2021లో ఉత్తమ ఇంటర్నెట్ ప్లాన్స్ ఇవే..

2021లో ఉత్తమ ఇంటర్నెట్ ప్లాన్స్ ఇవే..

2021

కరోనా మహమ్మారిపై పోరాటంలో ఎట్టకేలకు విజయం సాధించాము అనుకున్న తరుణంలో.. మరోసారి మహమ్మారి విస్తరిస్తూ.. కునుకులేకుండా చేస్తుంది.. కరోనా కారణంగా ప్రతీ ఒక్కరూ తీవ్ర ఇబ్బందులు పడుతుండగా.. మరోసారి వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పదు అనే సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇంటర్నెట్ కోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌‌లు ఏమి ఎంచుకోవాలి అనే విషయంపై అనుమానాలు ఉన్నాయి.

ఉత్తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు గురించి గూగుల్‌లో శోధనలు కూడా పెరిగాయి.. ఇంటి నుండి పనిచేసేవారు.. క్లాసులు వినేవారు.. వేగవంతమైన ఇంటర్నెట్ కోసం చూస్తున్నారు. జూమ్ సమావేశానికి హాజరు కావడం, ఇంటర్వ్యూ తీసుకోవడం, స్మార్ట్ టీవీలో సినిమాలను ఆస్వాదించడం కోసం హై-స్పీడ్ ఇంటర్నెట్‌ కావల్సిందే కదా?

కానీ, మీకు ఏ ఇంటర్నెట్ ప్లాన్ ఉత్తమమైనది అనే ప్రశ్న ప్రతిఒక్కరిలో ఉంది వారి కోసం..

1. జియో ఫైబర్:
మీరు ఇంటి నుండి, ఎక్కువగా వర్డ్ డాక్స్ మరియు ఈ మెయిళ్ళలో పనిచేస్తుంటే, రూ .699 ప్లాన్ మీకు అనువైనదే.. కొన్ని నగరాల్లో, వినియోగదారులు ఒక నెల ఉచిత ట్రయల్‌ను కూడా పొందవచ్చు.

2. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్

2021 లో అత్యుత్తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందించడానికి జొయోతో పోటీ పడుతోంది ఎయిర్‌టెల్.. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌లో జియో ఫైబర్ మాదిరిగానే ప్లాన్‌లు ఉన్నాయి. ఎయిర్‌టెల్ చందాదారులు ఎక్స్‌స్ట్రీమ్ 4 కె ఆండ్రాయిడ్ బాక్స్‌ను ఉచితంగా మరియు దాని ప్లాన్‌లతో అపరిమిత వాయిస్ కాలింగ్‌ను అందించే ల్యాండ్‌లైన్‌ను పొందుతారు. కొన్ని ప్లాన్‌లలో వినియోగదారులకు ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ మరియు ZEE5 లకు కాంప్లిమెంటరీ యాక్సెస్ లభిస్తుంది.

3. ACT ఫైబర్‌నెట్:
బ్రాడ్ బ్యాండ్ సేవల్లో ఎక్కువగా ఆదరణ ఉన్నది ACT ఫైబర్‌నెట్‌కే.. ఇంకా చాలా ప్రభావవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్ అయిన ACT ఫైబర్‌నెట్, మీరు ఇంటర్నెట్ వేగం కోసం మాత్రమే చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ అనిపిస్తుంది.

Best broadband plans in India-
JioFiber, Airtel Xstream Fiber and ACT Fibernet:

JioFiber Price Airtel Xstream Fiber Price ACT Fibernet Price
30Mbps ₹399 40Mbps ₹499 40Mbps ₹500
100Mbps ₹699 100Mbps ₹799 75Mbps ₹700
150Mbps ₹999 200Mbps ₹999 150Mbps ₹1,075
300Mbps ₹1,499 300Mbps ₹1,499 300Mbps ₹1,325
500Mbps ₹2,499 400Mbps ₹1,999
1Gbps ₹3,999 1Gbps ₹3,999 1Gbps ₹5,999