లోపు మంచి 5G ఫోన్ కావాలా? ఈ 5 బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్లపై ఓసారి లుక్కేయండి..!